E-Paper
Advertisement

తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు పై సీపీఐ(ఎం) ఉద్యమ బాట!

తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు పై సీపీఐ(ఎం) ఉద్యమ బాట!
Advertisement

True-Up Charges: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై రూ.7,635 కోట్ల మేర ట్రూ-అప్ చార్జీల పేరుతో ప్రజలపై భారాన్ని మోపాలని చూస్తున్న ప్రభుత్వ, ఈఆర్‌సీ విధానాలను సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. 2026 నవంబరు నెలలో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబరు నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున పెంచాలని డిస్కమ్‌లు నిర్ణయించడం సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరవడమేనని, ఈ పెంపుదల ప్రతిపాదనలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేనట్లయితే కలిసొచ్చే శక్తులతో ఆందోళనలు ఉధృతం చేస్తామని సీపీఐ పార్టీ హెచ్చరికు జారీ చేసింది.

ప్రభుత్వం విఫలం..

విద్యుత్ సంస్థల అసమర్థ నిర్వహణను సాకుగా చూపి ఇప్పుడు ప్రజలపై ఈ అదనపు భారాన్ని మోపడం సరికాదని అన్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు అల్లాడిపోతుంటే, మరోవైపు కరెంటు చార్జీల పెంపుతో వారి బతుకులు మరింత భారంగా మారుతున్నాయి. ప్రభుత్వ శాఖల నుంచి డిస్కమ్‌లకు రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలను రాబట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ఒక్క నీటిపారుదల శాఖ నుంచే ఎత్తిపోతల పథకాల కింద రావాల్సిన బకాయిలే రూ.29 వేల కోట్లకు పైగా ఉన్నప్పటికీ, ఆ భారాలన్నింటినీ నేడు ప్రజల మీదకు నెట్టడం ఎంతవరకు సమంజసం అపని రాష్ట్ర ప్రదాన కార్యదర్షి జాన్ వెస్లీ అన్నారు.

Advertisement

Also read: చెత్త కుప్పలో దొరికే అమ్మాయి… కళ్లు తెరిచాక మెమొరీ లాస్… ఫైటింగ్ మాత్రం పూనకాలే

2000 సంవత్సరంలో..

తక్షణమే ఈ ట్రూ-అప్ చార్జీల వసూళ్ల నిర్ణయాన్ని, యూనిట్ల మీద అదనపు పెంపుదల ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తోందని అన్నారు. ప్రపంచబ్యాంకు సంస్కరణలు, విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2000 సంవత్సరంలో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన చారిత్రాత్మక ‘విద్యుత్ ఉద్యమం’ స్పూర్తితోనే ఈ చార్జీల భారాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నదని రాష్ట్ర ప్రదాన కార్యదర్షి జాన్ వెస్లీ అన్నారు.

Advertisement

Also read: సీఈసీ నియామక వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన సీజేఐ బెంచ్!

Tags

Related News

పీఎం శ్రీ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

దుర్గామాత మండపాల నిర్వాహకులు షాకింగ్ న్యూస్.. రూల్స్ పాటించాల్సిందే?

దసరాకు ఊరెళ్లేవారికి తీపి కబురు.. 7 వేల ప్రత్యేక బస్సులు.. మహిళలకు ఉచితం యథాతథం!

యజమాని లేకుండా నకిలీ GPA సృష్టించి కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు.. ఎక్కడంటే?

తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సీఎం రేవంత్ బిగ్ గిఫ్ట్?

హామీ ఇచ్చి నీళ్లు ఆపేశారా.. జూరాల ప్రాజెక్టుపై ఆశతో ఎదరుచూస్తున్న అన్నదాతలు!

బిగ్ బ్రేకింగ్.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో భారీ అగ్నిప్రమాదం!

Big Stories

Advertisement
×