TDP Elections: ప్రయోగాలకు పెట్టింది పేరు తెలుగుదేశం మొదటి నుంచి ప్రయోగాలు చేసి సక్సెస్ కావడం ఆ పార్టీకే దక్కింది. పార్టీ ఆరంభం నుంచి టీడీపీది ఇదే ధోరణి. పార్టీ పెట్టిన కొత్తలో టీచర్లు, చిన్నచిన్న ఉద్యోగులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి MLA, MPలను చేశారు సీనియర్ ఎన్టీఆర్. నాడు సక్సెస్ అయిన ఫార్ములానే టీడీపీ ఇంకా కొనసాగిస్తూ ఉంది. అయితే సాధారణ ఎన్నికల్లో ఈ తరహా ప్రయోగాలు తగ్గించినా… స్థానిక సంస్థల్లో మాత్రం ఎప్పటికప్పుడు కొత్త ముఖాలతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.
ఏపీలో ఎవరిద్దరు కలిసినా స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఎక్కువగా డిస్కర్షన్ ఉంటుంది. లోకల్ బాడీ ఎన్నికలు త్వరలో జరగనుండటంతో స్థానిక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ అధికారంలో ఉండటంతో టికెట్ల కేటాయింపుల విషయంలో తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రయోగాలు చేయడంలో దిట్ట అయిన టీడీపీ మరోసారి కూడా ప్రజల్లో మంచి పేరుండి రాజకీయాలకు దూరంగా ఉన్నవారికి అవకాశం కల్పిస్తారా అన్న చర్చ జరుగుతోంది. అభ్యర్థుల ఎంపికలో విజయావకాశాలు ఉన్నవారి వైపే చంద్రబాబు మొగ్గు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also read: బిగ్ బాస్ ను గౌరవించమని చెప్పిన కౌశల్.. వేలల్లో తగ్గిపోయిన ఫాలోవర్స్!
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత టీడీపీకి చెందిన అమాత్యులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. తటస్థులకు టికెట్లు ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని కొందరు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఏళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తూ… సరైన గుర్తింపు పొందని వారికి అవకాశం కల్పించాలని మరికొందరు అభిప్రాయపడినట్లు సమాచారం. గతంలో విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల్లోని ప్రముఖులకు TDP అవకాశాలు కల్పించింది. రాజకీయ నేపథ్యం లేని ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించిన NTRను మరోసారు అనుసరించే అవకాశాలు లేకపోలేదు.
విశాఖతో పాటు ఇతర నగరాల్లోనూ ప్రజాదరణ ఉన్న కొత్త ముఖాలను బరిలోకి దించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. జడ్పీ, మున్సిపల్ పదవుల్లోనూ తటస్థులకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న ప్రముఖులు… నాటి NTR ఫార్ములాను టీడీపీ అధినాయకత్వం ముందు పెడుతున్నారట. ఇప్పటి నుంచే టికెట్ల కోసం చోటా మోటా లీడర్లతో లాబీయింగ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో టీడీపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తి నెలకొంది. సీనియర్లా.. గెలపు గుర్రాలా… లేక ప్రయోగాలకు మొగ్గు చూపుతుందా అన్నది వేచి చూడాలి.
Also read: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం!