BigTV English

Mrunal thakur: రోడ్డు పై ఆ పని చేస్తూ దర్శనమిచ్చిన మృణాల్.. సింప్లిసిటీకి ఫిదా?

Mrunal thakur: రోడ్డు పై ఆ పని చేస్తూ దర్శనమిచ్చిన మృణాల్.. సింప్లిసిటీకి ఫిదా?

Mrunal Thakur:మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ అనంతరం వెండితెర సినిమా అవకాశాలను అందుకొంటూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులోకి సీతారామం (Sitaramam)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మృణాల్ ఈ సినిమాలో తన నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మదిలో సీతగా గుర్తుండిపోయింది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకుంటు బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా మృణాల్ ఠాకూర్ కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


పూల కొట్టు వద్ద మృణాల్…

ఈ వీడియోలో భాగంగా ఈమె రోడ్డు పక్కన పూలు కొట్టు (Flower Shop)దగ్గర ఆగి పూలను కొంటున్న దృశ్యాలను చూడవచ్చు. ఇలా స్టార్ హీరోయిన్ అయిండుకొని చాలా సింపుల్ గా రోడ్డు సైడ్ పూల కొట్టు దగ్గర పూలు కొనడం అంటే మామూలు విషయం కాదు. ఇలా ఈమె సింప్లిసిటీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇలా ఈమె పూలు కొట్టు దగ్గర మీడియా కంటికి చిక్కడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక ఈమె చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతారనే సంగతి తెలిసిందే. లగ్జరీ జీవితం గడపడం తనకు ఇష్టం లేదంటూ ఓ సందర్భంలో ఈమె తెలియజేశారు.


లగ్జరీ జీవితం ఇష్టం ఉండదు…

మనం జీవితంలో ఖరీదైన దుస్తులు వేసుకోకపోయినా పర్లేదు కానీ మనకంటూ ఒక సొంత ఇల్లు భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి నాలుగు సెంట్లు భూమి అయినా ఉండాలి అంటూ ఓ సందర్భంలో తెలిపారు. ఇప్పటివరకు ఈమె కొన్ని డ్రెస్సులలో అత్యంత ఖరీదైన డ్రస్సు ధర 2000 రూపాయలు మాత్రమే అని చెబుతూ అందరిని ఆశ్చర్యపరిచారు. తనకు ఏదైనా కార్యక్రమాలకు వెళ్లినప్పుడు డిజైనర్స్ ఇచ్చే దుస్తులను తాను వేసుకుంటాను తప్ప పర్సనల్ గా బట్టల కోసం ఎక్కువగా ఖర్చు చేయనని తెలిపారు.

?igsh=amJjMHYyaDJidTk1

ఇలా సింపుల్ గా జీవితాన్ని గడపడానికి తాను ఇష్టపడతానని మృణాల్ తెలిపారు. ఇక తాజాగా ఈమె రోడ్డు పక్కన పువ్వులు కొంటూ కనిపించడంతో ఈమె చెప్పింది నిజమేనని అభిమానులు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈమె సినిమాల విషయానికి వస్తే అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ (Dacoit)సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసింది. అదేవిధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందు రాబోతున్న రామాయణ(Ramayan) సినిమాలో హీరో యష్ రావణాసురుడి పాత్ర పోషించగా, ఈ సినిమాలో ఈమె ఆయన భార్య మండోదరి పాత్రలో కనిపించబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.. నిజానికి ఈ పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కొన్ని కారణాల వల్ల కాజల్ తప్పుకోవడంతో మృణాల్ ఈ సినిమాలో భాగమయ్యారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ విషయం గురించి అధికారక ప్రకటన మాత్రం తెలియటం లేదు. అలాగే అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా నటిస్తున్నారు.

Also read: Alia Bhatt: అలియా గొప్ప మనసు.. ఇంట్లో పని వారికి ఖరీదైన కానుకలు గ్రేట్ అంటూ!

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×