E-Paper
Advertisement

MSVPG Pre release: అప్పుడు తమ్ముడు.. ఇప్పుడు అన్నయ్య.. సౌండ్ అదిరిపోవాలంతే!

MSVPG Pre release: అప్పుడు తమ్ముడు.. ఇప్పుడు అన్నయ్య.. సౌండ్ అదిరిపోవాలంతే!

MSVPG Pre release: చిరంజీవి నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు(MSVPG). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవితో పాటు ఇతర చిత్ర బృందం కూడా పాల్గొన్నారు. ఇక ఈ సినిమాలో క్యామియో పాత్రలో నటించిన నటుడు వెంకటేష్ కూడా హాజరయ్యారు.

అన్నయ్యతో నటించాను…

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటేష్ మాట్లాడుతూ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశారు. వెంకటేష్ స్పీచ్ తో మెగా విక్టరీ అభిమానులలో సరికొత్త జోష్ నింపారు. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని తెలియజేశారు. తను ఇప్పటివరకు నాకంటే చిన్న వాళ్ళైనా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలా తమ్ముళ్లతో నటించాను కానీ మొదటిసారి అన్నయ్యతో నటిస్తున్నానని ఈసారి సౌండ్ అదిరిపోవాలి అంటూ వెంకటేష్ మాట్లాడారు.

వెంకీ గౌడ పాత్రలో వెంకీ..

ఇక ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి ఈ సందర్భంగా ఈయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇక నయనతార గురించి కూడా మాట్లాడుతూ నయనతార చాలా అద్భుతంగా నటించిందని, మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన తులసి, లక్ష్మి సూపర్ హిట్ సినిమాలుగా నిలిచిపోయాయి. మన శంకర ప్రసాద్ గారు సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటూ వెంకటేష్ ఈ సందర్భంగా అభిమానులలో జోష్ నింపుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో వెంకటేష్ వెంకి గౌడ పాత్రలో కనిపించబోతున్నారని తాజాగా అనిల్ రావిపూడి తెలియజేశారు. చిరంజీవి వెంకటేష్ ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా కనిపించబోతున్నారు. దాదాపు వెంకటేష్ పాత్ర 25 నిమిషాల పాటు ఉండబోతున్న సంగతి తెలిసిందే.

రా ఏజెంట్ గా చిరు..

ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా చిరంజీవి నయనతార జంటగా కనిపించబోతున్నారు ఇందులో రా ఏజెంట్ పాత్రలో చిరంజీవి కనిపించనున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా సినిమా పట్ల కూడా మంచి అంచనాలను పెంచేశాయి. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా హుక్ స్టెప్స్ అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు ఇక ఈ పాటకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి. మరి ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Also Read: MSVPG Pre Release: ‘వెంకీ గౌడ’ పాత్రలో వెంకటేష్… స్టోరీ లీక్ చేసిన అనిల్ రావిపూడి

Related News

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

Big Stories

×