E-Paper
Advertisement

మంత్రి ఆదేశాలు నీరుగారుతున్న కాంట్రాక్టర్.. రూ.3.50 కోట్లు మట్టిపాలేనా..!

మంత్రి ఆదేశాలు నీరుగారుతున్న కాంట్రాక్టర్.. రూ.3.50 కోట్లు మట్టిపాలేనా..!
Advertisement

Bridge Construction: స్వేచ్చ బ్యూరో: మఖ్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పరితపిస్తుంటే కాంట్రాక్టర్లు మాత్రం నాసిరకం మెటీరియల్‌ ఉపయోగించి బ్రిడ్జిలను నిర్మాణం చేసి ఒక్కరోజు కూడా వాటర్ క్యూరింగ్ లేకుండా బ్రిడ్జ్ పై మట్టి వేస్తూ రోడ్డు పనులను ప్రారంభించి కాంట్రాక్టర్ మంత్రి ఆదేశాలు,ఒప్పందాలను నీరుగార్చడం జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

మంత్రి వాకిటి శ్రీహరి..

నారాయణపేట జిల్లా మఖ్తల్ మండలం కాట్రేవుపల్లి,భూత్పూర్ గ్రామాల రాకపోకలు కొనసాగించే మట్టి రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను రెండు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకువెళ్లగా కాట్రేవుపల్లి,భూత్పూర్ గ్రామాలను కలుపుతూ గద్వాల రోడ్డుకు కనెక్టివ్ గా చేస్తూ రాకపోకలను సులభతరం చేసేందుకు రెండు గ్రామాల మధ్య గద్వాల రోడ్డు సమీపంలో ఉన్న శ్రీ బద్దిపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి భూత్పూర్ మీదుగా కాట్రేవుపల్లి వరకు బీడీ రోడ్డుతో పాటు మూడు బ్రిడ్జిల నిర్మాణానికి మూడు కోట్ల 50 లక్షల రూపాయలను మంత్రి వాకిటి శ్రీహరి మంజూరు చేయడం జరిగింది.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం..

Advertisement

అయితే ఈనెల 1న మంత్రి ఆదేశాల మేరకు డి.ఈ ఉపేందర్ రెడ్డి, ఏఈలు,మంత్రి సోదరుడు వాకిటి శేషగిరి, గ్రామ సర్పంచులతో కలిసి భూమి పూజ చేసి రోడ్డు బ్రిడ్జిల నిర్మాణం పనులను ప్రారంభించడం జరిగింది. అయితే కాట్రేవుపల్లి,భూత్పూర్ గ్రామాల మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు నిర్మాణం చేపడుతున్న రోడ్డు బ్రిడ్జిల నిర్మాణం పనులలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కాంట్రాక్ట్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించినప్పటికీ బ్రిడ్జి నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నాసిరకంగా బ్రిడ్జి నిర్మాణం పనులు కొనసాగిస్తూ మంత్రి ఆదేశాలు నీరుకారిస్తున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాట్రేపల్లి భూత్పూర్ మధ్య జరుగుతున్న బీటీ రోడ్డు, బ్రిడ్జిల నిర్మాణ పనులను పర్యవేక్షించే సంబంధిత అధికారులు చుట్టపు చూపుగా వచ్చి పోతుండటంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు జరుగుతుండటంతో బ్రిడ్జి నిర్మాణం పట్ల ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Aklso Read: ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి..హోస్ట్ గా కొత్త బాధ్యతలు?

వాటర్ క్యూరింగ్..

Advertisement

గత కొన్నేళ్లుగా రోడ్డు సౌకర్యం లేక తాము పడుతున్న ఇబ్బందులను మంత్రి వాకిటి శ్రీహరి గుర్తించి గ్రామాల అభివృద్ధిలో భాగంగా తమ గ్రామాల మధ్య రోడ్డు సౌకర్యాన్ని సులభతరం చేసేందుకు బీటీ రోడ్డు మంజూరు చేస్తే కాంట్రాక్టర్లు మాత్రం ఏమాత్రం బాధ్యత లేకుండా బ్రిడ్జి నిర్మాణం పనులు చేస్తూ నిర్మాణం చేసిన బ్రిడ్జికి ఒక్కరోజు కూడా వాటర్ క్యూరింగ్ చేయకుండా వెంటనే బీటీ రోడ్డు నిర్మాణం పనుల్లో భాగంగా బ్రిడ్జిపై మట్టిని వేసి పనులను ప్రారంభించడం ఏంటని ప్రజలు ఆరోపిస్తున్నారు.

భారీ వాహనాల రాకపోకలు..

బ్రిడ్జిలకు సరైన వాటర్ క్యూరింగ్ లేకపోతే ఎండ వేడికి కాంక్రీట్‌లోని తేమ వేగంగా ఆవిరైపోవడం వల్ల అంతర్గతంగా మరియు ఉపరితలంపై పగుళ్లు ఏర్పడి అతి తక్కువ కాలంలో వంతెనలు భారీ వాహనాల రాకపోకలను, వరద ఒత్తిడిని తట్టుకోలేక రోడ్డు త్వరగా పాడైపోయే అవకాశం ఉందన్నారు. ఏది ఏమైనా రోడ్డు మరియు బ్రిడ్జిల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణం పనులు కొనసాగించాలన్న మంత్రి ఆదేశాలు ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు రోడ్డు బ్రిడ్జి పనులను పరివేక్షిస్తూ పనులలో కాంట్రాక్టర్ నాణ్యతను పాటించేలా సరైన సమయానికి వాటర్ క్యూరింగ్ చేస్తూ బ్రిడ్జిల నిర్మాణం పనులను కొనసాగించేలా తగు చర్యలు తీసుకోవాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Also read: ఎంబీబీఎస్ విద్యార్థులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. లోకల్ పిటీషన్ కొట్టివేత!

Tags

Related News

వరుస ఓటములకు బ్రేక్ పడేనా? ఎమ్మెల్సీ పోరులో కేటీఆర్ సంచలన వ్యూహం!

ఎంబీబీఎస్ విద్యార్థులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. లోకల్ పిటీషన్ కొట్టివేత!

420 హామీలతో మోసం.. పీఎస్ లలో పెట్టాల్సింది రేవంత్ ఫొటోనే!- కేటీఆర్

కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లకు రేవంత్ షాక్.. గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటల్లో ఏం జరగబోతోంది?

తెలంగాణ టూరిజంలో సరికొత్త విప్లవం.. ఇక ఇంట్లో కూర్చునే హోమ్‌స్టే రిజిస్ట్రేషన్!

సీబీఐ సంచలనం.. ఆపరేషన్ చక్ర తో నకిలీ సుప్రీంకోర్టు వెబ్‌సైట్ గుట్టు రట్టు!

దిశ ఘటన జరిగిన చోటే మళ్లీ దారుణం.. శంషాబాద్‌లో మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగికదాడి యత్నం!

Big Stories

Advertisement
×