BIG TV LIVE Originals: ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు పూత రేకుల గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆత్రేయపురం పూత రేకులు బాగా ఫేమస్. చాలా మంది ఎంతో ఇష్టపడి పూతరేకులను తింటారు. రీసెంట్ గా ఓ వ్యక్తి డ్రై ఫ్రూట్స్ పూత రేకులు కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకెళ్లి చూడగానే వాటిలో చాలా వరకు కుళ్లిపోయినట్లు గుర్తించాడు. పలు పూతరేకులలో పురుగులు ఉన్నట్లు గమనించాడు. తనకు ఎదరైన అనుభవం గురించి సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. అదే సమయంలో డ్రై ఫ్రూట్స్ పూత రేకులు కొనుగోలు చేసే వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా నిల్వ చేయాలి? అనే విషయాల గురించి వివరించే ప్రయత్నం చేశాడు.
డ్రై ఫ్రూట్స్ పూత రేకుల్లో పురుగులు ఎందుకు వస్తాయి?
డ్రై ఫ్రూట్స్ పూత రేకుల్లో ఎక్కువగా ద్రాక్ష, బాదం, కాజూ వాడుతారు. ఇవి రోగ్యానికి చాలా మంచివి. అయితే, కొద్ది రోజుల పాటు వీటిని నిల్వ చేస్తే పురుగులు పట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా, అపరిశుభ్రమైన ప్రదేశాల్లో నిల్వ చేయడం వల్ల ఇలా జరుగుతుంది.
డ్రై ఫ్రూట్స్ పూత రేకులు చెడిపోయినట్లు ఎలా గుర్తించాలి?
డ్రై ఫ్రూట్స్ పూత రేకులు కొనుగోలు చేసే సమయంలో వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. డ్రై ఫ్రూట్స్ లో చిన్న చిన్న పురుగులు, లేదంటే బూజు పట్టిన లక్షణాలు కనిపిస్తే వాటిని వీలైనంత వరకు తీసుకోకపోవడం మంచిది. ప్యాకేజీ విధానాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్యాకేజీలో చీలికలు, రంధ్రాలు ఉంటే, అందులోని పూతరేకులకు పురుగు పట్టే అవకాశం ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా తెలియని దుకాణాల నుంచి తీసుకోవద్దు.
డ్రై ఫ్రూట్స్ పూత రేకులను ఎలా నిల్వ చేసుకోవాలి?
⦿ నిల్వ చేసుకోవడం: డ్రై ఫ్రూట్స్ పూత రేకులను ఎప్పుడూ ఎయిర్ టైట్ కంటైనర్ లలో ఉంచాలి. చల్లగా, పొడిగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేయాలి.
⦿ రెగ్యులర్ చెక్: ప్రతి వారం వారం కంటేనర్ ను ఓపెన్ చేసి పరిశీలించాలి. ఒకవేళ ఏదైనా తేడాగా ఉంటే వాటిని పడేయడం మంచిది.
⦿ శుభ్రత: కిచెన్ ను ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎంత క్లీన్ గా ఉంటే పురుగులు వచ్చే అవకాశం అంత తగ్గుతుంది.
కుళ్లిపోయిన పూత రేకులను తింటే?
ఒకవేళ మీరు గమనించకుండా డ్రై ఫ్రూట్స్ పూత రేకులను తింటే పలు రకాల జీర్ణ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎక్కువగా అలర్జీ సమస్య తలెత్తుతుంది. ఒకవేళ పరిస్థితి తీవ్రంగా ఉంటే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
ఇకపై మీరు డ్రై ఫ్రూట్స్ పూత రేకులు కొనుగోలు చేసే సమయంలో ఫ్రెష్ గా ఉన్నాయో? లేదో? గుర్తించండి. తయారు చేసి ఎక్కువ రోజులు ఉన్నట్లు అనిపిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. కొనుగోలు చేసిన డ్రై ఫ్రూట్స్ పూత రేకులను జాగ్రత్తగా నిల్వ చేయడం కూడా ఎంతో ముఖ్యం అని గుర్తుంచుకోవాలి.
డ్రై ఫ్రూట్స్ పూత రేకులు కొనేప్పుడు జాగ్రత్త.. పురుగులు, గుడ్లు ఉంటాయ్. ఈ వీడియో చూస్తే అవ్వక్కు అవ్వాల్సిందే. #Putarekulu #DryFruitPutarekulu #AndhraSweets pic.twitter.com/ULtgdwbPtz
— Suresh Ch (@chsureshAb) April 22, 2025
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: నా ఫోనే తీసుకుంటావా? లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన స్టూడెంట్, వీడియో వైరల్!