అందంగా ఉండాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. ఇందుకోసం ముఖంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. రేజర్లతో ముఖాన్ని ఎప్పటికప్పుడు షేవ్ చేస్తూ ఉంటారు. ముఖ వెంట్రుకలను షేవ్ చేసుకోవడం కేవలం పురుషులకే కాదు, ఇప్పుడు మహిళలకు కూడా అలవాటైంది. వారికి తగ్గ రేజర్లు అందుబాటులో ఉన్నాయి. మృదువైనా, ప్రకాశవంతమైన లుక్ కోసం ఈ ట్రెండును స్వీకరిస్తున్నారు. ఈ ట్రెండ్ వల్ల కొన్ని ప్రయోజనాలు కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
మహిళలు ముఖంపై ఉన్న అదనపు జుట్టును తొలగించుకోవడం కోసం వ్యాక్స్ విధానాలు త్రెడ్డింగ్ వంటివి ఎంచుకుంటారు అయితే ఈ రోజుల్లో సులభమైన షేవింగ్ పద్ధతిని ఫాలో అవుతున్నారు ముఖంపై ఉన్న చిన్న చిన్న కనిపించని వెంట్రుకలను కూడా షేవింగ్ చేస్తూ తీసేస్తున్నారు దీని వల్ల ముఖం మరింత మృదువుగా ప్రకాశవంతంగా కనిపిస్తుందని వారి భావన ముఖంపై ఉన్న పైపులను సేవింగ్ చేయడం వల్ల మృత కణాలతో పోటు జుట్టు కూడా తొలగిపోతుంది తద్వారా మృదువైన ప్రకాశవంతమైన రంగు లభిస్తుంది అందుకే ఎక్కువమంది షేవింగ్ కు అలవాటు పడుతున్నారు
ముఖ షేవింగ్ వల్ల అందం
షేవింగ్ చేసిన ముఖంపై మరింత సులభంగా మేకప్ ను అప్లై చేయవచ్చు. ఇది ముఖానికి బాగా అతుక్కుని సహజమైన లుక్ ను అందిస్తుంది. షేవింగ్ తర్వాత మృత కణాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి చర్మ రంధ్రాలు మూసుకుపోయే అవకాశం తగ్గిపోతుంది. అలాగే ప్రతిరోజు ఫేషియల్స్ షేవింగ్ చేయడం వల్ల కొల్లాజన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇది ముడతలు, గీతల రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి షేవింగ్ కొంతవరకు మేలే చేస్తుంది.
అయితే షేవింగ్ చేయడం వల్ల కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ముఖానికి షేవింగ్ చేసిన తర్వాత కొంత మందిలో చికాకు, ఎరుపుదనం కనిపిస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారికి ఈ లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. అయితే వ్యాక్సింగ్, థ్రెడింగ్ కన్నా ఇలా షేవింగ్ చేయడం వల్ల ఒకరిపై ఉన్న వెంట్రుకలు మరింత వేగంగా పెరగడం జరుగుతుంది. దీనివల్ల మీరు పదే పదే షేవింగ్ చేసుకోవాల్సి రావచ్చు. కాబట్టి ప్రతి రోజు షేవింగ్ చేసే కన్నా వారానికి రెండు మూడుసార్లు మాత్రమే ముఖానికి షేవింగ్ చేయడం అలవాటుగా మార్చుకోవాలి.
కొందరికి చాలా సున్నితమైన చర్మం ఉంటుంది. అలాగే మొటిమలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటివారు షేవింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. వాళ్ళు ఫేస్ షేవింగ్ చేయడం వల్ల ఇంకా అనేక గాయాలకు, సమస్యలకు కారణం అవుతాయి. కాబట్టి మొటిమలతో బాధపడుతున్న వారు షేవింగ్ చేయడం మంచి పద్ధతి కాదు.
Also Read: ఉదయం పూట గోరువెచ్చని నీళ్లు తాగితే.. మతిపోయే లాభాలు !
ముఖానికి షేవింగ్ చేసిన తర్వాత ఐస్ క్యూబ్స్ తో ముఖాన్ని ఒకసారి రుద్దుకుంటే ఎంతో మంచిది. మంట, చికాకు వంటివి తగ్గుతాయి. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.