E-Paper
Advertisement

ఈ ముగ్గురికి పొరపాటున కూడా సాయం చేయకండి..లేదంటే మీ జీవితమే నాశనం!

ఈ ముగ్గురికి పొరపాటున కూడా సాయం చేయకండి..లేదంటే మీ జీవితమే నాశనం!
Advertisement

Chanakya Niti: మన సంస్కృతిలో ‘పరోపకారమిదం శరీరం’ అంటారు. అంటే తోటి వారికి సహాయం చేయడం మనిషి ప్రధాన లక్షణం అని పెద్దలు చెబుతుంటారు. కష్టంలో ఉన్నవారికి చేయూతనందించడం నిజంగా గొప్ప విషయమే. కానీ.. ఎవరికి సాయం చేయాలి? ఎవరికి చేయకూడదు? అనే విచక్షణ కోల్పోతే మాత్రం మన జీవితమే తలకిందులవుతుంది. చాణక్య నీతి , మన పురాణాల ప్రకారం కొన్ని రకాల మనుషులకు మనం ఎంత మంచి చేసినా, అది మనకే తిరగబడుతుంది. ముఖ్యంగా దుష్ట స్వభావం గలవారు, కృతజ్ఞత లేనివారు, సోమరిపోతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం చేయకూడదు. ఎందుకంటే వీరితో పెట్టుకుంటే మనశ్శాంతి కోల్పోవడంతో పాటు ఆర్థికంగా, మానసికంగా పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది.

1. దుష్ట స్వభావం ఉన్నవారు:

చెడు స్వభావం లేదా ఇతరులకు కీడు చేయాలనే ఆలోచన ఎప్పుడూ గుండెల్లో పెట్టుకునే దుష్టులకు మనం ఎలాంటి సహాయం చేసినా అది పెద్ద తప్పు అవుతుంది. పాముకు పాలు పోసి పెంచినట్లుగానే వీరితో వ్యవహరించాల్సి వస్తుంది. దుష్ట స్వభావం ఉన్న వ్యక్తులు తమ స్వార్థం కోసం ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ వెనకాడరు. వీరికి మీరు సాయం చేస్తే, రేపు అదే సాయాన్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్నే దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. సమాజంలో ఇలాంటి వారిని నమ్మి మోసపోయిన వారు కోకొల్లలు. కాబట్టి వీరికి దూరంగా ఉండటమే మనకు శ్రీరామరక్ష.

2. కృతజ్ఞత లేని వారు:

Advertisement

ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది కృతజ్ఞత లేని వారే. మనం ఎంత కష్టపడి వీరికి ఆపద సమయంలో ఆదుకున్నప్పటికీ, ఆపద తీరిన తర్వాత ఆ సహాయాన్ని క్షణంలో మరచిపోతారు. అంతేకాకుండా.. మన వెనుక మన గురించే చెడుగా మాట్లాడటానికి కూడా వెనుకాడరు. కృతజ్ఞత లేని వారికి సహాయం చేయడం అంటే చిల్లులున్న కుండలో నీళ్లు పోయడంతో సమానం. వీరికి ఎన్నిసార్లు సాయం చేసినా తృప్తి ఉండదు సరిగదా, సరిగ్గా సమయం వచ్చి నప్పుడు మనకే వెన్ను పోటు పొడుస్తారు.

3. సోమరిపోతులు:

శ్రమపడకుండా ఉచితంగా అన్నీ రావాలని కోరుకునే సోమరిపోతులకు ఎప్పుడూ ఆర్థికంగా లేదా ఇతర రూపాల్లో సాయం చేయకూడదు. కష్టపడే.. తత్వాన్ని నేర్పించాల్సింది పోయి, బద్ధకస్తులకు సాయం చేస్తే వారిని మరింత బాధ్యతా రాహిత్యులుగా మార్చినట్లే అవుతుంది. వీరు ఎప్పటికీ తమ కాళ్లపై తాము నిలబడ లేరు సరిగదా, ఇతరు లపై ఆధార పడి బతకడాన్ని అలవాటు చేసు కుంటారు. సోమరి తనానికి సాయం చేయడం అంటే వారి జీవితాలను నాశనం చేయడంతో పాటు, మన శక్తిని వృథా చేసుకోవడమే.

Advertisement

సహాయం చేసే గుణం ఉండాలనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ సహాయం అర్హులైన వారికి మాత్రమే అందాలి. దుష్ట స్వభావం, కృతజ్ఞత లేనితనం, సోమరితనం ఉన్నవారిని దూరంగా పెట్టడం ద్వారా మనం అనేక మానసిక సమస్యల నుంచి బయటపడొచ్చు. మీ ప్రశాంతమైన జీవితానికి ఇతరుల చెడు ప్రవర్తన ముప్పు కాకుండా చూసుకోవడం మీ చేతుల్లోనే ఉంది!

Related News

అతనంటే ఎంతో ఇష్టం.. కానీ ఐ లవ్ యు చెప్పడానికి భయం.. మనసులో మాట చెప్పేందుకు టిప్స్

నిద్రలో కాలి కండరాలు పట్టేయడానికి కారణమేంటి? ఎప్పుడు ప్రమాదకరమంటే..

నాన్ స్టాప్ డాండియా డాన్స్ చేసినా చెదరని మేకప్.. రాత్రంతా ఫ్రెష్ లుక్ కోసం టిప్స్

సన్‌స్క్రీన్ వాడుతున్నా చర్మం నల్లబడుతోందా? మీరు చేస్తున్న తప్పులు ఇవే

10 నిమిషాలు లేదా 20 నిమిషాలు? ఎంతసేపు స్నానం చేస్తే చర్మ ఆరోగ్యానికి మంచిది?

విస్కీ ఎలా తాగితే రుచికరంగా ఉంటుంది? నీట్‌గా, ఐస్‌తోనా లేదా వాటర్‌తోనా

తొలిసారి డాండియా డాన్స్ చేయబోతున్నారా? గర్బా నైట్‌లో ఈ జాగ్రత్తలు పాటించాలి

Big Stories

Advertisement
×