E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఆదర్శ కుటుంబం కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..గూస్ బంప్స్ గ్యారెంటీ!

ఆదర్శ కుటుంబం కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..గూస్ బంప్స్ గ్యారెంటీ!
Advertisement

Venkatesh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్న వెంకటేష్(Venkatesh ) 65 సంవత్సరాల వయసులో కూడా వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న వెంకటేష్.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

సినిమాకి ఆ 20 నిమిషాలే కీలకము..

ఎన్నో అంచనాల మధ్య ఊహించని క్యూరియాసిటీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక చిన్న వార్త అభిమానులలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. వెంకటేష్ తో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని ఆయన ఖాతాలో చేర్చడానికి త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. ఈ సినిమాలో ప్రత్యేక సెట్ లో చిత్రీకరించి.. 20 నిమిషాల ట్రైన్ ఎపిసోడ్ సిచ్యువేషనల్ తో పాటు కామెడీ ప్రధాన హైలైట్ గా నిలవనున్నాయని సమాచారం. ముఖ్యంగా ఆ 20 నిమిషాలే సినిమాకు అత్యంత కీలకము అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. సరికొత్త మేకింగ్ , రైటింగ్ తో రూపొందుతున్న ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. మొత్తానికైతే సినిమాలో ఆ 20 నిమిషాలే హైలెట్ అని తెలియడంతో అభిమానులు ఆసక్తి పెంచుకుంటున్నారు. మరి అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.

Advertisement

also read:పిల్లలు కావాలన్న భర్త.. విడాకులు ఇచ్చేసిన నటి.. ఎవరంటే?

ఆదర్శ కుటుంబంలో కేజీఎఫ్ బ్యూటీ..

సినిమా విషయానికి వస్తే.. ఈ ప్రాజెక్టులో వెంకటేష్ సరసన కే.జీ.ఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ, వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. పీ.ఎస్.వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇక త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్లో రాబోతున్న మొదటి పూర్తిస్థాయి చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో అలాగే ట్రేడ్ వర్గాలలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

వెంకటేష్ తదుపరి చిత్రాలు..

Advertisement

వెంకటేష్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. ఈయన మళ్ళీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో కొత్త సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి కళ్యాణ్ రామ్ తో జత కట్టనున్నారు. కళ్యాణ్ రామ్, వెంకటేష్ మల్టీ స్టారర్ గా వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Related News

‘అంజి’ కష్టాలు రిపీట్ అవుతున్నాయా..? ‘విశ్వంభర’ లేటెస్ట్ లీక్స్‌తో తలపట్టుకుంటున్న ఫ్యాన్స్!

స్పైడర్ మ్యాన్ తాజా ప్రోమోలో మెస్సీ.. 20 సెకన్ల యాక్టింగ్‌కు ఎన్ని కోట్లో తెలుసా ?

నాడు ఉపాసన.. నేడు సురేఖ.. మెగా కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవులు!

5 మంది హీరోయిన్స్ తో టాక్సిక్ నుండి అదిరిపోయే వీడియో రిలీజ్.. యశ్ లుక్స్ చూసారా?

సమంత క్యూట్ బేబీ బంప్ లుక్ వైరల్..పోస్ట్ వైరల్!

Kayadu lohar: 10వ తరగతిలోనే తల పగలగొట్టిన కాయాదు లోహర్.. ఏం జరిగిందంటే?

Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రిజల్ట్స్.. చిరు టు సమంత హిట్ సినిమాలు..

Big Stories

×