Mowgli Movie : ముందుగా ఛాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానల్ లో కొన్ని వీడియోస్ చేసి బాగా పాపులర్ అయ్యాడు సందీప్ రాజ్. ఎన్నో ప్రయత్నాలు తర్వాత కలర్ ఫోటో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. సుహాస్ నటించిన ఈ సినిమా థియేటర్లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత ముఖచిత్రం అనే సినిమాకి రచయితగా పనిచేశాడు సందీప్.
కలర్ ఫోటో సినిమా తర్వాత ఇప్పటివరకు సందీప్ సినిమా చేయలేదు. ఇప్పుడు సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా మొగ్లీ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ సినిమా మీద మంచి అంచనాలు పెట్టుకున్నాడు రోషన్. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. గ్లిమ్స్ వీడియో కూడా బానే ఆకట్టుకుంటుంది.
హీరోయిన్ మాట్లాడదా.?
ఈ సినిమాలో సాక్షి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు అసలు మాటలు రావు. అయితే ఈ వార్త పెద్దగా ఎవరికి తెలియదు. కానీ రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్లో హీరోయిన్ ఏమీ మాట్లాడలేదు. రోషన్ దీని గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతం ఆమె ఏమీ మాట్లాడలేదు. దానికి కారణం తర్వాత చెప్తాము అంటూ చెప్పాడు. అయితే హీరోయిన్ కి మాటల రావు అని కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ విషయం ఇప్పుడు రోషన్ కామెంట్స్ తర్వాత అది వైరల్ అయిపోయింది. అయితే రోషన్ మాట్లాడుతూ హీరోయిన్ మాట్లాడకపోవడానికి కారణం తర్వాత చెబుదాము ఇప్పుడు చెబితే మా డైరెక్టర్ కొడతాడు అంటూ చెప్పాడు. ఏదేమైనా ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇవ్వడం వలన క్యారెక్టర్ గురించి ఆల్మోస్ట్ ఒక ఐడియా వచ్చేసింది.
అంచనాలన్నీ ఈ సినిమా మీద
రోషన్ కనకాల ముందు బబుల్గం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు మోగ్లీ సినిమా మీద అంచనాలన్నీ పెట్టుకున్నాడు రోషన్. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియోను రామ్ చరణ్ తేజ్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నిన్న విడుదలైంది. అలానే రామ్ చరణ్ ఈ వీడియో చూసి చిత్ర యూనిట్ ను ప్రశంసించారు. ఇక ఇప్పుడు ఇది ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Also Read : Ss Rajamouli: పవన్ కళ్యాణ్ సినిమాని కామెంట్ చేసిన రాజమౌళి, వైరల్ అవుతున్న పోస్ట్