Wake Up at 3 am: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ఒక వ్యక్తి ప్రశాంతమైన నిద్ర పోయినప్పుడు మాత్రమే అతడు రోజంతా సంతోషంగా ఉండగలుగుతాడు. కానీ మీరు పూర్తిగా ఒత్తిడి లేకుండా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతి ఐదుగురిలో ఒకరు నిద్రలేమి సమస్యతో నేడు బాధపడుతున్నారు. చాలా మంది సమయానికి పడుకుంటారు కానీ తరచుగా మేల్కొనడం, రాత్రిపూట భయం కారణంగా తగినంతగా నిద్ర పోరు.
ఇదిలా ఉంటే ప్రతిరోజూ తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య ఒక నిర్దిష్ట సమయంలో మేల్కొనడం అనేది ఏదైనా అనారోగ్యం లేదా ఒత్తిడికి సంకేతం కావచ్చు. దీనికి గల కారణాలు తెలుసుకోకుంటే మాత్రం తీవ్రమైన సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది. అసలు ఉదయం 3 నుండి 5 గంటల మధ్య ఎందుకు మెలకువ వస్తుంది ? ఈ సమస్య నుండి ఎలా బయటపడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి, ఆందోళన:
రాత్రి నిద్రపోతున్నప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుతుంది. దీని కారణంగా నిద్ర ప్రభావితం అవుతుంది. వివిధ రకాల ఆలోచనల కారణంగా మీకు నిద్ర పట్టడంలో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇదే కాకుండా.. ఒత్తిడి హార్ట్ బీట్, ఆందోళనను పెంచుతుంది. ఆందోళన నిద్రలేమికి గల కారణాలలో ప్రాధానమైనది.
రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదల:
మీరు నిద్రపోతున్నప్పుడు ఆకలిగా అనిపిస్తే లేదా మీ చేతులు , కాళ్ళలో వణుకు వంటివి కలిగితే అది అధిక రక్తంలో చక్కెర పెరుగుదలకు సంకేతం కావచ్చు. ఈ స్థితిలో.. తరచుగా మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది. అంతే కాకుండా నిద్రకు పదే పదే అంతరాయం కలుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగేకొద్దీ, హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఎక్కువగా చెమటలు పట్టే అవకాశం కూడా ఉంటుంది.
హార్మోన్ల మార్పులు:
వయస్సు పెరుగుతోందని సూచించే లక్షణాలలో తరచుగా రాత్రిపూట మేల్కొనడం కూడా ఒకటి. చాలా మంది మహిళలు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇదే కాకుండా.. మీకు థైరాయిడ్ సమస్యలు ఉంటే కూడా నిద్ర లేమి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. థైరాయిడ్ ఉన్న వారు రాత్రి నిద్రపోతున్నప్పుడు అలసిపోయినట్లు, ఆందోళన చెందుతున్నట్లు ,ఒత్తిడికి గురవుతారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది.
ఆర్థరైటిస్ నొప్పి:
కొన్ని ఆరోగ్య పరిస్థితులు సాధారణంగా కనిపిస్తాయి కానీ అవి మీ నిద్రను ప్రభావితం చేస్తాయి. మీరు రాత్రి సమయంలో నిరంతరం ఒక నిర్దిష్ట సమయంలో మేల్కొంటే ఇవి తీవ్రమైన ఆర్థరైటిస్‌కు సంకేతాలు కావచ్చు. ఆర్థరైటిస్ శరీరంలో నొప్పిని కలిగిస్తుంది. ఇది రాత్రిపూట మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు ఆర్థరైటిస్ సమస్య ఉంటే..మీరు నిద్ర నుండి పదే పదే మేల్కొవాల్సి వస్తుంది.
Also Read: ప్రతి రోజు ఒక కప్పు పెరుగు తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాక్ అవుతారు
సమస్య నుండి బయటపడటం ఎలా ?
– రాత్రిపూట 3 గంటలకు మేల్కొనకుండా ఉండటానికి అంతే కాకుండా తగినంత నిద్ర పోవడానికి మీరు ఒత్తిడి లేకుండా ఉండటం ముఖ్యం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి.. మీరు ధ్యానం చేయడం మంచిది.
– కొన్నిసార్లు అలసట వల్ల కూడా నిద్ర పట్టకపోవచ్చు. అలసటను అధిగమించడానికి, క్రమం తప్పకుండా శారీరక శ్రమ , యోగా చేయండి.
– నిద్రపోయే ముందు భోజనం చేయవద్దు. మీ ఆహారంలో ఫైబర్, ప్రోటీన్ , ఆరోగ్యకరమైన కొవ్వులు చేర్చుకోండి.
– రాత్రిపూట కెఫిన్ , ఆల్కహాల్ అస్సలు తీసుకోకండి.
– నిద్రపోయే అరగంట ముందు మొబైల్ , స్క్రీన్‌ను పక్కన పెట్టండి. తద్వారా మీరు ప్రశాంతమైన మనస్సుతో పడుకోవచ్చు.