Actor RK Sagar : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆడియన్స్ థియేటర్ కి రావడం మానేశారు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మానేశారు అని కొంతమంది ఒప్పుకోకపోయినా, ఆడియన్స్ రావడం తగ్గించేశారు అనేది మాత్రం వాస్తవం. కానీ సీరియల్స్ కి ఎప్పటికీ ఆదరణ ఉంటూనే ఉంటుంది. చాలామంది ఇంట్లో సీరియల్స్ చూస్తూ టీవీకి అతుక్కుపోయి ఉంటారు. ఇంకా వాస్తవానికి చెప్పాలంటే ఆ క్యారెక్టర్ తో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు.
అలా మొగలిరేకులు అనే సీరియల్ తో మంచి గుర్తింపును సాధించుకున్న నటుడు ఆర్కే సాగర్. సాగర్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఒకప్పుడు మొగలిరేకులు సీరియల్ అంటేనే చాలామంది క్యూరియాసిటీతో ఎదురు చూసేవాళ్ళు. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా ఆ సీరియల్ కోసం కళ్ళు కాయలు కాచేలా చూసేవాళ్ళు. తన కెరీర్ పీక్ లో ఉన్న టైంలో సినిమాలకే అవకాశం వచ్చింది సాగర్ కు. దశరథ్ దర్శకత్వంలో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఆఫర్ వచ్చింది.
సెకండ్ లీడ్ అని మోసం చేశారు
సాగర్ కి లేడీస్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకి ఆఫర్ వచ్చినప్పుడు తను హీరో తర్వాత సెకండ్ లీడ్ అంటూ సంప్రదించారు. నెలకి 24 రోజులు షూటింగ్ చేస్తున్న తరుణంలో సినిమా అవకాశం వచ్చిందని ఆ సినిమా కోసం దాదాపు 15 రోజులు కేటాయించారు సాగర్. అయితే మొదటి మూడు రోజులు కూడా తనపైన షూటింగ్ అసలు జరపలేదు. దానితో సాగర్ కి ఒక వైపు అనుమానం వచ్చింది. వెంటనే దర్శకుడు దశరథ్ దగ్గరకు వెళ్లి, ఏంటి సర్ అని అడిగితే. తెలుసు కదా సినిమా అంటే కొన్ని క్యారెక్టర్స్ మారుతూ ఉంటాయి అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి సాగర్ కి పరిస్థితి అర్థం అయిపోయింది.
దానివలన నా కెరియర్ పోయింది
నాకు కొన్ని రోజులు తర్వాత పరిస్థితి అర్థం అయినప్పుడు నా క్యారెక్టర్ ని ఈ సినిమా నుంచి తీసేయండి అని చెబుతూ వచ్చాను. ఆ సినిమాలో కూడా వేరే వాళ్ళని పెట్టుకోండి అని చెప్పాను. అయితే కొన్ని రోజులు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ లో నేనే ఉన్నాను. అప్పుడు నేను బలంగా అనుకున్నాను నేను ఎప్పటికైనా హీరోగా ఒక సినిమా చేయాలి అని. అంటూ చెప్పుకొచ్చారు సాగర్. ఇక ప్రస్తుతం సాగర్ చేస్తున్న 100 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సాగర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి మదర్ అంజనాదేవి కూడా శేఖర్కి అతిపెద్ద అభిమాని. ఈ విషయాన్ని ఒక తరుణంలో పవన్ కళ్యాణ్ కూడా తెలిపారు.
Also Read: Sreeleela: సరైన హిట్లు లేవు… రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన శ్రీ లీల.. షాక్ లో నిర్మాతలు?