E-Paper
Advertisement

వాట్సప్‌లో ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు.. ఫోన్ స్టోరేజ్ సమస్యకు శాశ్వతంగా చెక్!

వాట్సప్‌లో ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు.. ఫోన్ స్టోరేజ్ సమస్యకు శాశ్వతంగా చెక్!
Advertisement

Phone Storage Tips: ఎంత కాస్ట్‌లీ ఫోన్ కొన్నా సరే.. కొద్ది రోజులకే ‘స్టోరేజ్ ఫుల్’ అనే వార్నింగ్ మెసేజ్ కనిపిస్తే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. ఫోన్‌లో పెద్దగా యాప్స్, హెవీ వీడియోలు లేకపోయినా ఈ స్పేస్ అంతా ఎక్కడికి పోతోందో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటాం. కానీ, అసలు సీక్రెట్ ఏంటంటే.. మనం పొద్దున్నుంచి రాత్రి దాకా వాడే వాట్సపే మన ఫోన్ మెమరీని, క్లౌడ్ స్టోరేజ్‌ని సైలెంట్‌గా నింపేస్తోంది. మనకు వచ్చే వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలే ఈ సమస్యకు ప్రధాన కారణం.

సమస్య ఎక్కడుంది?

సాధారణంగా వాట్సప్ తమ డేటాను గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్ చేస్తుంది. అదే సమయంలో గూగుల్ ఫొటోస్ యాప్ కూడా వాట్సప్ ఫోల్డర్లలోని ఫొటోలను విడిగా క్లౌడ్‌లోకి అప్‌లోడ్ చేస్తుంది. దీనివల్ల ఒకే ఫొటో లేదా వీడియో రెండుసార్లు బ్యాకప్ అయి, ఫోన్ స్పేస్‌తో పాటు గూగుల్ ఖాతాలోని స్టోరేజ్‌ను కూడా త్వరగా ఖాళీ చేస్తుంది.

Advertisement

Also Read: హానర్ నుంచి Robot Phone.. కెమెరానే గింబాల్‌లా తిరుగుతుంది, ఫీచర్లు చూశారా?

గూగుల్ ఫొటోస్ బ్యాకప్ ఆపడమెలా?

ఈ డ్యూప్లికేట్ అప్‌లోడ్లను ఆపడానికి ముందుగా గూగుల్ ఫొటోస్ యాప్ ఓపెన్ చేసి, ప్రొఫైల్ ఐకాన్ ద్వారా సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ ‘బ్యాకప్’ ఆప్షన్‌లో ‘డివైజ్ ఫోల్డర్స్’ను ఎంచుకోవాలి. అందులో ఉన్న వాట్సప్ ఇమేజెస్, వాట్సప్ వీడియోల ఆటోమేటిక్ బ్యాకప్‌ను ఆపివేస్తే సరిపోతుంది. దీనివల్ల మీ పాత ఫొటోలు ఏవీ డిలీట్ అవ్వవు.

గ్యాలరీలో కనిపించకూడదంటే..

Advertisement

వాట్సప్‌లో వచ్చే ప్రతి ఫొటో ఫోన్ గ్యాలరీలో సేవ్ కాకుండా చూడటం మరో మంచి మార్గం. దీనికోసం వాట్సప్ సెట్టింగ్స్‌లోని ‘చాట్స్’ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ ‘మీడియా విజిబిలిటీ’ అనే ఆప్షన్‌ను ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే ఫొటోలు గ్యాలరీకి రావు కానీ, వాటసాప్ చాట్లలో ఎప్పటిలాగే ఉంటాయి.

ఆటో డెలివరీల నియంత్రణ:

వాట్సప్‌లో గ్రూపుల నుంచి వచ్చే అనవసర వీడియోలు, ఫొటోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా చూసుకోవడం మంచిది. సెట్టింగ్స్‌లోని ‘స్టోరేజ్ అండ్ డేటా’లోకి వెళ్తే ఏవి డౌన్‌లోడ్ అవ్వాలో మనమే నిర్ణయించవచ్చు. అలాగే వాట్సప్‌లోనే ఉండే ‘మేనేజ్ స్టోరేజ్’ ద్వారా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తున్న పెద్ద ఫైళ్లను సులభంగా గుర్తించి డిలీట్ చేయవచ్చు.ఈ చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా ఉండటమే కాకుండా.. మెమరీ క్లీనింగ్ కోసం థర్డ్ పార్టీ యాప్స్ వాడే ప్రమాదం కూడా తగ్గుతుంది.

Also Read: ఐఫోన్ ప్రియులకు నిజంగా వరమే.. ఆ మోడల్స్‌పై Flipkart Saleలో ఏకంగా రూ.17,000 తగ్గింపు!

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×