E-Paper
Advertisement

నంబర్ ప్లేట్లు లేని కార్లతో ఆర్టీఓ అధికారుల తనిఖీలు.. దీనికి మతలబేంటో..?

నంబర్ ప్లేట్లు లేని కార్లతో ఆర్టీఓ అధికారుల తనిఖీలు.. దీనికి మతలబేంటో..?
Advertisement

Transport Department: రహదారులపై నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రవాణాశాఖ అధికారులది. నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలు, నిబంధనలకు విరుద్ధంగా తిరిగే కార్లు, పత్రాలు సరిగా లేని వాహనాలపై తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించాల్సింది ఆ శాఖ అధికారులే. అలాంటిది.. తనిఖీలకు వినియోగించే కొన్ని కార్లకే నంబర్‌ ప్లేట్లు కనిపించడం లేదు. నిబంధనలు అమలు చేయాల్సిన వారే వాటిని పాటిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కొన్ని కార్యాలయాలతోపాటు, కొన్ని జిల్లాల్లోనూ రవాణాశాఖ అధికారులు తనిఖీ సమయంలో నెంబర్ లేని వాహనాల వినియోగంపై విమర్శలు వస్తున్నాయి. అయితే, ఆయా వాహనాలు ఎవరివి? ఏ సందర్భంలో నంబర్‌ ప్లేట్లు లేవు? కొత్తగా కొనుగోలు చేశారా? అసలు వాటికి అనుమతులున్నాయా? అనే అంశాలు చర్చకుదారితీశాయి.

నంబర్‌ ప్లేట్లు లేకుండానే తనిఖీలా?

రవాణాశాఖ విధుల్లో వాహనాల తనిఖీలు కీలకం. రహదారులపై తిరిగే వాహనాలకు అవసరమైన పత్రాలు ఉన్నాయా? రిజిస్ట్రేషన్‌ సక్రమంగా ఉందా? అనుమతులు, ఫిట్‌నెస్‌, ఇతర నిబంధనలు పాటిస్తున్నారా? అన్న అంశాలను అధికారులు పరిశీలిస్తుంటారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే జరిమానాలు విధించడం, చట్టప్రకారం చర్యలు తీసుకోవడం వారి బాధ్యత.అయితే, తనిఖీలకు వినియోగించే కొన్ని కార్లకు నంబర్‌ ప్లేట్లు కనిపించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. వాహనం ముందు, వెనుక రిజిస్ట్రేషన్‌ గుర్తింపు సంఖ్య స్పష్టంగా కనిపించాల్సిన నిబంధన ఉన్నప్పుడు.. ఆర్టీఓ అధికారుల వాహనాలకు మాత్రం ఈ నిబంధన ఎలా వర్తిస్తుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత కార్లు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? అవి ప్రభుత్వ వాహనాలా? అధికారుల వ్యక్తిగత వాహనాలా? నంబర్‌ ప్లేట్లు లేకపోవడానికి కారణమేంటి? అన్నఅంశాలు చర్చనీయాంశమయ్యాయి.

గుర్తుపట్టకుండా ఉండేందుకేనా?

Advertisement

తనిఖీల సమయంలో అధికారులు వినియోగించే వాహనాలపై నంబర్‌ ప్లేట్లు లేకపోతే వాటి గుర్తింపును సాధారణ వాహనదారులు ఎలా తెలుసుకోవాలి? ఏ కార్యాలయానికి చెందిన కారు? అందులో ఉన్నవారు ఏ హోదాలో తనిఖీలు నిర్వహిస్తున్నారు? అన్న వివరాలను ఎలా నిర్ధారించుకోవాలి? వాహనం నంబరు కనిపించకపోతే దాని యజమాన్యం, అధికారిక వినియోగం వంటి అంశాలను గుర్తించడం కష్టమవుతుంది. వాహనాలకు నంబర్‌ ప్లేట్లు లేకపోవడానికి ఉద్దేశపూర్వకంగా గుర్తింపును దాచాలనే ప్రయత్నమనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు కొన్ని సందర్భాల్లో అధికారులు నెంబర్ ప్లేటు ఉన్న కార్లలో వెళ్తే నిబంధనలు అతిక్రమించే వాహనదారులు కోడ్ ఆధారంగా తనిఖీకి వస్తున్నారనే అలర్టు అయ్యే అవకాశం ఉందని, అందుకే నెంబర్ ప్లేట్లు లేని వాహనాలతో తనిఖీలు చేస్తున్నారని మరో వైపు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి చెక్ పెట్ఠేందుకు సంబంధిత శాఖ అధికారులేక్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Also read: ఏపీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. గుంటూరు నుంచి స్పెషల్ రైలు!

