PMEGP loan scheme 2025: ఇప్పటి కాలంలో ఉద్యోగం పొందడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. కానీ స్వంత వ్యాపారం పెట్టి మనమే బాస్ అవ్వడం కంటే సంతోషాన్ని ఇచ్చేది ఏముంటుంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న PMEGP పథకం ఆ కలను నిజం చేస్తోంది. Prime Minister’s Employment Generation Programme (PMEGP) అనే ఈ స్కీమ్, కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారికి 25 లక్షల వరకు రుణం అందిస్తోంది. అంతేకాదు, ఈ రుణంపై 35 శాతం వరకు సబ్సిడీ కూడా ఇస్తోంది.
సాధారణంగా వ్యాపారం మొదలుపెట్టాలంటే పెట్టుబడి పెద్ద అడ్డంకి అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకే PMEGP వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వం నడిపే పథకం. వ్యాపారం పెట్టుకోవాలనుకునే యువతకు సబ్సిడీతో రుణం ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యం. అంటే రుణంలో కొంత భాగాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.
❄ అర్హులు ఎవరు?
ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరులు అర్హులు. కనీసం 8వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇప్పటికే వ్యాపారం ఉన్నవారు ఈ స్కీమ్‌కు అర్హులు కారరు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే నిరుద్యోగ యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఒబీసీ, దివ్యాంగులు వంటి వర్గాలకు ఈ పథకంలో ప్రాధాన్యం ఉంటుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారందరికీ ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది.
రుణం ఎంత పొందే ఛాన్స్ ఉంది?
PMEGP కింద ఇచ్చే రుణం మీ వ్యాపారం రకాన్ని బట్టి ఉంటుంది. సేవా రంగంలో గరిష్టంగా రూ.10 లక్షలు, తయారీ రంగంలో గరిష్టంగా రూ.25 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఈ రుణంపై 15% నుండి 35% వరకు సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుంది. అంటే, మీరు రూ.10 లక్షల రుణం తీసుకుంటే, దాంట్లో రూ.1.5 లక్షల నుండి రూ.3.5 లక్షల వరకు మాఫీ అవుతుంది.
❄ ఎక్కడ అప్లై చేయాలి?
ఈ పథకం కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయవచ్చు. PMEGP అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ అవ్వాలి. మీ వ్యాపారం ఏంటో వివరంగా ఒక బిజినెస్ ప్లాన్ తయారు చేసి సమర్పించాలి. ఆ తర్వాత బ్యాంక్ ద్వారా రుణం ఆమోదం పొందాలి. అవసరమైతే ట్రైనింగ్ కూడా అందిస్తారు.
దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు చాలా సులభం. ఆధార్ కార్డు, 8వ తరగతి పాస్ సర్టిఫికేట్, రేషన్ కార్డు లేదా నివాస ధృవీకరణ, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, బిజినెస్ ప్లాన్, తయారీ వస్తువులు లేదా యంత్రాల కోసం కొటేషన్ అవసరం ఉంటుంది. PMEGP కింద రుణాన్ని బ్యాంకులు ఇస్తాయి కానీ సబ్సిడీని ప్రభుత్వం నేరుగా బ్యాంక్‌కి జమ చేస్తుంది. రుణాన్ని తిరిగి చెల్లించడానికి 3 నుండి 7 సంవత్సరాల గడువు ఉంటుంది. మధ్యలో వ్యాపారం స్థిరపడేలా బ్యాంకులు కూడా మార్గదర్శకత ఇస్తాయి.
ఇతర రుణాల మాదిరిగా వడ్డీ భారం ఎక్కువగా ఉండదు. మీరు రుణం తీసుకున్నా దాంట్లో పెద్ద భాగం సబ్సిడీ రూపంలో పోతుంది. మహిళలు, నిరుద్యోగ యువత కోసం ఇది నిజంగా అద్భుతమైన అవకాశమని చెప్పాలి. గ్రామీణ యువతకి, చిన్న పరిశ్రమలపై కల ఉన్నవారికి ఈ పథకం గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు.
ఎంతో మంది యువత ఈ పథకాన్ని ఉపయోగించి విజయవంతమైన వ్యాపారస్తులయ్యారు. చిన్న స్కూటీ సర్వీస్ సెంటర్ పెట్టిన వారినుంచి చిన్న స్కూల్ స్టేషనరీ యూనిట్ మొదలెట్టిన వాళ్ల వరకు అందరూ ఈ రుణాన్ని బాగా ఉపయోగించుకున్నారు. ఉద్యోగం కోసం వెతికే రోజులు మానేసి, స్వంత వ్యాపారం ప్రారంభించే సమయం వచ్చింది. PMEGP రుణం మీ కోసం రెడీగా ఉంది. కేవలం ఒక బిజినెస్ ఐడియా ఉంటే చాలు, మిగతా సపోర్ట్ ప్రభుత్వమే అందిస్తోంది. ఈ పథకం నిజంగా భవిష్యత్‌ను మార్చే స్కీమ్ అని చెప్పొచ్చు.
ఈ పథకం గురించి పూర్తి సమాచారం కోసం PMEGP అధికారిక పోర్టల్ www.kviconline.gov.in/pmegp వెబ్‌సైట్ ను చూడవచ్చు లేదా మీ దగ్గరలోని బ్యాంక్ బ్రాంచ్, KVIC ఆఫీస్ ను సంప్రదించవచ్చు. మరెందుకు ఆలస్యం.. ఫస్ట్ అప్లై చేయండి!