OTT Movie : బ్లాక్ మ్యాజిక్, ఆధ్యాత్మిక థీమ్‌లతో ఒక ఇండోనేషియన్ హారర్ సినిమా ప్రేక్షకులచేత ప్రశంసలు అందుకుంటోంది. ఇది ఇండోనేషియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హారర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దీని ఫోక్ హారర్, సస్పెన్స్ తో అభిమానులకి స్పైన్ చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తోంది. ఈ సినిమా విడుదలైన మొదటిరోజే 187,000 వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
కథలోకి వెళ్తే
శ్రీ అనే యువతి ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటుంది. తన తండ్రి చికిత్స కోసం అట్మోజో కుటుంబం నుండి భారీ మొత్తంతో ఉద్యోగ ఆఫర్‌ను అందుకుంటుంది. ఎందుకంటే ఆమె ఫ్రైడే క్లివాన్ రోజున జన్మించింది. ఆరోజు బ్లాక్ మ్యాజిక్ కు ప్రత్యేకమైనది. ఎర్నా, దిని అనే యువతులు కలిసి, ఆమెను అడవిలోని ఒక గుడిసెకు తీసుకెళ్తారు. అక్కడ వీళ్ళు కర్సా అట్మోజో మనవరాలు డెలాను సంరక్షించాల్సి ఉంటుంది. ఆమె సెవు డినో బ్లాక్ మ్యాజిక్ శాపంతో స్పృహలో లేకుండా ఉంటుంది. ఈ శాపంతో 1000 రోజులు స్పృహ లేకుండా ఉంటారు. ఇప్పుడు శ్రీ, డెలాను పవిత్ర జలంతో స్నానం చేయించాలి, ఆడియో క్యాసెట్‌లో రికార్డ్ చేయబడిన కఠినమైన ఆచార నియమాలను పాటించాలి. కర్సా శ్రీ జుట్టు తీసుకుని, ఆమె రక్తంతో కలిపి, శ్రీ మణికట్టుపై ఒక గుర్తును పెడుతుంది. ఇది ఆమెను ఈ శాపంతో ముడిపడేలా చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఆచరించే ఆచారం విఫలమైతే, 1000వ రోజు నాటికి శ్రీ, ఎర్నా, దిని, డెలా కూడా మరణిస్తారు.
డెలా శరీరంలోని దెయ్యం, ఆమెను 1000 రోజుల పాటు కబళిస్తుంది. ఆమెను రక్షించడానికి శ్రీ, ఎర్నా, దిని 1000వ రోజున “అప్‌సైడ్ డౌన్” (డార్క్ మ్యాజికల్ వరల్డ్)లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఎర్నా, దిని భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక మాయా శక్తి వారిని గుడిసెలో బంధిస్తుంది. శ్రీని కూడా భయంకరమైన కలలు, శబ్దాలు భయపెడతాయి. ఇక శ్రీ ధైర్యంగా అప్‌సైడ్ డౌన్‌లోకి ప్రవేశించి, డెలాను రక్షిస్తుంది. కానీ ఎర్నా, దిని చనిపోతారు. క్లైమాక్స్ ట్విస్ట్ ఒక భయంకరమైన మలుపు తీసుకుంటుంది. ఇంతకీ డెలా శరీరంలో ఉన్న దెయ్యం ఎవరు ? ఎందుకు శాపానికి గురైంది ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ ఇండోనేషియన్ హారర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
‘సెవు డినో’ (Sewu dino) 2023లో విడుదలైన ఇండోనేషియన్ హారర్ చిత్రం. కిమో స్టాంబోయెల్ దర్శకత్వంలో, సింపుల్‌మ్యాన్ అనే వైరల్ ట్విట్టర్ థ్రెడ్ ఆధారంగా రూపొందింది. ఇందులో మిఖా తంబయాంగ్ (శ్రీ), రియో దేవాంటో (సుగిక్), గివినా లుకితా (ఎర్నా), అగ్లా అర్టలిడియా (దిని), గిసెల్మా ఫిర్మన్‌స్యాహ్ (డెలా), కరీనా సువంది (కర్సా అట్మోజో) నటించారు. 2023 ఏప్రిల్ 19న ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, బ్రూనైలలో విడుదలైంది. 121 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 6.0/10 రేటింగ్ ను పొందింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలో అందుబాటులో ఉంది.
Read Also : వీడియో కాల్ లో అన్నీ విప్పి పాడు పనులు… ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఆమె వలలో… అబ్బాయిలు మస్ట్ వాచ్