E-Paper
Advertisement

నాని జడల వెనుక ఇంత స్టోరీ ఉందా? లుక్ కోసం కాదా?

నాని జడల వెనుక ఇంత స్టోరీ ఉందా? లుక్ కోసం కాదా?
Advertisement

Actor Nani: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నాని ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. నిన్న చెన్నైలో ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న నాని నేడు బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో..

ఇదివరకు నాని సినిమాలు అంటే నాని ఈ సినిమాలలో లవర్ బాయ్ గా కనిపిస్తూ ప్రేక్షకులను సందడి చేసేవారు కానీ ది ప్యారడైజ్ సినిమాలో మాత్రం నాని విభిన్నమైన లుక్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. పొడువాటి గడ్డం, ముక్కు పుడక, రెండు పొడవాటి జడలతో ఊర మాస్ లుక్ లో నాని కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. నాని కెరియర్ లోనే ఇప్పటివరకు చేయని సాహసం ది ప్యారడైజ్ సినిమా కోసం చేస్తున్నారని చెప్పాలి.

జడలు లుక్ కోసం కాదు..

Advertisement

ఇక బెంగళూరులో నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా యాంకర్ నానిని ప్రశ్నిస్తూ అసలు ఈ సినిమాలో మీ జడల వెనుక ఉన్న కాన్సెప్ట్ ఏంటి సర్ అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ… సినిమాలో నేను వేసుకున్న జడలు కేవలం లుక్ కోసం మాత్రం కాదు ఈ జడల వెనుక పెద్ద స్టోరీ ఉందని అయితే అది మీరంతా థియేటర్లలో చూస్తేనే బాగుంటుంది అంటూ నాని మాట దాటవేశారు. అయితే ఈ జడలు లుక్ కోసం కాదని ఈయన క్లారిటీ ఇవ్వడంతో ఈ జడల వెనుక పెద్ద స్టోరీనే ఉందని స్పష్టమవుతుంది. మరి నాని జడల కాన్సెప్ట్ ఏంటో తెలియాలి అంటే సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే.

స్పెషల్ సాంగ్ లో కీర్తి సురేష్…

ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల (Sreekanth Odela)దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్ లో దసరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే ప్యారడైజ్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో నాని తల్లిగా సోనాలి కులకర్ణి నటించిన సంగతి తెలిసిందే. నాని జోడిగా ఖయాదలోహర్ నటించగా ఏసనాగుల కట్ట అంటూ సాగిపోయే స్పెషల్ సాంగ్ లో మాత్రం కీర్తి సురేష్ (Keerthy Suresh)అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి. మరి సెప్టెంబర్ 24న రాబోతున్న ప్యారడైజ్ సినిమా ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: కొత్త ఫోన్ కోసం క్యూ కట్టడం ఏంటీ? ఐ ఫోన్ లవర్స్ కు క్లాస్ పీకిన సోనూ సూద్!

Related News

రాజకీయాల కంటే సినిమానే బెటర్… రియాలిటీలోకి వచ్చిన రోజా!

గ్లింప్స్‌తోనే కథపై క్యూరియాసిటీ పెంచేసిన ‘వెట్టువం’.. ఇదేం కాన్సెప్ట్ రా బాబు!

కొత్త ఫోన్ కోసం క్యూ కట్టడం ఏంటీ? ఐ ఫోన్ లవర్స్ కు క్లాస్ పీకిన సోనూ సూద్!

ప్యారడైజ్ కోసం నాని రెమ్యూనరేషన్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

అల్లు అర్జున్ కు సంబంధం లేదు.. భూ వివాదంపై మామ చంద్రశేఖర్ రెడ్డి క్లారిటీ!

రోజాని అలా చూసి చాలా హర్ట్ అయ్యా.. ఆమని కామెంట్స్ వైరల్!

జాంబీ రెడ్డి 2 నుండి ఉపేంద్ర ఫస్ట్ లుక్ రిలీజ్.. ప్రపంచమే తలకిందులు కాబోతోందా?

Big Stories

Advertisement
×