E-Paper
Advertisement

వన్‌ప్లస్ కొత్త ఇయర్ బడ్స్‌పై భారీ డిస్కౌంట్.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరు!

వన్‌ప్లస్ కొత్త ఇయర్ బడ్స్‌పై భారీ డిస్కౌంట్.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరు!
Advertisement

OnePlus Nord Buds 3r: ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ ప్లస్ ఇండియన్ మార్కెట్లోకి మరో ఆకర్షణీయమైన ప్రొడక్ట్‌ను తీసుకువచ్చింది. పండగ సీజన్ సమీపిస్తున్న వేళ,కస్టమర్లను ఆకట్టుకునేందుకు తన అత్యంత ఫేమస్ అయిన ‘వన్‌ప్లస్ నోర్డ్ బడ్స్ 3ఆర్’ ఇయర్‌ బడ్స్‌ను సరికొత్త ‘జేడ్ మిస్ట్’కలర్ వేరియంట్‌లో విడుదల చేసింది. అద్భుతమైన డిజైన్,పవర్ ఫుల్ బ్యాటరీ బ్యాకప్ , ప్రత్యేకమైన ఫెస్టివల్ డిస్కౌంట్‌లతో.. వస్తున్న ఈ కొత్త బడ్స్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

మార్కెట్లో బడ్జెట్ ధరలో లభించే ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా యువత, మ్యూజిక్ లవర్స్ ను టార్గెట్ చేస్తూ వన్‌ప్లస్ కంపెనీ.. ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్ట్స్‌ను పరిచయం చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో.. గతంలో మార్కెట్లోకి వచ్చి విపరీతమైన సేల్స్ సాధించిన ‘వన్‌ప్లస్ నోర్డ్ బడ్స్ 3ఆర్’ మోడల్‌ను ఇప్పుడు సరికొత్త ‘జేడ్ మిస్ట్’ కలర్ ఆప్షన్‌లో లాంచ్ చేశారు. ఇప్పటికే ఈ ఇయర్‌ బడ్స్ ఆరా బ్లూ ,యాష్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ‘జేడ్ మిస్ట్’ సాఫ్ట్ గ్రీన్ షేడ్ వచ్చి చేరింది.

పండుగ సీజన్ ఆఫర్లు:

Advertisement

మార్కెట్లో ఈ కొత్త జేడ్ మిస్ట్ కలర్ వేరియంట్ స్టాండర్డ్ ధర రూ. 1,999గా నిర్ణయించారు. అయితే.. రాబోయే పండగ సీజన్ సేల్స్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు , ప్రత్యేక డిస్కౌంట్లు అన్నీ కలుపుకుని ఈ ఇయర్‌ బడ్స్‌ను కేవలం రూ. 1,599 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ కొత్త కలర్ వేరియంట్ .. అమ్మకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్ర, బ్లింకిట్ అలాగే వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్లలో ఇవి లభించనున్నాయి.

అదిరిపోయే బ్యాటరీ బ్యాకప్, పర్ఫార్మెన్స్:

ఈ ఇయర్‌బడ్స్ మెయిన్ హైలైట్ వీటి బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 54 గంటల పాటు నాన్‌ స్టాప్ మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. అంతేకాకుండా.. కేవలం 10 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే చాలు, సుమారు 8 గంటల పాటు మ్యూజిక్ ఆస్వాదించవచ్చు. ఎక్కువ కాలం పాటు బ్యాటరీ సామర్థ్యం తగ్గకుండా ఉండేందుకు.. దీనికి ప్రత్యేక సర్టిఫికేషన్ కూడా లభించింది.

Advertisement

Also Read:  ఫ్రిజ్ దగ్గర గ్యాస్ సిలిండర్ ఉందా? వెంటనే ఈ తప్పు సరిదిద్దుకోండి!

కీలకమైన ఫీచర్లు, టెక్నాలజీ:

డ్రైవర్లు , సౌండ్: ఇందులో 12.4ఎంఎం టైటానైజ్డ్ డైనమిక్ డ్రైవర్లను అమర్చారు. వన్‌ ప్లస్ సౌండ్ మాస్టర్ ఈక్యూ సపోర్ట్‌తో మ్యూజిక్ ఫీల్ చాలా స్పష్టంగా ఉంటుంది.

కనెక్టివిటీ: ఇవి లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్‌‌తో వస్తాయి. అలాగే.. ఒకే సమయంలో రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునేలా డ్యూయల్-డివైజ్ కనెక్షన్ , గూగుల్ ఫాస్ట్ పేర్ సపోర్ట్ ఉంది.

గేమింగ్, కాల్స్: గేమర్స్ కోసం ప్రత్యేకంగా లో-లేటెన్సీ గేమింగ్ మోడ్ ఇచ్చారు. అలాగే కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గించడానికి.. ఏఐ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని వాడారు.

అదనపు స్మార్ట్ ఫీచర్లు: ఇవి డస్ట్ , వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. దీంతో పాటు ఏఐ ట్రాన్స్‌లేషన్ ,ఫైన్ మై ఇయర్‌బడ్స్ వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ , ఆకట్టుకునే ఫీచర్లు కోరుకునే వారికి వన్‌ ప్లస్ నోర్డ్ బడ్స్ 3ఆర్ ‘జేడ్ మిస్ట్’ కలర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. పండగ సమయాల్లో ప్రియమైన వారికి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇది పర్ఫెక్ట్ గాడ్జెట్!

Related News

వైర్డ్ vs వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ కాలం మన్నుతుంది?

ఫ్రిజ్ క్లీనింగ్ కష్టమా? ఈ అల్యూమినియం ఫాయిల్ ట్రిక్‌తో మీ పని ఈజీ!

అబ్బా ఏం ఐడియా భయ్యా.. నెట్‌వర్క్ లేకపోయినా వాకీటాకీలా వాడుకునే వన్‌ప్లస్ సీక్రెట్ ఫీచర్!

వింటర్ వచ్చేసింది..గీజర్ సర్వీసింగ్ చేయించకుండా ఆన్ చేస్తే భారీ మూల్యం తప్పదు!

పాటలు వినొచ్చు, ఫోన్ కాల్స్ మాట్లాడొచ్చు.. హ్యాండ్స్‌ఫ్రీ ఎక్స్‌పీరియన్స్‌తో శాంసంగ్ ఏఐ గ్లాసెస్!

నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?ఇంట్లోనే ఇలా రీసెట్ చేసుకోండి!

ఫ్రిజ్ దగ్గర గ్యాస్ సిలిండర్ ఉందా? వెంటనే ఈ తప్పు సరిదిద్దుకోండి!

Big Stories

Advertisement
×