Darkness around nose| ముఖాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు ముక్కు చుట్టూ చర్మం నల్లగా కనిపించడం చాలామందిని ఇబ్బంది పెడుతుంది. దీన్ని కేవలం మురికి లేదా సాధారణ పిగ్మెంటేషన్‌గా భావించడం సరికాదు. బ్లాక్‌హెడ్స్, చర్మంలో మంట, సెబోరియిక్ డెర్మటైటిస్ వంటి సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు. పదేపదే వచ్చే మంట తర్వాత ఆ ప్రాంతంలో చర్మం మరింత నల్లగా కనిపించే అవకాశం ఉంది. అందుకే కారణాన్ని గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
ముక్కు చుట్టూ కనిపించే నలుపు ఎప్పుడూ సాధారణ పిగ్మెంటేషన్ వల్లే రాదు. కొందరిలో సెబోరియిక్ డెర్మటైటిస్ కారణంగా చర్మంలో మంట ఏర్పడుతుంది. ఈ సమస్య తర్వాత పోస్ట్-ఇన్‌ఫ్లమేటరీ పిగ్మెంటేషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనిని కొన్ని సందర్భాల్లో సెబోరియిక్ మెలనోసిస్ అని కూడా అంటారు. ముక్కు పక్కల చర్మం మడతలుగా ఉండటంతో అక్కడ ఎక్కువగా నూనె ఉత్పత్తి కావచ్చు. అధిక ఆయిల్ వల్ల మలాసెజియా అనే ఈస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో కొందరిలో ఎర్రదనం, దురద, పొట్టు, చర్మంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. పదేపదే మంట రావడం వల్ల ఆ ప్రాంతం క్రమంగా నల్లగా మారుతుంది. సూర్యరశ్మికి ఎక్కువగా గురైతే ఇప్పటికే ఉన్న పిగ్మెంటేషన్ మరింత నల్లగా కనిపిస్తుంది.
ముక్కు చుట్టూ నలుపును తగ్గించే ముందు చర్మంలో ఉన్న మంటను తగ్గించడం ముఖ్యం. ఎర్రదనం, దురద, పొట్టు లేదా ఇర్రిటేషన్ ఉంటే చర్మ సమస్య కొనసాగుతున్నట్లు భావించవచ్చు. అలాంటి సమయంలో చర్మవ్యాధుల నిపుణుడిని సంప్రదించడం మంచిది. డెర్మటాలజిస్ట్ సమస్యకు కారణాన్ని గుర్తించి.. తగిన క్రీమ్ లేదా జెల్‌ను సూచించవచ్చు. వైద్యుడు సూచించిన చికిత్సను మాత్రమే ఉపయోగించడం మంచిది. ఒకేసారి అనేక స్కిన్‌కేర్ ఉత్పత్తులను ప్రయోగించడం వల్ల సమస్య పెరిగే అవకాశం ఉంది.
సూర్యరశ్మి.. పిగ్మెంటేషన్‌ను మరింత ముదురు చేయవచ్చు. అందుకే పగటిపూట బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది. బయట ఎక్కువ సమయం గడిపే సమయంలో సన్ ప్రొటెక్షన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మీ చర్మానికి సరిపోయే సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలి. సన్‌స్క్రీన్ వాడటం వల్ల పిగ్మెంటేషన్ మరింత పెరగకుండా సహాయపడవచ్చు.
Also Read: 30 ఏళ్లు దాటిన తర్వాత పొట్ట ఎందుకు పెరుగుతుంది? కొవ్వు పేరుకుపోవడానికి ఈ 6 అలవాట్లే కారణం
చర్మంలో మంట, ఎర్రదనం, దురద తగ్గిన తర్వాత మిగిలిన నలుపును తగ్గించే ప్రయత్నం చేయండి. కోజిక్ యాసిడ్, అర్బ్యూటిన్ వంటి పదార్థాలు పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
హైడ్రోక్వినోన్ వంటి బలమైన పదార్థాలను మాత్రం డెర్మటాలజిస్ట్ సలహాతోనే ఉపయోగించాలి. వాటిని స్వయంగా ఉపయోగించడం మంచిది కాదు.
Also Read: కళ్లలో ఈ మార్పులు కనిపిస్తే గుండె సమస్యలు ఉన్నట్లే? అసలు నిర్లక్ష్యం చేయకండి
నలుపు కనిపించగానే వెంటనే ఫెయిర్‌నెస్ క్రీమ్ రాసుకోవడం మంచిది కాదు. సరైన పదార్థాలు లేని ఉత్పత్తులు చర్మాన్ని ఇర్రిటేట్ చేసి సమస్యను పెంచవచ్చు. అందుకే ఉత్పత్తిలోని పదార్థాలను తెలుసుకోకుండా ఉపయోగించకండి. ముక్కు చుట్టూ నలుపు ఎక్కువ కాలం కొనసాగితే లేదా మరింత పెరిగితే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. సరైన కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల సమస్యను మెరుగ్గా నియంత్రించండి.