E-Paper
Advertisement

ఫ్లైట్ క్యాన్సిల్.. విమానాశ్రయంలో ప్రయాణికురాలు చేసిన పనికి అంతా షాక్!

ఫ్లైట్ క్యాన్సిల్.. విమానాశ్రయంలో ప్రయాణికురాలు చేసిన పనికి అంతా షాక్!
Advertisement

IndiGo Flight Cancelled: ఇండిగో విమానం క్యాన్సిల్ కావడంతో భువనేశ్వర్ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానాశ్రయంలోని డిపార్చర్ లాంజ్‌ లో కాసేపు హంగామా సృష్టించింది.  ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానంలో సాంకేతిక సమస్య కారణంగానే సర్వీస్‌ను రద్దు చేసినట్లు ఇండిగో వెల్లడించింది.

సాంకేతిక సమస్యతో విమానం రద్దు

భువనేశ్వర్ నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన ఇండిగో విమానం 6E 7352 గురువారం రద్దయింది. విమానం బయలుదేరే ముందు నిర్వహించే తనిఖీల్లో సాంకేతిక లోపం గుర్తించినట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. విమానం మధ్యాహ్నం 2:35 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, సాయంత్రం 5:30 గంటల సమయంలో రద్దు చేసినట్లు సమాచారం. దీంతో చాలాసేపు విమానం కోసం ఎదురుచూసిన ప్రయాణికులు అసహనానికి గురయ్యారు.

ప్రయాణికురాలి ఆగ్రహం

Advertisement

విమానం రద్దు విషయం తెలిసిన తర్వాత ఓ మహిళా ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహానికి గురైంది. డిపార్చర్ లాంజ్‌లో ఉన్న వస్తువులను విసిరేయడంతో పాటు అక్కడి లగేజీ బెల్ట్‌ పైకి ఎక్కినట్లు వైరల్ వీడియోలో కనిపిస్తోంది. గ్రౌండ్ సిబ్బందితో ఆమె వాగ్వాదానికి దిగినట్లు కూడా తెలుస్తోంది. ఆమెను శాంతింపజేసేందుకు తోటి ప్రయాణికులు ప్రయత్నించారు. కొందరు ఆమెకు నీళ్లు ఇచ్చి ప్రశాంతంగా ఉండాలని చెప్పినా, సీరియస్ అయ్యింది.

రంగంలోకి CISF సిబ్బంది

ఎంత చెప్పినా సదరు మహిళ శాంతించకపోవడంతో.. CISF సిబ్బంది జోక్యం చేసుకున్నారు. విమానాశ్రయంలో వస్తువులకు నష్టం కలిగించకూడదని మహిళను హెచ్చరించారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి అదుపులోకి తీసుకుని సంబంధిత భద్రతా అధికారులకు అప్పగించినట్లు ఇండిగో తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో మహిళ ఆగ్రహంతో ఊగిపోతున్నట్లు కనిపించింది. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

 ఇండిగో ఏం చెప్పింది?

Advertisement

అటు ఈ ఘటనపై ఇండిగో స్పందించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. విమానం రద్దు కావడానికి కారణం ప్రీ డిపార్చర్ తనిఖీల్లో గుర్తించిన సాంకేతిక సమస్యేనని స్పష్టం చేసింది. ప్రయాణికులకు పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించడంతో పాటు అవసరమైన సహాయం అందించినట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. ఇందులో బ్రేక్ ఫాస్ట్, వసతి, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు, అర్హత ఉన్న వారికి పూర్తి రీఫండ్ లాంటివి అందించినట్లు తెలిపింది.

ప్రయాణికుల భద్రతే ముఖ్యం

విమాన సాంకేతిక లోపాలను ప్రయాణానికి ముందే గుర్తించడం ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశంగా  విమానయాన సంస్థలు చెబుతుంటాయి. ఈ ఘటనలోనూ సమస్యను గుర్తించిన తర్వాత విమానాన్ని నడపకుండా రద్దు చేసినట్లు ఇండిగో వివరణ ఇచ్చింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత, సౌకర్యమే తమకు అత్యంత ప్రాధాన్యత అని ఇండిగో వెల్లడించింది. ఫ్లైట్ క్యాన్సిల్ సమయంలో ప్రయాణికులకు సాధ్యమైనంత త్వరగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపింది.

Read Also: విజయవాడ నుంచి ఇండిగో సర్వీసులు.. ఏ నగరాలకు వెళ్తాయంటే?

Tags

Related News

రూ.17 వేల నుంచే వైల్డ్‌ లైఫ్ టూర్.. ఈ 3 ప్లేసులు మిస్ అవ్వొద్దు!

వందే భారత్ స్లీపర్ vs రాజధాని.. ఫుడ్ ఏ రైల్లో బాగుంటుంది?

రైలు పట్టాల కింద రాళ్లు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఊహించడానికే భయంగా ఉంది బాబోయ్!

సైట్ ఓపెన్ చేస్తే సర్వర్ డౌన్.. క్షణాల్లో మాయమవుతున్న రైల్వే టికెట్లు!

రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్‌ ఉన్నా జరిమానా తప్పదు.. ఎందుకంటే?

రైల్వే ట్రాక్‌ లపై డ్రోన్లతో నిఘా.. ప్రయాణాలకు ఇబ్బంది లేకుండానే తనిఖీలు!

వెయిటింగ్ లిస్ట్ ఉన్నా టెన్షన్ వద్దు.. చార్ట్ తర్వాత కూడా రైలు టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు!

పగిలిన అద్దాలు.. కంపుకొట్టే టాయిలెట్లు.. బాబోయ్.. ఇది వందేభారత్ రైలా?

Big Stories

Advertisement
×