Yoga For Back Pain: బిజీ లైఫ్‌లో మెడ, వెన్నునొప్పి వంటి సమస్యలు సర్వసాధారణమైయాయి. ఈ నొప్పి కొన్నిసార్లు తక్కువగా ఉన్నా.. మరి కొన్నిసార్లు మాత్రం ఇది తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇలాంటి సమయంలో రోజువారి పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది.
సాధారణంగా చలికాలంలో శరీరంలో నొప్పి పెరుగుతుంది. మెడ, వెన్ను లేదా నడుము నొప్పి పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. శరీరంలోని ఈ సమస్యల గురించి తెలుసుకోవడం ద్వారా వాటిని తక్కువ సమయంలోనే నయం చేయవచ్చు. ఇదిలా ఉంటే నడుము నొప్పికి గల కారణాలను మరియు దాని నుండి బయటపడే సహజ మార్గాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మెడ, వెన్ను, నడుము నొప్పికి ప్రధాన కారణాలు:
కూర్చునే విధానం:
ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడటం వల్ల శరీరంలో నొప్పి వస్తుంది. ముఖ్యంగా ఆఫీసులో కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేస్తున్నప్పుడు మెడ, వెన్నునొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.
అధిక శారీరక శ్రమ:
అకస్మాత్తుగా భారీగా బరువులు ఎత్తడం లేదా విపరీతమైన అలసట కలిగించే కార్యకలాపాలు చేయడం వల్ల కండరాల ఒత్తిడి, నొప్పి పెరుగుతుంది.
శారీరక వ్యాయామం లేకపోవడం:
శారీరక చైతన్యం లేకపోవడం వల్ల కూడా మెడ, వెన్ను నొప్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరంలోని కండరాలు బలహీనపడడం వల్ల వెన్ను, నడుము నొప్పులు వస్తాయి.
వెన్ను, మెడ నొప్పులను తగ్గించే యోగాసనాలు:
తడసానం:
నిటారుగా నలుచుని రెండు చేతులను పైకి చాచండి. ఇలా చేయడం వల్ల నడుము కండరాల పనితీరు మెరుగుపడుతుంది. అంతే కాకుండా మెడ, వెన్ను నొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
భుజంగాసనం:
భుజంగాసనం తరుచుగా చేయడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. అంతే కాకుండా ఇది వెన్నెముకను ఫ్లెక్సిబుల్‌గా మార్చగలదు. ఇలా చేయడం ద్వారా నడుము, వెన్నునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
ఉస్త్రాసనం:
మీ శరీరం యొక్క వెనుక భాగంలో అంటే మెడ, వీపు, నడుము భాగంలో నొప్పి కొనసాగితే, ఉస్ట్రాసనం చేయండి. ఈ ఆసనం వల్ల అనేక భౌతిక ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాకుండా ఈ ఆసనం చేయడం వల్ల కండరాలు సాగదీయబడతాయి.
ధనురాసనం:
ధనురాసనం శరీరాన్ని బలంగా, వీపును ఫ్లెక్సిబుల్‌గా మార్చడంలో ప్రయోజనకరంగా పనిచేస్తుంది. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంతో పాటు, వెన్నుముకను ఫ్లెక్సిబుల్‌గా మార్చడంతోపాటు ఈ ఆసనం వెన్నును బలపరుస్తుంది.
Also Read: జ్వరం వచ్చినప్పుడు.. మందులు ఎప్పుడు వేసుకోవాలి ?
శలభాసనం:
రోజు శలభాసనం చేయడం వల్ల కండరాలు బలపడతాయి. ఇది మెడ , నడుముపై ఒత్తిడిని తెస్తుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల వెన్ను ,నడుము నొప్పి తగ్గుతుంది. అంతే కాకుండా చలికాలంలో శరీర బిగుతును కూడా తగ్గిస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.