Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజాగా రాజమండ్రిలోని కపిలేశ్వరంలో పర్యటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఈయన జిఎస్ ఎల్ సూర్య ట్రస్ట్(GSL Suriya Trust) గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి గురించి అలాగే తన తమ్ముడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పరిపాలన విధానం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడిన చిరంజీవి అనంతరం ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి కూడా మాట్లాడారు.
తాను ఏపీకి వచ్చి చాలా రోజులు అయిందని తెలిపారు. అయితే ఇక్కడ పరిపాలన ఎలా ఉంది అంటే మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నారంటూ చిరంజీవి తెలిపారు. ఒకప్పుడు మన దేశంలో పంచాయతీరాజ్ శాఖ విభాగంలో ఏపీ 23వ స్థానంలో ఉంది కానీ పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుందని చిరంజీవి తెలియచేశారు. ఏపీలో రోడ్లు కూడా అద్భుతంగా ఉన్నాయని, పవన్ కళ్యాణ్ ఇలాగే ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి ఈ సందర్భంగా పవన్ పని తీరుపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు కూడా చేపట్టారు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున రోడ్లు సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ పరిపాలనపై చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇలా చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి ఆయన పరిపాలన విధానం గురించి చేసిన వ్యాఖ్యలపట్ల సోషల్ మీడియా వేదికగా అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన డైరెక్టర్ బాబి(Bobby) దర్శకత్వంలో కాకా(Kaaka) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా ఈ సినిమాతో పాటు చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి అయినప్పటికీ పలు కారణాలవల్ల విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది.
Also Read: యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సల్మాన్ ఖాన్.. వారి కోసమే ప్రత్యేకంగా?