Rama Naidu Film School: సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఫిల్మ్ స్కూల్స్ మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రామానాయుడు ఫిలిం స్కూల్(Rama Naidu Film School) ద్వారా ఎంతో మంది వివిధ రంగాలలో శిక్షణ తీసుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే తాజాగా రామా నాయుడు ఫిలిం స్కూల్ లో దారుణ పరిస్థితిలో నెలకొన్నాయి. ఈ ఫిలిమ్స్ స్కూల్లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న మహిళ పట్ల ఓ విద్యార్థి వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఫిలిమ్ స్కూల్లో గత రెండు సంవత్సరాలుగా ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఓ మహిళ పట్ల భరత్ రెడ్డి(Bharath Reddy) అనే విద్యార్థి వేధింపులకు పాల్పడ్డారు.
డైరెక్షన్ కోర్సులో…
సత్య సాయి జిల్లా పెనుగొండ మండలం సోమందేపల్లికి చెందిన భరత్ రెడ్డి గత ఏడాది ఆగస్టు నెలలో ఈ ఫిలిం స్కూల్లో డైరెక్షన్ కోర్స్(Direction Course) లో చేరారు. ఇలా ఈ కోర్సులో చేరిన కొద్ది రోజులకే భరత్ రెడ్డి మహిళా ప్రొఫెసర్ పట్ల వేధింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా తనని ప్రేమిస్తున్నట్టు కూడా వెల్లడించడంతో ఆమె భరత్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లడంతో భరత్ రెడ్డిని సస్పెన్ చేస్తూ ఫిల్మ్ స్కూల్ నుంచి బయటకు పంపించారు. ఫిలిమ్స్ స్కూల్ నుంచి బయటకు వచ్చిన భరత్ రెడ్డి మహిళా ప్రొఫెసర్ పట్ల మరింత వేధింపులకు గురి చేశారు.
ఇంస్టాగ్రామ్ లో వేధింపులు…
ఆమె ఎక్కడికి వెళ్లినా తనని అనుసరించడం, ఆమె ఇంస్టాగ్రామ్ ను ఫాలో అవుతూ ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. మహిళా ప్రొఫెసర్ ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తుందనే ?విషయాలను తెలుసుకుంటూ అక్కడికి వెళ్లి తనని ఇబ్బంది పెట్టేవారు. ఆగస్టు నెల 22వ తేదీ మహిళా ప్రొఫెసర్ మూన్ షైన్ పబ్(Moon Shine Pub) కు వెళ్లగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న భరత్ అక్కడికి కూడా వెళ్లడంతో సదురు మహిళ ప్రొఫెసర్ భరత్ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇలా పోలీసులకు భరత్ రెడ్డి గురించి ఫిర్యాదు చేయడంతో ఫిలింనగర్ పోలీసులు(Film Nagar Police) భరత్ రెడ్డి పై కేసు నమోదు చేసి ఆయనని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.
పోలీస్ రిమాండ్…
ఇలా పలు సందర్భాలలో మహిళా ప్రొఫెసర్ పట్ల భరత్ రెడ్డి బేధింపులకు గురి చేస్తున్న నేపథ్యంలో ఆమె హెచ్చరించిన భరత్ రెడ్డి మాత్రం తన చర్యలను మానుకొని నేపథ్యంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. భరత్ రెడ్డి ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ రిమాండ్ లో ఉన్నారు. అయితే ఆ మహిళా ప్రొఫెసర్ ఎవరు ఏంటి అనే వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు ఆ విషయాలన్నింటిని కూడా రహస్యంగా ఉంచారు.
Also Read: Kannappa Movie OTT : ఎట్టకేలకు ఓటీటీ విడుదలకు సిద్ధమైన కన్నప్ప… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?