BigTV English

Sleep Culture: ఆ దేశాల్లో తల్లిదండ్రులు.. తమ పిల్లలను వేరే గదుల్లో ఎందుకు పడుకోబెడతారు? కారణాలేమిటీ?

Sleep Culture: ఆ దేశాల్లో తల్లిదండ్రులు.. తమ పిల్లలను వేరే గదుల్లో ఎందుకు పడుకోబెడతారు? కారణాలేమిటీ?

మీరు ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చే ఉంటుంది. ముఖ్యంగా హార్రర్ మూవీస్ చూస్తున్నాడు. ఆ సినిమాల్లో దెయ్యాలు ఎన్ని అరచకాలు చేస్తున్నా సరే.. తల్లిదండ్రులు వారితో కలిసి నిద్రపోరు. మళ్లీ వారిని ఆ గదిలోనే పడుకోబెడతారు. వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారని మన ఇండియన్ ఆడియెన్స్ తలలు పట్టుకుంటారు. అయితే, పిల్లలను వేరే గదిలో పడుకోబెట్టడం అనేది.. అక్కడ తరతరాలుగా వస్తున్న పద్ధతి. కొందరికి అది ఆచారం కూడా. వారు అలా చేయడానికి బలమైన కారణాలే ఉన్నాయి.


పెద్దలపై ఆధారపడకుండా..

పాశ్చాత్య దేశాల్లో బంధాలు చాలా బలహీనంగా ఉంటాయి. ముఖ్యంగా భార్యభర్తలు జీవితాంతం కలిసి ఉంటారో లేదో సందేహమే. అలాంటి సందర్భాలను పిల్లలు కూడా తట్టుకునే విధంగా ఉండాలి. తల్లిదండ్రులతో కలిసి ఉండటం, వారిపై ఆధాపడి ఉండటం వల్ల భవిష్యత్తులో వారు సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలున్నాయని అక్కడివారు భావిస్తారు. అందుకే, బాల్యం నుంచే వారికి స్వతంత్రంగా బతకడం నేర్పిస్తారు. వారు కడుపులో పుట్టిన రోజు నుంచే.. ప్రత్యేకంగా ఒక గదిని సిద్ధం చేస్తారు. కొందరైతే నెలల పిల్లలను కూడా ఆ ప్రత్యేక గదిలోనే పెట్టి.. కెమేరాలు, మైకుల ద్వారా పర్యవేక్షిస్తారు. మన ఇండియన్స్ తరహాలో పక్కన పడుకోబెట్టుకోరు. కనీసం ఉయ్యాల కూడా మంచం పక్కన వేసుకోరు.


భయం లేకుండా.. సొంత నిర్ణయాలు తీసుకొనేలా..

పాశ్చాత్య దేశాల్లో ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంది. వారి జీవన విధానం ఇలాగే ఉంటుంది. పిల్లల్లో చిన్నతనం నుంచే స్వతంత్ర, స్వయం సమృద్ధిని పెంపొందించడానికి తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇస్తారు. సెపరేట్ గదిలో నిద్రపోవడం వల్ల పిల్లలు తమ సొంత స్థలంలో ఒంటరిగా ఉండటానికి అలవాటు పడతారని, ఇది వారి వ్యక్తిగత అభివృద్ధికి సహాయపడుతుందని నమ్ముతారు. దానివల్ల పిల్లల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, భయం లేకుండా ఒంటరిగా ఉండగలగడం వంటివి అలవాటు అవుతాయి.

దాంపత్యం బలపడేందుకు

పిల్లలు పుట్టగానే భార్యభర్తల మధ్య దూరం పెరుగుతుంది. కానీ, పాశ్చాత్య దేశాల్లో అలాంటి ఫీలింగ్ లేకుండా జాగ్రత్తపడతారు. తమ మధ్య ఉండే స్పర్థలు, ప్రేమ వంటివి ఏవీ పిల్లలకు తెలియకుండా ఉండేందుకు వారిని ప్రత్యేక గదుల్లో నిద్రపుచ్చడమే మంచిదని భావిస్తుంటారు. దానివల్ల వారి ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రొమాంటిక్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఏకాంత క్షణాలను ఎలాంటి ఆందోళన లేకుండా కొనసాగించవచ్చు. పిల్లలు చూస్తారనే భయం కూడా ఉండదు.

కనీసం ఏడాది వరకు..

కొంతమంది బిడ్డ పుట్టిన రోజు నుంచే ప్రత్యేక గదిలో పెట్టేస్తారు. దానివల్ల పిల్లల ప్రాణాలను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ హెచ్చరించింది. అలాంటి ప్రమాదాలను తగ్గించడం కోసం పిల్లలకు కనీసం ఆరు నెలలు నుంచి ఏడాది వయస్సు వచ్చేవరకు తల్లిదండ్రులు తమ గదిలోనే పడుకోబెట్టుకోవాలని సిఫార్సు చేసింది. ఆ తర్వాత వారిని సెపరేట్ గదిలోకి మార్చవచ్చని తెలిపింది.

సొంత గది.. వారి హోదా.. ఆరోగ్యం

పాశ్చాత్య దేశాల్లో పిల్లలకు సొంత గది ఉండటాన్ని సామాజిక హోదాగా భావిస్తారు. అది తమ పిల్లలకు సౌకర్యాన్ని అందిస్తున్నాని అంటారు. బాల్యం నుంచే వారికి ప్రైవసీ కల్పించాలని అనుకుంటారు. సొంత గదిలో నిద్రపోవడం వల్ల అటు పిల్లలు, ఇటు తల్లిదండ్రులు.. హాయిగా నిద్రపోగలరని నమ్ముతారు. ఎలాంటి డిస్ట్రబెన్స్ ఉండదని అనుకుంటారు. అది మా గది అనే ఫీలింగ్ వల్ల పిల్లలు.. తమ రూమ్‌ను క్లీన్‌గా ఉంచుకోడానికి ఇష్టపడతారట. అలాగే వారిలో క్రియేటివ్ ఆలోచనలు కూడా కలిగిస్తాయట.

Also Read: ఆడ తోడు లేని సింగిల్స్ ఎలా బతకాలి? ఆ కోరికలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి?

అయితే, ఇలాంటి పద్ధతులు కేవలం అమెరికా, ఐరోపా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. తూర్పు దేశాలైన ఇండియా, జపాన్ ఇతరాత్ర ఆసియా దేశాల్లో కుటుంబ సాన్నిహిత్యానికే ప్రాధాన్యం ఎక్కువ. తల్లిదండ్రులు తమ పిల్లలను తమతోపాటు నిద్రపుచ్చుకోడానికే ఇష్టపడతారు. దీనివల్ల బంధం బలోపేతం అవుతుంది. పిల్లలు కూడా సురక్షితంగా ఫీలవుతారు. కుటుంబానికి, బాంధవ్యాలకు ఎక్కువ విలువ ఇస్తారు. మరి రెండిటిలో ఏది బెటర్ అని మీరు అనుకుంటున్నారు?

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×