E-Paper
Advertisement

కామ్రేడ్ కళ్యాణ్ షూటింగ్.. ప్రమాదానికి గురైన శ్రీకాంత్ అయ్యంగార్.. పునర్జన్మ అంటూ!

కామ్రేడ్ కళ్యాణ్ షూటింగ్.. ప్రమాదానికి గురైన శ్రీకాంత్ అయ్యంగార్.. పునర్జన్మ అంటూ!
Advertisement

Sreekanth Iyengar: శ్రీకాంత్ అయ్యంగార్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో కీలకపాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఈయన నటించిన కామ్రేడ్ కళ్యాణ్(Comrade Kalyan) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీ విష్ణు(Sree Vishnu) హీరోగా నటించిన ఈ సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయంతో దూసుకుపోతుంది.

బ్రిడ్జి మీద నుంచి పడబోయిన నటుడు…

ఈ నేపథ్యంలోనే నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ (Sreekanth Iyengar) ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో ఈయన ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఒక ఫారెస్ట్ లో ఎత్తయిన బ్రిడ్జిపై షూటింగ్ జరుగుతుంది. ఈ సన్నివేశంలో భాగంగా శ్రీకాంత్ అయ్యంగార్ పై చేయి చేసుకుంటే ఆయన కింద పడిపోవాలి కానీ అనుకోకుండా ఆయన బ్రిడ్జ్ మీద నుంచి కిందపడబోయారు. అయితే వెంటనే స్పందించిన చిత్ర బృందం ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడారు.

కాలు స్లిప్ అవ్వడంతో…

Advertisement

ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోని శ్రీకాంత్ అయ్యంగర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. కామ్రేడ్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ఒక ఫారెస్ట్ బ్రిడ్జి పైన షూట్ చేస్తున్నారు ఆ సమయంలో శ్రీ విష్ణు, కోన వెంకట్, డైరెక్టర్ జానకి రామ్ అందరూ అక్కడే ఉన్నారు అయితే ఆ సన్నివేశం షూట్ చేసే సమయంలో సడన్ గా బ్లాంక్ అయిపోయిందా, కాలు స్లిప్ అయ్యిందో తెలియదు కానీ బ్రిడ్జ్ మీద నుంచి పడబోయానని శ్రీకాంత్ తెలిపారు. అయితే వెంటనే అక్కడున్న వారందరూ తేరుకొని నన్ను కింద పడకుండా పట్టుకున్నారని, తద్వారా తాను సేఫ్ అయ్యానని తెలిపారు.

?cplk=MWFrN25wOWR6dG5vbw==

Advertisement

ఇలా ఈ ప్రమాదం నుంచి తాను బయటపడటం ఒక పునర్జన్మ అనుకోవాలి. ఒక సినిమా కోసం ఎన్ని కష్టాలు పడాలి, రిస్కులు చేయాలి కొన్నిసార్లు ప్రాణాలను పణంగా పెట్టాలి. ఈ సినిమా కోసం ఎంతో ఎఫెక్ట్ పెట్టిన మాకు ప్రేక్షకు దేవుళ్ళు చాలా మంచి ఆదరణ చూపించారని అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ శ్రీకాంత్ అయ్యంగర్ ఈ సందర్భంగా కామ్రేడ్ సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదం గురించి షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీ విష్ణు మహిమ నంబియార్ జంటగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Also Read : పవన్ పని తీరుపై ప్రశంసలు కురిపించిన చిరు… నెం.1 స్థానంలో ఏపీ!

Related News

రామ్ చరణ్ RC 17.. రంగంలోకి అనిరుద్? హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ!

చిరు ఇండస్ట్రీకి మొగుడవుతాడని చెప్పిన ఆ హీరో ఎవరో తెలుసా?

పవన్ పని తీరుపై ప్రశంసలు కురిపించిన చిరు… నెం.1 స్థానంలో ఏపీ!

యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సల్మాన్ ఖాన్.. వారి కోసమే ప్రత్యేకంగా?

సాయి పల్లవిని చంపేయాలనుకున్నా.. అది తట్టుకోలేకపోయా: అనుపమ షాకింగ్ కామెంట్స్

‘నవరాత్రి స్పెషల్’.. కళ్ళతోనే కూచిపూడి ఆడిన స్టార్ హీరోయిన్!

రవితేజ కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. ఊహించని స్టార్ కాస్ట్!

Big Stories

Advertisement
×