Romantic Horror Thriller: పగలు చూస్తే ఆమె మామూలు అమ్మాయే. ఆమె కోసం ప్రాణం పెట్టే యువకుడు కూడా ఉన్నాడు. కానీ సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఆమెను కలవకూడదట. ఫోన్ కూడా చేయకూడదట. అసలు ఆ రూల్ ఎందుకు ? దీని వెనుక ఏదో రహస్యం ఉందని తెలుసుకున్న హీరో ఆమెను ఫాలో అయితే… తన కళ్లముందే ప్రియురాలు భయంకరమైన రూపంలోకి మారిపోతే ? ఆ మార్పు వెనుక తరతరాలుగా వెంటాడుతున్న శాపం ఉందని తెలిస్తే ? ప్రేమ కోసం ఆ శాపాన్ని ఛేదించడానికి అతను ఎంత దూరం వెళ్తాడనేదే ‘రామ్ అండ్ లీల’ (Ram And Leela) కథ. మరి ఈ తమిళ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.
రామ్ ఐటీ ఉద్యోగిగా పని చేస్తూ ఉంటాడు. అతని జీవితం పెద్దగా ఎలాంటి మలుపులు లేకుండా సాగుతుంటుంది. అలాంటి సమయంలో అతనికి లీల aనె అమ్మాయి పరిచయం అవుతుంది. మొదట చిన్న పరిచయంగా మొదలైన వీరి అనుబంధం కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారుతుంది. లీలతో గడిపే సమయం రామ్‌కు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. కానీ లీల మాత్రం మొదటి నుంచే ఒక విచిత్రమైన షరతు పెడుతుంది. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు తనను కలవకూడదని చెబుతుంది. ఆ సమయంలో ఫోన్ కూడా చేయొద్దని స్పష్టంగా చెప్పేస్తుంది. మొదట రామ్ దాన్ని ఆమె వ్యక్తిగత స్వేచ్ఛగా భావిస్తాడు. ప్రేమలో ఉన్న వ్యక్తి అడిగిన చిన్న కోరికగా తీసుకుంటాడు.
రోజులు గడిచేకొద్దీ మాత్రం రామ్‌కు అనుమానం పెరుగుతుంది. లీల ప్రవర్తనలో ఏదో తేడా ఉందని అతనికి అనిపిస్తుంది. ఆమె రాత్రివేళ ఎక్కడ ఉంటుంది ? ఎందుకు తనను పూర్తిగా దూరంగా పెడుతుంది ? అనే ప్రశ్నలు అతని మనసును వేధిస్తాయి. చివరికి ఒకరోజు ఆమెకు తెలియకుండా రామ్ ఫాలో అవుతాడు. అక్కడే అతని జీవితమే మారిపోయే దృశ్యం కనిపిస్తుంది. సాయంత్రం 6 గంటలు దాటిన వెంటనే లీల శరీరంలో వింత మార్పులు మొదలవుతాయి. సాధారణమైన యువతిగా కనిపించిన ఆమె ఒక్కసారిగా భయంకరమైన శక్తిగా మారిపోతుంది. రామ్ చూసింది నిజమా, భ్రమా అనే అయోమయంలో పడిపోతాడు.
తర్వాత ఈ మార్పు వెనుక ఎలాంటి అనారోగ్యం లేదని తెలుస్తుంది. లీల కుటుంబాన్ని తరతరాలుగా వెంటాడుతున్న ఓ పురాతన బ్లడ్ కర్స్ ఆమె జీవితాన్ని కంట్రోల్ చేస్తుందని తెలుస్తుంది. పగలు సాధారణంగా ఉండే ఆమె, రాత్రి ఆ శాపం ప్రభావంతో పూర్తిగా రాక్షసిలా మారిపోతుంది. ప్రేమించిన వ్యక్తిని ఆ స్థితిలో వదిలేయడానికి రామ్ సిద్ధపడడు. ఆమెను కాపాడేందుకు ఆధ్యాత్మిక శక్తులు, అఘోరాలు, చేతబడి నిపుణుల సహాయం కోరుతూ ప్రమాదకరమైన మార్గంలో అడుగుపెడతాడు. ఈ ప్రయాణంలో అతనికి ఎదురయ్యే ప్రతి అడుగు కొత్త భయాన్ని చూపిస్తుంది. అసలు ఈ శాపం ఎక్కడి నుంచి వచ్చింది ? లీలను దాని నుంచి నిజంగా రక్షించగలడా రామ్ ? ప్రేమను కాపాడుకోవడానికి అతను ఏం చేయాల్సి వస్తుంది ? రాత్రి లీలలోకి వచ్చే ఆ చీకటి శక్తిని ఎలా ఆపుతాడు ? ఈ ప్రశ్నలకు సమాధానం సినిమా చూసినప్పుడే తెలుస్తుంది.
‘రామ్ అండ్ లీల’లో హరీష్ కళ్యాణ్ (Harish Kalyan), నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) ప్రధాన పాత్రల్లో నటించారు. వేల్ రాజ్ (Velraj) దర్శకత్వం వహించిన ఈ హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం తమిళ ఒరిజినల్ ఆడియోతో చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ లేదు. ప్రేమకథలో హారర్, సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్ కలిసిన ఈ సినిమా హర్రర్ మూవీ లవర్స్ కి ఆసక్తికరంగా ఉంటుంది.
Read Also: కన్న తల్లిదండ్రులని చంపేసే లేడీ సైకో.. ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ తెలుగులో!