E-Paper
Advertisement

మహిళలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ కుట్టు మిషన్ల స్కీమ్‌పై మంత్రి పొన్నం కీలక అప్‌డేట్!

మహిళలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ కుట్టు మిషన్ల స్కీమ్‌పై మంత్రి పొన్నం కీలక అప్‌డేట్!
Advertisement

Ponnam Prabhakar: తెలంగాణలో బీసీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా సంక్షేమ శాఖ పథకాల్లో పారదర్శకతను పెంచాలని, వేగంగా అమలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు తాజాగా జరిగిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా మహిళలకు స్వయం ఉపాధి కల్పన, గురుకుల పాఠశాలల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

కుట్టు మిషన్ల పంపిణీ

Advertisement

బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇంటింటా కుట్టు మిషన్ల’ పథకానికి అపూర్వ స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.80 లక్షల దరఖాస్తులు రాగా, తొలి విడతగా ప్రతి నియోజకవర్గానికి 1,000 మంది చొప్పున మొత్తం 1.90 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న లబ్ధిదారులకు నేరుగా కుట్టు మిషన్లు అందించేలా పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని, టెండర్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

301 ప్రైవేట్ గురుకులాలకు శాశ్వత పరిష్కారం!

Advertisement

రాష్ట్రంలోని 327 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలల పరిస్థితిపై ఆయా రీజనల్ కోఆర్డినేటర్లు అందించిన నివేదికలపై మంత్రి సమీక్ష జరిపారు. ప్రస్తుతం ఉన్న 327 గురుకులాల్లో కేవలం 26 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉండగా, మిగిలిన 301 పాఠశాలలు ప్రైవేట్ అద్దె భవనాల్లో కొనసాగుతుండటం గమనార్హం. అయితే, ఇప్పటికే 37 గురుకులాలకు సొంత స్థలాలు అందుబాటులో ఉన్నందున, అక్కడ భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులు మరియు అనుమతులు మంజూరు చేసేలా ప్రభుత్వంతో చర్చిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

స్టడీ సర్కిళ్లపై ప్రత్యేక నిఘా

ఎన్నికల హామీ మేరకు పెండింగ్‌లో ఉన్న 38 బీసీ ఆత్మగౌరవ భవనాల జీవోల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. అలాగే, రాజీవ్ యువ వికాసం పథకం కింద వచ్చిన దరఖాస్తుల్లో బీసీ యువతకు తగిన ప్రాధాన్యత దక్కేలా చూస్తామన్నారు. మరోవైపు, బీసీ స్టడీ సర్కిళ్లలో నాణ్యమైన శిక్షణ కోసం కమిటీ నివేదిక ఆధారంగా నూతన సంస్కరణలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల్లో ఎలాంటి జాప్యం జరగకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా యంత్రాంగం పనిచేయాలని ఆయన తేల్చిచెప్పారు.

Also Read: విలువ లేనోడు రాజీనామా చేస్తే ఏంటి ఉపయోగం? హరీష్ రావుకు అద్దంకి మాస్ కౌంటర్!

Tags

Related News

ప్రేమ పేరుతో మోసం.. ఖమ్మంలో ప్రియుడి ఇంటి ముందు బాధితురాలి ధర్నా!

‘అర్నబ్’ తుపాన్ ఎఫెక్ట్.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైళ్లు రద్దు!

ఉప్పల్‌లో భారీ చోరీ.. 30 తులాల బంగారం, రూ.6 లక్షలు అపహరణ!

విలువ లేనోడు రాజీనామా చేస్తే ఏంటి ఉపయోగం? హరీష్ రావుకు అద్దంకి మాస్ కౌంటర్!

‘కేంద్రంలో ఉండి ఏం పీకుతున్నారు’? మోడీ, అమిత్ షాలపై అద్దంకి దయాకర్ షాకింగ్ కామెంట్స్!

అమీర్ అలీ ఖాన్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ డిమాండ్.. గాంధీభవన్ వద్ద పోస్టర్లు

హైదరాబాద్‌లో విషాదం.. దుర్గం చెరువులో దూకి వైజాగ్ టెక్కీ ఆత్మహత్య

Big Stories

Advertisement
×