Anshula Kapoor: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దివంగత నటి శ్రీదేవి (Sridevi)గురించి ఎంత చెప్పినా తక్కువే. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. అయితే శ్రీదేవి అకాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఇకపోతే తాజాగా శ్రీదేవి కుమార్తెలు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా శ్రీదేవి వారసురాలు తన ప్రియుడుతో నిశ్చితార్థం జరుపుకొని ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు.
ఇంస్టాగ్రామ్ లో పరిచయం..
శ్రీదేవి వారసురాలు అంటే జాన్వీ కపూర్(Janhvi Kapoor), ఖుషి కపూర్ అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. బోణీ కపూర్(Bhoni Kapoor) మొదటి భార్య మోనా శౌరీ కపూర్. ఈమెకు ఇద్దరు సంతానం కాగా ఒకరు నటుడు అర్జున్ కపూర్(Arjun Kapoor) కాగా, కూతురు అన్షులా కపూర్(Anshula Kapor). ఇక వీరిద్దరూ జన్మించిన తర్వాత బోణీ కపూర్ ఈమెతో విడాకులు తీసుకొని విడిపోయిన అనంతరం శ్రీదేవిని పెళ్లి చేసుకున్నారు ఇక శ్రీదేవికి కూడా ఇద్దరు అమ్మాయిలు అనే విషయం మనకు తెలిసిందే. తాజాగా మొదటి భార్య కుమార్తె అన్షులా కపూర్ తన ప్రియుడితో నిశ్చితార్థం జరుపుకొని అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
అమ్మను మిస్ అవుతున్నాను…
ఇంస్టాగ్రామ్ లో అన్షులా కపూర్ కు రోహన్ తక్కర్ (Rohan Thakkar)అనే వ్యక్తి పరిచయమైనట్లు వెల్లడించారు. అయితే ఈ పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. మూడు సంవత్సరాల క్రితం రోహన్ తనకి ఎంతో ఇష్టమైన న్యూయార్క్ పార్క్ లో ప్రపోజ్ చేశారు. ఆ సమయంలో ప్రపంచం మొత్తం ఆగిపోయిన అనుభూతి కలిగింది అంటూ ఈమె తన ప్రేమ విషయాన్ని తెలియజేశారు. తాజాగా తన ప్రియుడుతో నిశ్చితార్థం(Engagment) జరుపుకోవడంతో అందుకు సంబంధించిన ఫోటోలను నటుడు అర్జున్ కపూర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. అర్జున్ కపూర్ వీరి నిశ్చితార్థం గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. “మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. లవ్ యు గయ్స్” అమ్మను చాలా మిస్ అవుతున్నాను అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు. అయితే 2012వ సంవత్సరంలో మోనా మరణించారు.
ఇక ఈమె నిశ్చితార్థం కావడంతో శ్రీదేవి ఇద్దరు కూతుర్లు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ… మా సిస్టర్ పెళ్లి చేసుకోబోతుందో అంటూ కామెంట్ల రూపంలో వారి ఆనందాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే వీరి తల్లులు వేరైనా ఈ నలుగురు ఏ వేడుకైనా ఒకే చోట ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఇక ప్రస్తుతం జాన్వీ కపూర్ మాత్రం కెరియర్ పరంగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె తెలుగులో రామ్ చరణ్ (Ram Charan)హీరోగా నటిస్తున్న పెద్ది (Peddi)అనే పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.
Also Read: ఆ బడా డైరెక్టర్ నన్ను బూతులు తిట్టాడు.. కమెడియన్ వేణు ఎమోషనల్ కామెంట్స్