OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చేసిన రెండవ చిత్రం ఓజీ. సాహో చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య గత ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అతిపెద్ద హిట్ అందించిన ఈ చిత్రం.. ఫుల్ రన్ ముసేసరికి రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి విజయం అందుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తొలిసారి స్టైలిష్ గ్యాంగ్ స్టార్ అవతారంలో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.
అయితే ఈ సినిమాకి కొనసాగింపుగా సీక్వెల్ ను అటు సుజిత్ ఇటు పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా అయితే ప్రకటించారు కానీ షూటింగ్ ప్రారంభం కావడానికి కాస్త సమయం పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ అభిమానులలో అంచనాలు పెంచేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయింది. పైగా ఈ సినిమా కోసం తమన్ మ్యూజిక్ పనులు కూడా ప్రారంభించారు. ఇటీవలే పవన్ కళ్యాణ్, సుజీత్ తో కలిసి దిగిన ఫోటోని కూడా తమన్ షేర్ చేసి ఓజీ పార్ట్ 2 సినిమా వర్క్ ఎంత ఫాస్ట్ గా జరుగుతోందో హింట్ కూడా ఇచ్చారు. అటు సుజీ త్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టడం.. ఇటు తమన్ మ్యూజిక్ పనులు స్టార్ట్ చేయడం అంతా ఓకే కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్ ఇస్తారు అనే కామెంట్లు వ్యక్తమవుతుండగా.. తాజాగా షూటింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
also read:పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. హిందీ వెర్షన్ ఆలస్యానికి కారణం?
పవన్ కళ్యాణ్ ప్రతి ఏటా చేపట్టే నాలుగు నెలల చాతుర్మాస దీక్ష ఈ ఏడాది కూడా ప్రారంభించారు. ఇక ఈ దీక్ష సెప్టెంబర్ లో ముగుస్తుంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2 కాబట్టి ఆ రోజు ఓజీ 2 షూటింగ్ అప్డేట్ ఇచ్చి ఆయన దీక్ష ముగియగానే సెప్టెంబర్ చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా కథ జపాన్ బ్యాక్ డ్రాప్ లో ఉండడంతో కచ్చితంగా పవన్ కళ్యాణ్ కు అటు జపాన్ లో భారీ క్రేజ్ అందించడం ఖాయం అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ సొంతంగా నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా మరొకవైపు ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ పాత్ర ఆమెకు మంచి పేరును కూడా అందించింది. అయితే ఇప్పుడు ఆమె పార్ట్ 2 లో బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తారు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే పూజా హెగ్డే కి గట్టి కం బ్యాక్ దొరికినట్లే. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.