Railway Bridges: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా రైల్వే క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. రైలు వెళ్లేటప్పుడు గేట్ల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, ప్రమాదాలకు తావులేకుండా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ,రైల్వే అండర్ బ్రిడ్జ్) ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది. కేంద్ర రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇటీవల జరిగిన కామన్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండి, రైల్వే గేట్ల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న 203 కీలక ప్రాంతాలను అధికారులు గుర్తించారు.వీటిలో అత్యధికం పట్టణ ప్రాంతాలు, జాతీయ రహదారులను అనుసంధానించే మార్గాల్లో ఉన్నాయి. రైళ్ల రాకపోకలు పెరగడం వల్ల గేట్లు పదేపదే పడటం, దీనివల్ల అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలు నిలిచిపోవడం ప్రధాన సమస్యగా మారింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆర్ వోబీ, ఆర్ యూబీలను నిర్మించాలని సర్కార్ డిసైడ్ చేసింది. ఇందుకు కామన్ మీటింగ్ లో కేంద్రం, రాష్ట్ర అధికారుల మధ్య సమన్వయం, పరస్పర అంగీకారం కుదుర్చుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వందల రైల్వే క్రాసింగ్ లను గుర్తించగా, ఇందులో సుమారు వందకు పైగా లైన్ క్రాసింగ్ లకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ వోసీలు జారీ చేసింది. అంతేగాక గతంలో భూసేకరణ, నిధుల వాటా విషయంలో ఉన్న జాప్యాన్ని తొలగిస్తూ, తాజా కామన్ మీటింగ్‌లో సీఎస్ అన్ని శాఖలను సమన్వయం చేశారు. రైల్వే శాఖ , రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ సంయుక్తంగా ఈ పనులను చేపట్టనున్నాయి. ఆర్ వోబీలను రైల్వే ట్రాక్ పై నుంచి నిర్మిస్తుండగా, రైల్వే ట్రాక్ కింద నుంచి ఆర్ యూబీలను ఏర్పాటు చేస్తారు. ట్రైన్స్, వెహికల్స్ ప్రయాణంలో ఎలాంటి స్టాఫ్ లు లేకుండా సులువుగా క్రాసింగ్ అయ్యేందుకు ఇలాంటి బ్రిడ్జిలు నిర్మిస్తారు. ఇందుకు పర్యావరణం, ఇతర అనుమతులన్నీ వేగంగా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. త్వరలో మరో కామన్ మీటింగ్ నిర్వహించేందుకు కేంద్ర రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు.
Also Read: జీవన్‌రెడ్డి గాలి తీసేశారు..! ఓ పక్క రేవంత్.. మరోపక్క కవిత!
ఈ బ్రిడ్జిలు రైల్వే గేట్ల వద్ద అజాగ్రత్త వల్ల జరిగే ప్రాణాంతక ప్రమాదాలను వంద శాతం నివారించవచ్చని అధికారులు చెప్తున్నారు. అంతేగాక గేటు పడిన ప్రతిసారీ సగటున 15 నుండి 20 నిమిషాల సమయం వృధా అవుతుంది.కానీ ఆర్ యూబీ, ఆర్ వోబీల వల్ల నిరంతరాయ ప్రయాణం సాధ్యమవుతుంది.వేల సంఖ్యలో వాహనాలు గేటు వద్ద ఇంజిన్ ఆన్ చేసి ఆగడం వల్ల జరిగే ఇంధన వృధా తగ్గడంతో పాటు, తద్వారా కాలుష్యం కూడా తగ్గుతుంది, వస్తు రవాణా వేగంగా జరగడం వల్ల వ్యాపార, వాణిజ్య రంగాలు పుంజుకుంటాయి. రైల్వే ట్రాక్‌లపై అడ్డంకులు లేకపోవడం వల్ల రైళ్లు కూడా గరిష్ట వేగంతో ప్రయాణించే అవకాశం ఉంటుంది. భారీ వాహనాలు కూడా ఈ బ్రిడ్జిల నుంచి సులువుగా తమ గమ్యానికి వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది.
Also Read: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్, జూన్ 1 నాటికి ప్రక్రియ పూర్తి!