BigTV English

8 Vasanthalu: సెన్సార్ పూర్తి.. రన్ టైం లాక్.. బ్యూటిఫుల్ మూవీకి కోత తప్పలేదుగా!

8 Vasanthalu: సెన్సార్ పూర్తి.. రన్ టైం లాక్.. బ్యూటిఫుల్ మూవీకి కోత తప్పలేదుగా!

8 Vasanthalu: కేరళ కుట్టి అనంతిక సనీల్ కుమార్ (Ananthika Sanil Kumar) లీడ్ రోల్ పోషిస్తూ తెరకెక్కుతున్న చిత్రం 8 వసంతాలు (8 Vasanthalu). ఫణీంద్ర నర్సెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. అంతేకాదు రన్ టైం కూడా లాక్ చేశారు. అయితే సెన్సార్ సమయంలో ఈ సినిమాలో కొన్ని కట్స్ విధించినట్లు సమాచారం. ట్రైలర్ తోనే ఇదొక బ్యూటిఫుల్ మూవీ గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరి ఇలాంటి అందమైన కథకి కూడా కోత తప్పలేదు అని తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సెన్సార్ జారీ చేసిన సర్టిఫికెట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


సెన్సార్ పూర్తి చేసుకున్న 8 వసంతాలు.. నిడివి ఎంతంటే?

‘ మధురం’ షార్ట్ ఫిలిం తో పాటూ ‘మను’ చిత్రంతో ఫణీంద్ర కు దర్శకుడిగా మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి తాజాగా సెన్సార్ పూర్తయింది. 2:20:43 గంటలతో రన్ టైం లాక్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వై రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుండి 1:39 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను తొలగించి, ఆ స్థానంలో 2:30 నిమిషాల షాట్ జత చేసినట్లు సమాచారం.


సెన్సార్ కట్ చేసిన సన్నివేశాలు ఇవే..6

1.ఇక ఇందులో యాంటీ డ్రగ్ డిస్క్లైమర్ , ధూమపాfనం, మద్యపానం నిషేధం యాడ్ కోసం సుమారుగా 5 సెకండ్ల సమయాన్ని కేటాయించారు.

2. మార్కెట్ ఏరియా విజువల్స్ ను రీప్లేస్ చేయడం జరిగింది.

3. కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేయడమే కాకుండా సీజీ ని యూస్ చేసి రూపొందించిన కొన్ని విజువల్స్ ని కట్ చేశారు.

4. అలాగే పొలిటికల్ కి సంబంధించిన ర్యాలీలో పిల్లలు కూడా పాల్గొన్నట్టు చూపించిన సన్నివేశాన్ని కూడా డిలీట్ చేయడం జరిగింది.

5. అంతేకాదు ఈ సినిమాలో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు చూపించిన సన్నివేశాలను కూడా తొలగించారు. ఇలా కొన్ని సన్నివేశాలను సినిమా నుండి డిలీట్ చేయడం జరిగింది.

8 వసంతాలు ఫస్ట్ రివ్యూ..

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జూన్ 18, 19వ తేదీలలో అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ దేశాలలో ఈ సినిమాని ప్రీమియర్లుగా ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన ఆడియన్స్ చాలా ఏళ్ల తర్వాత ఒక గొప్ప ప్రేమను చూసినట్టు అనిపిస్తోందని తెగ పొగిడేస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని మాటలు గుండెల్ని తాకుతాయని తమ అభిప్రాయాలుగా వ్యక్తం చేస్తున్నారు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదని, కథ స్లోగా ఉందని, ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అవుతోందని చెబుతున్నారు ఇక రేపు విడుదల ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని చూపిస్తుందో చూడాలి.

ALSO READ:Sunil Narang: ప్రొడ్యూసర్ ను హర్ట్ చేసిన కుబేర టీం.. ఇదే చివరి సినిమా కానుందా?

Related News

kaantha Movie: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ ‘కాంత’ మూవీ ఫస్ట్ సాంగ్ అవుట్

Coolie vs War 2 : వార్‌కి ఇది సరిపోదు… మిగిలింది ఈ ఒక్క ఛాన్సే

Vadde Naveen: పదేళ్ల తర్వాత రీఎంట్రీ.. ఈ కానిస్టేబుల్ కష్టాలేందుకు నవీన్..

Bollywood: రక్షాబంధన్ వేళ కన్నీళ్లు పెట్టిస్తున్న సుశాంత్ సింగ్ సోదరి పోస్ట్!

Niharika Konidela: మెగా బ్రదర్స్ తో నిహారిక రాఖీ సెలబ్రేషన్స్.. ఆకట్టుకున్న ఫోటోలు!

Aamir Khan Brother: ఏడాది పాటు గదిలో బంధించాడు.. ఏవేవో మందులు ఇచ్చి చిత్రహింసలు పెట్టాడు.. ఆమిర్ ఖాన్ పై సోదరుడి ఆరోపణలు

Big Stories

×