MLA Rajagopal Reddy: తెలంగాణ మంత్రి వర్గ విస్తరణపై నిన్న ఢిల్లీలో కీలక భేటీ జరిగిన విషయం తెలిసిందే. అయితే మంత్రి పదవిపై పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని, ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు. తనకు హోం మంత్రి పదవి అంటే చాలా ఇష్టం అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.
అధిష్టానం నుంచి కాల్ రాలేదు..
తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని, ఏ పదవి వచ్చినా రాష్ట్రం కోసం, ప్రజల కోసం సమర్థవంతంగా పనిచేస్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. పార్టీ అధిష్టానం నుంచి ఇంకా ఫోన్ కాల్ రాలేదని ఆయన చెప్పారు. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వహించానని తెలిపారు. తనకు హోంమంత్రి పదవి అంటే చాలా ఇష్టం అని పేర్కొన్నారు.
ఏ పదవి ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తా..
రాష్ట్ర కేబినేట్ లో ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తానని.. ప్రజల పక్షాన నిలబడతానని చెప్పుకొచ్చారు. నిన్న దేశ రాజధాని ఢిల్లీలో సీరియస్ గానే కేబినెట్ విస్తరణపై చర్చ జరిగినట్లు ఉందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కాగా తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం అమోద ముద్ర వేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు మంత్రి వర్గ విస్తరణకు సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా మంత్రి వర్గ విస్తరణలో పలు సామాజిక వర్గాల నుంచి కనీసం నలుగురికి లేదా ఐదుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో మంత్రి పదవులతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సైతం భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది.
ALSO READ: Telangana BJP chief: టీబీజేపీ చీఫ్ రేసులో ఉన్నది వీరే.. కమలనాథుల వ్యూహం పెద్దదే..!