WhatsApp New Update: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడే వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంటుంది. డిజైన్ విషయంలో ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు కొన్ని తేడాలు ఉంటాయి. అయితే, ఐఫోన్‌లో చూసే కొన్ని అద్భుతమైన ఫీచర్లను ఆండ్రాయిడ్‌లో కూడా తీసుకురావడానికి కంపెనీలు ట్రై చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వాట్సప్ కూడా ఇప్పుడు అదే పని చేస్తోంది. త్వరలోనే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒక సరికొత్త నావిగేషన్ బార్ రాబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఐఫోన్‌లో చూసే విధంగా స్క్రీన్ కింద వైపు తేలుతున్నట్లు కనిపించే ఫ్లోటింగ్ నావిగేషన్ బార్‌ను ఆండ్రాయిడ్‌లోకి తేవడానికి వాట్సప్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకు స్క్రీన్‌కు అతుక్కుపోయి ఉండే నావిగేషన్ ఆప్షన్లు, ఇప్పుడు గుండ్రని అంచులతో ఒక ప్రత్యేకమైన ఐలాండ్‌లా కనిపిస్తాయి. ఇది డార్క్, లైట్ థీమ్స్ రెంటికీ సెట్ అవుతుంది.
ఇటీవలే ఐఫోన్ యూజర్ల కోసం వాట్సప్ ఒక కొత్త డిజైన్‌ను పరిచయం చేసింది. అదే స్పూర్తితో ఇప్పుడు ఆండ్రాయిడ్‌లో కూడా ఈ మార్పు తెస్తున్నారు. అయితే ఐఫోన్‌లో ఉన్నట్లు ట్రాన్స్‌పరెంట్ లుక్ ఇక్కడ ఉండకపోవచ్చు. ఎందుకంటే.. ఆండ్రాయిడ్, యాపిల్ కంపెనీల డిజైన్ రూల్స్ వేర్వేరుగా ఉంటాయి. అందుకే మన ఆండ్రాయిడ్ స్టైల్‌కి తగ్గట్లే దీన్ని తీర్చిదిద్దుతున్నారు.
Also Read: సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!
కేవలం ఈ ఫ్లోటింగ్ బార్ మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో ఆండ్రాయిడ్ వాట్సప్ లుక్ మొత్తం మారబోతోంది. చాలా కాలంగా యూజర్లు కోరుకుంటున్న కొత్తదనాన్ని అందించేందుకు మెటా రెడీ అవుతోంది. ఇకపై రాబోయే అప్‌డేట్లలో యాప్ ఇంటర్‌ఫేస్ మరింత కలర్‌ఫుల్‌గా, వాడటానికి చాలా ఈజీగా మారే అవకాశం ఉంది.
ఈ కొత్త డిజైన్ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం కేవలం డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంది. సాధారణ బీటా యూజర్లకు కూడా ఇది ఇంకా విడుదల కాలేదు. ముందుగా చిన్న స్థాయిలో బీటా యూజర్లతో టెస్టింగ్ పూర్తి చేశాకే.. అందరికీ అందుబాటులోకి తెస్తారు. దీనికి కాస్త సమయం పట్టేలా ఉంది.
భారత్‌లోని యూజర్లకు కూడా ఈ కొత్త అప్‌డేట్ త్వరలోనే రానుంది. ప్లే స్టోర్ నుంచి యాప్‌ను రెగ్యులర్‌గా అప్‌డేట్ చేసుకుంటే సరిపోతుంది. యాపిల్ ఐఫోన్ తరహా ప్రీమియం లుక్‌ని మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. వాట్సప్ నుంచి ఎలాంటి కొత్త అప్‌డేట్ వచ్చినా వెంటనే ఇన్స్టాల్ చేసుకోవడం మర్చిపోకండి.
Also Read: జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!