Pakistan Poor Economy| భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. కశ్మీర్ లో ఉగ్రవాద దాడుల కారణంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ మంత్రులు కూడా భారత్ తో పూర్తి స్థాయి యుద్ధానికి రెడీ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్ పై దాడి చేయడానికి 130 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయంటూ ఓపెన్ వార్నింగ్ ఇస్తున్నారు. మరొకరైతే భారతీయు రక్తం నదిలో ప్రవహిస్తుందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఒకవేళ పూర్తి స్థాయి యుద్దం జరిగితే పరిణామాలేంటని ఒక చర్చ జరుగుతుంటే.. భారత్ లాంటి దేశంతో యుద్ధం చేస్తామంటున్న పాకిస్తాన్ కు అంత సీన్ లేదని ఆ దేశ ఆర్ధిక స్థితి చూస్తే తెలుస్తోంది. ఎందుకంటే యుద్ధాలు జరిగితే దాని కారణంగా దేశాల ఆర్థిక స్థితులు దివాళా తీసే వరకు వెళతాయి. కానీ పాకిస్తాన్ ఇప్పటికే దివాళా తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా యుద్ధం చేసేందుకు తాము సిద్ధమని పాకిస్తాన్ చెబుతోంది. అక్కడ ప్రజలు తినడానికి తిండి లేక అవస్థలు పడుతుంటే ప్రభుత్వం, సైన్యం మాత్రం యుద్దం చేస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
పాకిస్తాన్ లో గతంలో ఈ పరిస్థితి గురించి ఒకసారి మాజీ ప్రధాన మంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టో చెప్పారు. ‘ఆహారం లేకపోతే గడ్డి తినైనా బతుకుతాం, ఆకలితో మాడైనా సరే అణ్వాయుధాలు కొనుగోలు చేస్తాం. తయారు చేస్తాం’’ అని అన్నారు. ఆయన చెప్పిన ఆ మాట నిజమైంది. ఇప్పుడు పాకిస్తాన్ వద్ద నిజంగానే అణు ఆయుధాలు ఉన్నా.. ప్రజలకు పెట్టేందుకు తిండి లేదు, ఉద్యోగాల్లేవు. స్వయంగా ప్రభుత్వం వద్దే డబ్బుల్లేవ్. అంతా ఖజానా ఖాళీగా ఉంది. స్వీయ తప్పిదాలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దివాళా అంచున ఉంది. ఐఎంఎఫ్, చైనా సాయంతో కొంత ఊరట లభించినా, ప్రమాదం తొలగలేదు. భారత్‌తో స్వల్ప యుద్ధం జరిగినా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విదేశీ కరెన్సీ నిల్వలు ఆవిరి
పాకిస్తాన్ మంత్రి అహ్‌సాన్ ఇక్బాల్ కొంతకాలం క్రితం టీ పొడి దిగుమతికి అప్పు చేయాల్సిన దుస్థితిలో ఉందని, టీ వినియోగం తగ్గించాలని కోరారు. 2023లో ద్రవ్యోల్బణం 38.5%కి చేరింది. విదేశీ నిల్వలు 370 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఎఫ్‌ఏటీఎఫ్ ‘గ్రే లిస్ట్’తో రుణాలు దొరకడం కష్టమైంది. అప్పులు జీడీపీలో 70%, ఆదాయంలో 40-50% వడ్డీ చెల్లింపులకే సరిపోతోంది.
Also Read: భారత్‌పై దాడికి 130 అణు బాంబులు రెడీ.. ఇండియాకు పాక్ మంత్రి వార్నింగ్
ఐఎంఎఫ్, ఇతర దేశాల సాయం ఎంతవరకు
ఐఎంఎఫ్‌ను 25వ సారి ఆశ్రయించిన పాక్, 300 కోట్ల డాలర్ల ప్యాకేజీ, సౌదీ, యూఏఈ, చైనా రుణాలతో గట్టెక్కింది. 700 కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ కోసం 1.5 లక్షల ఉద్యోగాలు తొలగించి, ఆరు శాఖలు మూసివేసింది.
పేరుకుపోతున్న అప్పు భారం
ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ 22 బిలియన్ డాలర్ల రుణాలు చెల్లించాల్సి ఉంది. రాజకీయ అడ్డంకులతో సంస్కరణలు ఆగిపోతున్నాయి. సింధు జల ఒప్పందం రద్దుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. భారత్‌తో ఘర్షణ వినాశకరం.
ఔషధ ఎమర్జెన్సీ
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ ఉద్రిక్తతలు, వాణిజ్య బంధం తెగడం, సింధు జల ఒప్పందం రద్దుతో పాక్ ఔషధ సంక్షోభంలో పడింది. భారత్ నుంచి 30-40% ఔషధ ముడిసరుకు దిగుమతి చేసే పాక్, నిల్వలు పెంచాలని ఆదేశించింది. చైనా, రష్యా, ఐరోపా నుంచి దిగుమతి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బ్లాక్ మార్కెట్ ఆందోళన కలిగిస్తోంది.
భారత ఔషధాలపై ఆధారం
పాక్ ఔషధ ముడిసరుకు, క్యాన్సర్ మందులు, వ్యాక్సిన్‌ల కోసం భారత్‌పై ఆధారపడుతోంది. ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ ద్వారా అక్రమ రవాణా జరుగుతోంది. ఇప్పడు యుద్ధ వాతావరణం ఉండడంతో పాకిస్తాన్‌కు భారత్ ఔషధాల రవాణా నిలిపివేసింది. దీంతో ఆ దేశంలో ఇప్పుడు ఔషధాల తీవ్ర కొరత ఉంది. దీంతో అక్కడ ప్రజలు కూడా తమ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు.
ఒకప్పుడు పాకిస్తాన్ ధనిక దేశం
50 ఏళ్ల క్రితం దక్షిణాసియాలో ధనిక దేశంగా ఉన్న పాకిస్తాన్, 1960-70లలో ఆర్థిక వృద్ధి సాధించింది. బలమైన ఆర్థిక నిర్వహణ, విదేశీ సాయం, వ్యవసాయం, పరిశ్రమలు దీనికి కారణం. కానీ, దుష్పరిపాలన, సైనిక నియంతృత్వం, ఉగ్రవాద ప్రోత్సాహం, భారత్‌తో ఘర్షణలు, ఆయుధ పోటీలతో నీటి అత్యంత పేద దేశంగా మారింది. కొవిడ్, రాజకీయ సంక్షోభం, బలోచిస్థాన్ వేర్పాటువాదం ఆర్థిక సమస్యలను తీవ్రతరం చేశాయి.
స్వీయ తప్పిదాలతో దివాళా అంచున ఉన్న పాక్, ఐఎంఎఫ్, చైనా సాయంతో కోలుకుంటున్నా, భారత్‌తో యుద్ధం ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని నిపుణుల హెచ్చరిస్తున్నారు. 50 ఏళ్ల క్రితం ధనిక దేశంగా ఉన్న పాక్, దుష్పరిపాలన, ఉగ్రవాదం, ఘర్షణలతో పేద దేశంగా మారింది.