BigTV English

Shocking News: డ్రైనేజీ క్లీన్ చేస్తుంటే అస్థిపంజరం బయటకొచ్చింది.. అపార్టుమెంటులో అలజడి!

Shocking News: డ్రైనేజీ క్లీన్ చేస్తుంటే అస్థిపంజరం బయటకొచ్చింది.. అపార్టుమెంటులో అలజడి!

అపార్ట్ మెంట్లలో డ్రైనేజీలు పెద్దగా నిర్మిస్తారు. వీలైనం వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డ్రైన్ వాటర్ వెళ్లిపోతుంది. ఏదైనా పెద్ద ఆటంకం ఏర్పడితేనే డ్రైనేజీ వాటర్ జామ్ అవుతాయి. అలాగే, తాజాగా బెంగళూరు పరిధిలోని బేగూర్‌ ఇండస్ట్రియల్ లే అవుట్‌ లోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ లో డ్రైనేజీ సమస్య తలెత్తింది. డ్రైన్ వాటర్ సాఫీగా వెళ్లకుండా ఏదో అడ్డుపడటంతో మున్సిపల్ కార్మికులకు చెప్పి, దానిని శుభ్రం చేయించాలనుకున్నారు. అపార్ట్ మెంట్ లో సుమారు 45 కుటుంబాలు నివసిస్తున్నాయి. వారంతా కలిసి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA) వర్షపు నీటిని పీల్చుకోవడానికి ఉపయోగించే 16 పెర్కోలేషన్ గుంతలను పూర్తిగా శుభ్రపరిచే పనిని మొదలుపెట్టారు. ఒక్కొక్కటిగా శుభ్రం చేస్తూ వెళ్లారు. ఓ గుంత శుభ్రం చేస్తుండగా అందరూ షాకయ్యారు.


రైయిన్ వాటర్ గుంతలో మనిషి అస్థి పంజరం

రెయిన్ వాటర్ ఇంకుడు గుంతను శుభ్రం చేస్తుండగా, బురద అడుగున మనిషి అస్థి పంజరం బయటపడింది. గుంత లోపల బురదలో పాతిపెట్టిన ఎముకలు బయటకు వచ్చాయి. వెంటనే  ఈ విషయాన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పారు. తను పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. ఇంతకీ ఆ ఎముకలు మనిషివా? లేక జంతువుదా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాల కోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబొరేటిరీకి పంపించారు. “ఇంకా ఆ గుంతో అవశేషాలు బయటపడే అవకాశం ఉంది. పూర్తిగా తవ్వి పరిశీలన చేయబోతున్నాం” అని  పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే, ఆ ప్రదేశం ఒకప్పుడు శ్మశాన వాటికగా ఉండొచ్చని మరికొంత మంది అనుమానిస్తున్నాయి. అయితే, ఇంతకీ ఆ అస్థిపంజరం మనిషిదా? కాదా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక అసలు నిజాలు తెలియనున్నాయి.


స్మశానవాటికపై అపార్ట్ మెంట్ కట్టారా?

కొంత మంది వ్యక్తులు ఈ అపార్ట్ మెంట్ ను స్మశానవాటికను కబ్జా చేసి కట్టారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఊహాగానాల నేపథ్యంలో అపార్ట్ మెంట్ వాసులు భయపడతున్నారు. “అపార్ట్‌ మెంట్ కాంప్లెక్స్‌ లోని  మూలల్లో 16 పెర్కోలేషన్ పిట్‌ లు ఉన్నాయి. కార్మికులు ఒక గుంతలో అవశేషాలను కనుగొన్నారు. అవి మనిషివేనా? అనే ప్రయత్నం చేస్తున్నాం” అని బేగూర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.  “నీరు నిలిచిపోవడం, డ్రైనేజీ సరిగా లేకపోవడంతో మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగానే పిట్ క్లీనింగ్ కార్యకలాపాలను ప్రారంభించాం. కొన్ని మూసుకుపోయిన గుంటలు సరిగా పని చేయడం లేదు. అందుకే వాటిని శుభ్రం చేయాలి అనుకున్నాం. వాటిని శుభ్రం చేస్తుండగా ఈ విషయం బయటపడింది” అని అసోసియేషన్ అధ్యక్షుడు పోలీసులకు చెప్పారు. మరోవైపు ఈ అవశేషాలకు సంబంధించి ఫోరెన్సిక్ ఫలితాల కోసం అపార్ట్ మెంట్ వాసులు ఎదురు చూస్తున్నారు. ఈ ఘటన అపార్ట్ మెంట్ వాసులలో ఆందోళన కలిగిస్తోంది. వీరిలో చాలామంది ఇంకా తమ ఇళ్ల కింద ఏమి ఉన్నాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: హనీమూన్ మర్డర్ కేసులోకి కొత్త వ్యక్తి, సోనమ్ నుంచే ఏకంగా 119 కాల్స్!

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×