BRS Strategy: స్వేచ్చ బ్యూరో: ఉత్తర తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కనుంది. రానున్న ఎన్నికల్లో తిరిగి తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు గులాబీ దళం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రధాన ప్రత్యర్థులైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ పార్టీల బలాబలాలను దెబ్బతీస్తూ, పట్టున్న ప్రాంతాల్లో మరింత బలోపేతం కావడంపై బీఆర్‌ఎస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. త్వరలోనే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలను సైతం స్పీడప్ చేయబోతున్నట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఆ ఎన్నికల్లో గెలుపు కోసం గులాబీ పార్టీ ఇప్పటి నుంచే ప్రణాళికలు, వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే గతంలో తమకు గట్టి పట్టున్న ఉత్తర తెలంగాణ రీజియన్ లో ఇప్పుడు కమలం పుంజుకుంటుంది. యువత సైతం ఆకర్షితులు కావడంతో ఆ పార్టీ హవా నడుస్తోంది. మరిన్ని నియోజకవర్గాలపై దృష్టిసారించడంతో ఆలర్టు అయిన గులాబీ అధిష్టానం వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. కట్టడికి వ్యూహరచన చేస్తుంది. ఇటీవలగులాబీ పార్టీ నిర్వహించిన పలు సర్వేలు ఇదేవిషయాన్ని బీఆర్ఎస్ అగ్ర నేతలకు స్పష్టం చేసినట్లుగా సమాచారం. దీంతో గులాబీ పార్టీఇప్పుడు బీజేపీని దూకుడును తగ్గించడంపై ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తుంది.
నాలుగు ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉద్యమం నుంచి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో గులాబీ పార్టీ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. ఈ నాలుగు జిల్లాలో 44 అసెంబ్లీ స్థానాలు ఉంటేసుమారు 80శాతం సీట్లను 2014 అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికలు,2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కైవసం చేసుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గులాబీ సునామీ కొనసాగింది. అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలు బీఆర్ఎస్ పార్టీకి బ్రేకులు వేశాయి. ఇదే ఎఫెక్ట్ 2023 అసెంబ్లీ ఎన్నికలపై పడింది.
Also Read: సంక్రాంతికి స్టార్ హీరోల జాతర.. థియేటర్లు సరిపోతాయా గురూ?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, కరీంనగర్ లో 13, అదిలాబాద్ లో10, వరంగల్ -12 నియోజకవర్గాలు ఉండగా,ఇందులో బీఆర్ఎస్ కేవలం 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే విజయం సాధించింది. బీజేపీ అనూహ్యంగా 7 సెగ్మెంట్లు, కాంగ్రెస్ ఏకంగా 26అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అందులో ఆదిలాబాద్ లో బోధ్, ఆసిఫాబాద్, కరీంనగర్లో సిరిసిల్ల, కరీంనగర్, కోరుట్ల, హుజూరాబాద్, జగిత్యాల, వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘన్ పూర్, జనగాం, నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ, బాల్కొండల్లో గులాబీ విజయం సాధించింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్,నిజామాబాద్,కరీంనగర్ లోక్ సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఎంపీలుగా పోటీ చేసినకీలక నేతలు ఓడిపోయారు. దీంతో అప్పటి నుంచి ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా కొనసాగుతుంది.
బాన్సువాడ, జగిత్యాల, స్టేషన్ ఘన్ పూర్ ఈ మూడు నియోజకవర్గాల్లపైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. రాజీనామాకు డిమాండ్ తో పాటు స్పీకర్ కు, హైకోర్టుకు సైతం వెళ్లింది. ఫిరాయింపు చట్టం కింద అనర్హత వేటు వేయాలని పోరాటం కొనసాగిస్తుంది. మరోవైపు ఈ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుంది. నేతలను సైతం సిద్దం చేస్తుంది. పార్టీ మారినా కేడర్ బలంగా ఉందని, వచ్చేసారి గెలుపు తథ్యం అని తాము అండగా ఉంటామని పార్టీ భరోసా ఇస్తుంది.అక్కడ ఉన్న స్థానిక నాయకత్వ సమీకరణలు, అసమ్మతులు, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను నిశితంగా పరిశీలిస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారం కోల్పోవడానికి..తమ ఓటమికిఉత్తర తెలంగాణ జిల్లాలు ప్రధాన కారణం అనిబీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. దీంతోఆ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్,నిజామాబాద్ జిల్లాల్లో బీజేపీ 7 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. అందులో నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, ముదోల్, నిర్మల్, సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీనిజామాబాద్,కరీంనగర్,ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాలను బీజేపీ నిలబెట్టుకుంది.2019 నుంచి క్షేత్ర స్థాయిలో బీజేపీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బలపడుతూ వస్తోంది.
Also Read: ఎవరీ దిమాగీ నక్సల్స్.. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!
దీంతో బీజేపీకి చెక్ పెట్టే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పలు సర్వేలు చేయిస్తూ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీజేపీ ప్రభావం ఏ విధంగా ఉంది అనే దానిపై బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఎక్కడ బలహీనతలు ఉన్నాయి? ప్రత్యర్థుల బలం ఎంత? అనే అంశాలపై గులాబీ అధిష్టానం లోతైన ఆరా తీస్తోంది. అంతర్గత సర్వేల ద్వారా సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోంది.ప్రస్తుతం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి యువతలో గణనీయమైన ఆదరణ ఉందనే అంచనాలు ఉన్నాయి. ఈ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడం ద్వారా బీజేపీకి చెక్ పెట్టాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు ఏళ్ళు సమీపిస్తుంది. ఇకప్రభుత్వం పని తీరు ఏ విధంగా ఉంది అనే దానితో పాటు వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అనే అంశంపై బీఆర్ఎస్ పార్టీ సర్వేలు నిర్వహిస్తోంది. ఈ సర్వేల్లోనూ ఉత్తర తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకును బీఆర్ఎస్ తమ వైపుకు టర్న్ చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చనే అభిప్రాయం వెల్లడైనట్లు సమాచారం. అందుకే బీజేపీని ఇరుకున పెట్టే విధంగా యూరియా కొరతపై ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది.
కేంద్రం కావాలని యూరియా సరఫరాచేయడం లేదని, వివక్ష చూపుతుందని విమర్శలు గుప్పించింది. అదే విధంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు, వైఫల్యాలు వివరించి యువతతో పాటు అన్ని వర్గాలను గులాబీ వైపునకు తిప్పుకోవాలని అందుకు వ్యూహ రచనచేస్తుంది. కాంగ్రెస్, బీజేపీ లను టార్గెట్ గా రాజకీయాలు చేస్తూ ముందుకు సాగేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే వ్యూహాలకు పదునుపెట్టబోతున్నట్లు సమాచారం. ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావాన్ని తగ్గించేందుకు, కాంగ్రెస్ పార్టీ నేతలను సైతం డిమోరల్ చేసేలా గులాబీ పార్టీ రచిస్తున్న ప్రణాళికలు ఏమేరకు వర్కౌట్ అవుతాయా లేదా అనేది చూడాలి.
Also Read: అక్బర్ నిజంగా జోధాబాయిని పెళ్లి చేసుకున్నాడా? 400 ఏళ్లుగా చరిత్రలో నడుస్తున్న అసలు కథ ఇదే!