BigTV English

Mokshagna: మోక్షజ్ఞ ప్రేమ కథ.. ఎవరితో తెలుసా?

Mokshagna: మోక్షజ్ఞ ప్రేమ కథ.. ఎవరితో తెలుసా?

Mokshagna: ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో.. నంద‌మూరి నట‌సింహం బాలకృష్ణ (Balakrishna) వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి వెయిట్ చేస్తున్నారు సినీ అభిమానులు. ముఖ్యంగా నందమూరి అభిమానులంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ రోజు రోజుకి మోక్షజ్ఞ ఎంట్రీ లేట్ అవుతూనే ఉంది. ఫైనల్‌గా.. హనుమాన్‌తో పాన్ ఇండియా హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మకు మోక్షుని లాంచ్ చేసే బాధ్యత అప్పజెప్పాడు బాలయ్య. ఈ చిత్రం ప్రశాంత్ వర్మ (Prashanth Varma) సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా ఉంటుందని, సోషియో-ఫాంటసీ జోనర్‌లో మహాభారతం నుండి ప్రేరణ పొందిన సూపర్‌హీరో కథగా రూపొందనుందని అన్నారు. ఈ సినిమాను బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నందమూరి మరియు సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించనున్నట్టుగా ప్రకటించారు. అనౌన్స్మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన మోక్షజ్ఙ ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. ఈ పోస్టర్‌లో మోక్షజ్ఞ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. కానీ తీరా ముహూర్త కార్యక్రమాల వరకు వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.


ముందుకొచ్చిన రెండో సినిమా?

డిసెంబర్ 5, 2024న జరగాల్సిన మోక్షజ్ఙ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు.. మోక్షు అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. బాలకృష్ణ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, ప్రాజెక్ట్ రద్దు కాలేదని, కేవలం కొంత ఆలస్యమైందని తెలిపాడు. 2025లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. కానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో దాదాపు అటకెక్కినట్టేనని అంటున్నారు. దీంతో.. ఇప్పుడు మరో దర్శకుడితో మోక్షుని లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నాడు బాలయ్య. వాస్తవానికి ప్రశాంత్ వర్మతో ఫస్ట్ సినిమా చేసిన తర్వాత.. మోక్షజ్ఞ తన రెండవ చిత్రంగా వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా టాక్ ఉంది. ఈ చిత్రాన్ని నాగ వంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్టుగా సమాచారం. అయితే.. ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడంతో.. ఇప్పుడు వెంకీ అట్లూరి సినిమా ముందుకొచ్చినట్టుగా తెలుస్తోంది.


లవ్‌స్టోరీతో ఎంట్రీ?

ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలిసిన వెంటనే.. సార్, లక్కీ భాస్కర్ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన వెంకి అట్లూరితో మోక్షజ్ఙ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా సమాచారం. అంతేకాదు.. మోక్షుతో ఒక మంచి ప్రేమ కథతో సినిమా చేయబోతున్నాడట వెంకీ. ఇప్పటికే లవ్‌ స్టోరీని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. బాలయ్య కూడా ఆ కథకు పచ్చా జెండా ఊపినట్టుగా టాక్. అయితే.. ప్రస్తుతం వెంకీ కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాతే.. మోక్షజ్ఙ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. అయితే.. మోక్షు ఫస్ట్ సినిమా ప్రశాంత్ వర్మతో ఉంటుందా? లేదంటే వెంకీ అట్లూరితో ఉంటుందా? అనే క్లారిటీ రావాలంటే.. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే! మొత్తంగా, మోక్షజ్ఞ తన తొలి చిత్రంతో ఎలాంటి ప్రభావం చూపిస్తాడు, నందమూరి లెగసీని ఎలా ముందుకు తీసుకెళతాడు అనేది చూడటానికి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×