చేతివాటం ప్రదర్శిస్తే తప్పించుకోవడానికా?

Advertisement

రవాణాశాఖ తనిఖీలకు సంబంధించి ఆరోపణలు వినిపిస్తుంటాయి. తనిఖీల నిర్వహణ, అధికారుల వ్యవహారశైలి, వాహనదారులతో వ్యవహరించే తీరు వంటి అంశాలు చర్చకు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో నంబర్‌ ప్లేట్లు లేని కార్ల వ్యవహారం మరిన్ని సందేహాలకు కారణమవుతోంది. తనిఖీల సమయంలో కొందరు సిబ్బంది లేదా అధికారులు చేతివాటం ప్రదర్శిస్తే తెలుసుకోవడానికి వీలు ఉండకూడదనే కారణంతోనే నెంబర్ లేని ప్లేట్లతో తనిఖీలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

గ్రేటర్‌లోనే కాదు.. జిల్లాల్లోనూ?

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కొన్ని రవాణాశాఖ కార్యాలయాలతోపాటు, కొన్ని జిల్లాల్లోనూ అధికారులు తనిఖీ సమయంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలను వినియోగిస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఉన్నతాధికారులు గ్రేటర్‌ పరిధిలోని కార్యాలయాలకే పరిమితం కాకుండా జిల్లాలవారీగా తనిఖీలు నిర్వహిస్తే వాస్తవ పరిస్థితి బయటపడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. శాఖ ఆధీనంలోని వాహనాల జాబితా, రిజిస్ట్రేషన్‌ వివరాలు, వాహనాల కేటాయింపు రికార్డులు, తనిఖీలకు సంబంధించిన విధివిధానాలను పరిశీలించాలని, నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలు గుర్తిస్తే వాటి వెనుక కారణాలను నిర్ధారించాలని, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అధికారులపై ఆరోపణలు..

ప్రజలకు నిబంధనలు చెప్పే ప్రభుత్వ శాఖలు ముందుగా తమ వ్యవహారాల్లో ఆదర్శంగా ఉండాలి. సాధారణ వాహనదారులకు కఠినంగా నిబంధనలు అమలు చేస్తూ, అధికారుల వినియోగంలోని వాహనాల విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే భావన ఏర్పడితే శాఖపై ప్రజలకు ఉన్న విశ్వాసం దెబ్బతింటుంది. రవాణాశాఖ అధికారులపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, ఫిర్యాదులపై విచారణ జరిపి, తప్పులు నిర్ధారణ అయిన సందర్భాల్లో చర్యలు తీసుకోవాలని, తనిఖీల వివరాలు, వాహనాల గుర్తింపు, అధికారుల విధుల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

నెంబర్ లేని వాహనాలు..

ఇది ఇలా ఉంటేనంబర్‌ ప్లేట్లు లేని కార్ల వ్యవహారంపై రవాణాశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోనూ సమగ్ర విచారణ చేపట్టి నెంబర్ లేని వాహనాలు వినియోగించే అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటారా? లేదా? అనేదిచూడాలి.

Also read: జంతర్ మంతర్ వద్ద నిరసనలు బంద్.. ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం!

Tags

Related News

ఉద్యమాల ఆయువుపట్టు మీద పాలకుడి దాడి! ప్రశ్నించే గొంతులకు వేదిక లేకుండా చేసే కుయుక్తులు..! ధర్నాచౌక్‌లకు తాళాలేయడం.. రోగానికి మందు కాదు..!

మీ ఉరిలో భూమి రీ-సర్వే ఎప్పుడు జరుగుతుందో తెలుసా.. పూర్తి షెడ్యుల్ ఇదే?

హస్తిన పోరులో తెలంగాణ కీ రోల్‌! రేవంత్‌పై భారీ నమ్మకం పెట్టుకున్న ఏఐసీసీ! ఢిల్లీ పోరులో టీ కాంగ్రెస్‌ హవా!

తమిళనాడు టూర్‌లో మోడీ, విజయ్‌ల ఎడముఖం పెడముఖం! పరువు పోకుండా మోడీ తండ్లాట..! మౌనంగా ఉంటూ ఇమేజీని డ్యామేజీ చేసేలా విజయ్‌..!

సిరిసిల్ల సభ చేదు అనుభవం తనకూ కలగకుండా… ముందే అప్రమత్తమైన వైనం… సిద్దిపేట సభతో బల ప్రదర్శన..!

విశాఖలో ఎన్నికల సందడి.. నోటిఫికేషన్‌కు ముందే అధికారుల స్పీడ్!

తెలంగాణలో కాంగ్రెస్ హవా.. బీఆర్ఎస్ మైండ్ గేమ్స్‌కు రివర్స్ కౌంటర్!

Big Stories

Advertisement
×