Hasin Jahan on Shami : టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ గురించి ఈ మధ్య కాలంలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా షమీకి.. భార్య హసిన్ జహాన్ కి మధ్య గొడవలు కోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. కోల్ కతా హైకోర్టు కూడా షమీ తన భార్య, కూతురుకు భరణం చెల్లించాలని ఇటీవలే పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా మరో వార్త వైరల్ కావడం విశేషం. ఇన్ స్టా వేదికగా షమీ పై హసిన్ జహాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. మహ్మద్ షమీ కి వ్యక్తిత్వం లేదని.. తన క్రూరమైన మనస్తత్వంతో ఎంతగానో వేధించినట్టు ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. మమ్మల్నీ చంపడానికి క్రిమినల్స్ కి డబ్బులు ఇచ్చావని.. అవి మన కోసం ఖర్చు చేసి ఉంటే ఇప్పుడూ మన జీవితం ఎంతో బాగుండేది. ఎంతో గౌరవంగా జీవించే వాళ్లమని రాసుకొచ్చింది హాసిన్. ప్రస్తుతం ఆమె చేసిన ఈ ఆరోపణలు సంచలనంగా మారడం విశేషం.
Also Read : Sanju Samson: సంజూ శాంసన్ పై కాసుల వర్షం.. KCL లో 26.80 లక్షలు.. ఇక మనోడి పంట పడినట్లే..
షమీ పై భార్య సంచలన ఆరోపణలు..
ఇటీవలే 2018 నుంచి ఈ మేరకు ఇద్దరికీ నెలకు నాలుగు లక్షల చొప్పున చెల్లించాలని హైకోర్టు షమీని ఆదేశించింది. కాగా షమీపై అతడి భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అతడు స్త్రీలోలుడని, ఫిక్సింగ్కు కూడా పాల్పడ్డాడంటూ ఆరోపించిన హసీన్.. తనపై గృహహింసకు కూడా పాల్పడ్డాడంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో ఏడేళ్లుగా వీరు విడిగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో కుమార్తెను తన వద్దే పెట్టుకున్న హసీన్.. భరణం కింద తనకు రూ. 10 లక్షల చొప్పున చెల్లించేలా షమీని ఆదేశించాలంటూ కోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు రూ. 1.3 లక్షలు మాత్రమే చెల్లించేలా దిగువ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో హసీన్ జహాన్ హైకోర్టును ఆశ్రయించగా..ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
రూ.4లక్షలు భరణం..
ఈ సందర్భంగా జస్టిస్ ముఖర్జీ.. ” ఈ కేసులో పిటిషనర్ నెంబర్ వన్ అనగా భార్యకు నెలకు రూ. 1.50 లక్షలు.. అదే విధంగా ఆమె కూతురుకి రూ. 2.50 లక్షలు ఇవ్వడమే న్యాయం. వీరిద్దరి జీవనం సజావుగా సాగేందుకు ఈమాత్రం భర్త చెల్లించాల్సిందే” అని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. పిటిషనర్ భర్త ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నారన్న న్యాయస్థానం.. అతడి నుంచి విడిపోయిన భార్య మరో పెళ్లి చేసుకోలేదని.. కుమార్తెను కూడా ఆమె పెంచుతున్నందున ఈమాత్రం భరణం సబబేనని పేర్కొన్నట్లు బార్ అండ్ బెంచ్ తెలిపింది. తల్లిదండ్రులతో కలిసి ఉన్నపుడు కుమార్తె జీవనశైలి ఎలా ఉండేదో.. ఇప్పుడు కూడా అలాగే ఉండాలన్నా, ఆమె భవిష్యత్తుకు బాగుండటానికి నెలకు రూ. 2.50 లక్షల మొత్తం చెల్లించాల్సిందేనని షమీని ఆదేశించినట్లు పేర్కొంది. అంతేకాదు ఈ కేసును త్వరితగతిన పూర్తి చేయాలని దిగువ కోర్టును ఆదేశించినట్లు తెలిపింది. దీంతో సోషల్ మీడియాలో షమీ పై రకరకాల కామెంట్స్ వినిపించడం విశేషం.