Dhurgam Cheruvu crime: దుర్గం చెరువులో దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. సికింద్రాబాద్ అడ్డగుట్టలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న సుష్మ మాదాపూర్లోని ఓ ఆఫీసులో జాబ్ చేస్తోంది. బుధవారం జాబ్‌కి వెళ్లి సుష్మ రాత్రి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆఫీస్ మేనేజర్‌కు కాల్ చేశారు. అయితే రాత్రి 10:30 గంటలకే సుష్మ ఆఫీసు నుంచి వెళ్లినట్లు తెలిపాడు. దీంతో సుష్మ ఫ్రెండ్స్, బంధువుల ఇళ్లలో వెతికినా కూతురు ఆచూకీ దొరకకపోవడంతో తెల్లవారుజామున సుష్మ తండ్రి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దుర్గం చెరువులో మహిళ మృతదేహం తేలుతుందని ఉదయం 7 గంటలకు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వెలికితీశారు. ఆ మృతదేహం సుష్మగా గుర్తించారు. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించిన మాదాపూర్ పోలీసులు…పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుష్మ మృతికి గల కారణాలపై ఎంక్వైరీ జరుగుతోంది.
అయితే ఈ ఘటనలో… ఆమె భర్త, అత్తమామలపై తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించడం వల్లే సుష్మ చనిపోయిందని… ఆమె పేరెంట్స్ అంటున్నారు. 6 నేలల కిందటే సుష్మకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె 3 నెలల గర్బవతిగా చెబుతున్నారు. పెళ్ళి సమయంలో 5 లక్షలు కట్నం, 6 తులాల బంగారం, వెండి ఇచ్చామంటు సుష్మ తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే 50 వేలు తక్కువగా ఇచ్చారని రోజూ తనని వేధించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో నుంచి భర్త వేళ్లిపో అనడంతో సుష్మ మనస్థాపనకు గురైంది. అంతేకాకుండా తమ కూతురిని వాళ్లే తోసుశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వేధింపులు తట్టుకోలేక.. కేబుల్ బ్రిడ్జి మీది నుంచి దూకి ఈ ఆత్మహాత్యకు పాల్పడిందని చెబుతున్నారు.
Also Read: చిక్కిన సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. బిల్డర్‌ని హనీట్రాప్ చేసి బుక్కైంది
సుష్మ తల్లిదండ్రులు పెళ్లైన 4 నెలలకే తమ బిడ్డ తమకు దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంలోని అందరూ తనను వేధిస్తున్నారని రోజూ చెప్పి బాధపడేదని సుష్మ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని… భర్తే ఆమెను చెరువులోకి తోసేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.