Virat Kohli On Team India Raghu : టీమిండియా క్రికెటర్లు ఫాస్ట్ బౌలింగ్ లో ఒకప్పుడు చాలా ఇబ్బంది పడేవారని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించారు. టీమిండియాలోకి రఘు వచ్చిన తర్వాత ఆ సమస్య పూర్తిగా తగ్గిపోయిందని వివరించారు. అతడి కారణంగా ఫాస్ట్ బౌలర్లను అవలీల ఎదుర్కొంటున్నామని స్పష్టం చేశారు. సైడ్ ఆర్మ్ టూల్ తో రఘు ఒక్కో బంతిని 150 స్పీడ్ తో సంధిస్తాడని కొనియాడారు. ప్రాక్టీస్ సమయంలో 150కి పైగా స్పీడ్ తో వచ్చే బంతులను తనకు వేసేవాడని.. దానివల్ల తన బ్యాటింగ్ పర్ఫామెన్స్ చాలా డెవలప్ అయిందని గుర్తు చేశారు విరాట్ కోహ్లీ. టీమిండియా బ్యాటర్లందరూ కూడా రఘు ఆధ్వర్యంలోనే ఫాస్ట్ బౌలింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నారని వివరించారు. అతడే లేకపోతే టీమిండియా సంకనాకి పోయేది అంటూ బాంబు పేల్చారు. అలాంటి వ్యక్తి టీమ్ ఇండియాకు పని చేయడం ఎంతో గర్వకారణం గా ఉందని ప్రశంసించారు విరాట్ కోహ్లీ.
టీమిండియాలో రఘు సహాయక సిబ్బంది గా పని చేస్తున్నాడు. టీమిండియా బ్యాటర్లు ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో సైడ్ ఆర్మ్ టూల్ ఉపయోగించి బంతులు సంధిస్తూ ఉంటాడు. ఉన్నది మూడు ఫీట్లు అయినా, 155 స్పీడ్ తో బంతులు సంధిస్తూ ఉంటాడు. ఇలా వేగంగా వచ్చే బంతులను ఎదుర్కొనే టీమ్ ఇండియా క్రికెటర్లు… బ్యాటింగ్ మెరుగుపరుచుకుంటూ ఉంటారు. విదేశీ మైదానాలలో రఘు ఇచ్చే ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది. రఘు వేసే ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కొన్న ఆటగాళ్లు… విదేశాలలో వచ్చే వేగవంతమైన బంతులను అవలీలగా ఎదుర్కోగలుగుతారు. ఇదే విషయాన్ని తాజాగా విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు.
రఘు అసలు పేరు రాఘువీంద్ర ద్వివేది. త్రోడౌన్ స్పెషలిస్ట్ గా టీమిండియాలోకి వచ్చిన రఘు ట్రైనర్ గా కూడా పనిచేస్తున్నాడు. ఇతని ట్రైనింగ్ కారణంగానే మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఫాస్ట్ బౌలర్లను అవలీలగా ఎదుర్కోగలుగుతున్నారు. క్రికెటర్ కావాలన్నా డ్రీమ్ తో 21 రూపాయలు జేబులో పెట్టుకొని ఇంటిని వదిలేసి వచ్చాడు. ఆ తర్వాత అనేక కష్టాలు పడి 2011లో సచిన్ కంటపడ్డాడు. సచిన్ సిఫారసు చేయడంతో రఘు చేతి వేగాన్ని చూసి.. ట్రైనర్ గా తీసుకున్నారు. టీమిండియా బౌలింగ్ ట్రైనర్ రఘు సారథ్యంలోనే ఐసీసీ ట్రోఫీలు కూడా వచ్చాయి. టీమిండియా కు ఎన్నో విజయాలు అందించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. అందుకే విరాట్ కోహ్లీ రఘును మెచ్చుకుంటూ తాజాగా కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది.