Mitraaw Sharma: మిత్రా శర్మ (Mitraaw Sharma)త్వరలోనే వర్జిన్ బాయ్స్(Virgin Boys) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జూలై 11 వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మిత్రాశర్మ ఒక వికలాంగుడికి ఎలక్ట్రిక్ బైక్ (Electric Bike)కొనిస్తాను అంటూ ప్రామిస్ చేశారు.. ఇలా ఆమె గొప్ప మనసుపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా ఈమె ఎన్నో సహాయ సహకారాలను అందించారు.
మురళి నాయక్ కుటుంబానికి సహాయం..
ఇటీవల భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా అమరుడైన వీర జవాన్ మురళి నాయక్ (Murali Naik)మరణించడంతో నటి మిత్రా శర్మ ఆయన కుటుంబాన్ని కలిసి వారికి ఆర్థిక సహాయం అందించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ నుంచి ఎవరు ముందుకు రాకపోయినా మిత్ర శర్మ స్వయంగా మురళి నాయక్ ఇంటికి వెళ్లి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ఆర్థికంగా సహాయం చేశారు. ఇలా ఎప్పటికప్పుడు తన మంచి మనసును చాటుకుంటున్నారు. ఈ ముద్దుగుమ్మ అందరికీ సహాయం చేయడం వెనుక కారణమేంటి అంటూ తాజాగా ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ఈమె ఎంతో ఎమోషనల్ అవుతూ సమాధానం చెప్పారు.
అమ్మ ఎలా ఉంటుందో తెలీదు..
తాను పుట్టిన మొదటి రోజు నుంచి అమ్మ ఎలా ఉంటుందో నేను చూడలేదు, అలాగే నేను చిన్న వయసులో ఉన్నప్పుడే మా తండ్రి చనిపోయారు. మా నాన్న టీచర్ గా పనిచేసేవారు. ఆయన నాకు ఏదైనా ఇచ్చారు అంటే అది చదువు మాత్రమేనని మిత్రా శర్మ వెల్లడించారు. నాకంటూ నా జీవితంలో ఎవరూ లేరు. మన జీవితంలో ఎవరైనా ఉన్నారు అంటే వారికోసం ఏదైనా చేయాలి లేదా అర్హత ఉన్న వాళ్లకు చేయాలి. నాకంటూ ఎవరూ లేరు .. నాకంటూ కొంతమంది మనుషులను సంపాదించుకోవడం కోసమే ఇలాంటి సహాయాలు చేస్తున్నానని ఈమె ఈ సందర్భంగా బయటపెట్టారు. మనం ఎంతో కష్టపడి సంపాదించి పెట్టిన డబ్బులు చివరికి మనతో పాటు రావు. అందుకే మనల్ని గుర్తుంచుకునే మనుషులను సంపాదించుకోవాలని తెలిపారు.
మనుషులను సంపాదించుకోవాలి…
ఇలా మిత్రా శర్మ తాను చేసే సహాయం వెనుక ఉన్న కారణాన్ని తెలియజేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. మీరు అందరి మనసులు గెల్చుకున్నారు అంటూ ఈమె మాటలపై కామెంట్లు చేస్తున్నారు.. మీ మంచి మనసుతో అందరి చేత కన్నీళ్లు పెట్టించారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక వర్జిన్ బాయ్స్ సినిమా విషయానికి వస్తే గీతానంద్ మిత్రా శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జూలై 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్ వంటి తదితరులు నటిస్తున్నారు. దయానంద దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు రాజా దారపునేని నిర్మాతగా వ్యవహరించారు.
Also Read: కన్నప్ప సూపర్ హిట్.. ఆ మాత్రం సాయం చేయలేవా విష్ణు?