Knee Pain: ప్రస్తుత బిజీ లైఫ్ కారణంగా, మోకాలి నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. గతంలో ఈ సమస్య వృద్ధులకే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు ఇది యువతలో కూడా వేగంగా వ్యాపిస్తోంది. పెరుగుతున్న వయస్సు, బరువు, ఆర్థరైటిస్ లేదా పోషకాహార లోపం వంటి అనేక కారణాల వల్ల..మోకాళ్లలో నొప్పి సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది.
ఇలాంటి పరిస్థితిలో.. పదే పదే నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ వాడటం లేద ప్రతిసారీ డాక్టర్ వద్దకు వెళ్లడం సరైన పరిష్కారం కాదు. ఇందుకోసం ఇంట్లోనే కొన్ని హోం రెమెడీస్ వాడవచ్చు. మోకాళ్ల నొప్పిని తగ్గించే 5 రకాల హోం రెమెడీస్ గురించి వాటిని వాడే విధానం గురించిన పూర్తి వివరాలను ఇప్పడు తెలుసుకుందాం.
మోకాలి నొప్పి అనేది చాలా మందిని వేధించే ఒక సాధారణ సమస్య. వయసుతో పాటు వచ్చే అరుగుదల, గాయాలు, ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. తీవ్రమైన నొప్పికి ట్రీట్ మెంట్ అవసరం అయినప్పటికీ.. తేలికపాటి మోకాలి నొప్పిని ఇంట్లో లభించే సహజ నివారణలతో తగ్గించుకోవచ్చు.
మోకాలి నొప్పికి హోం రెమెడీస్:
1. అల్లం:
అల్లం శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది నొప్పిని, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
ఉపయోగించే విధానం: ఒక కప్పు నీటిలో సన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసి 5-10 నిమిషాలు మరిగించండి. గోరువెచ్చగా అయ్యాక తాగండి. రోజుకు 2-3 సార్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అల్లం నూనెను నొప్పి ఉన్న చోట మసాజ్ చేయడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.
2. పసుపు:
పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది నొప్పిని తగ్గించి, ఎముకల ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది.
ఉపయోగించే విధానం: ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు పొడిని కలిపి రాత్రి పడుకునే ముందు తాగండి. పసుపు, కొద్దిగా నీటితో కలిపి పేస్ట్ లా చేసి నొప్పి ఉన్న చోట అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
3. ఆవ నూనెతో మసాజ్:
ఆవ నూనె రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఉపయోగించే విధానం: కొద్దిగా ఆవ నూనెను వేడి చేసి, గోరువెచ్చగా ఉన్నప్పుడు మోకాలిపై సున్నితంగా మసాజ్ చేయండి. ఇది కండరాలకు ఉపశమనం కల్పిస్తుంది . అంతే కాకుండా రక్త ప్రసరణను పెంచుతుంది.
4. ఆపిల్ సైడర్ వెనిగర్:
ఆపిల్ సైడర్ వెనిగర్ మోకాలి కీళ్ళలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది నొప్పిని తగ్గిస్తుంది.
ఉపయోగించే విధానం: రెండు టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఒక గ్లాసు నీటిలో కలిపి రోజుకు రెండుసార్లు తాగండి. లేదా.. ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కొద్దిగా ఆలివ్ ఆయిల్‌తో కలిపి నొప్పి ఉన్న చోట మసాజ్ చేయండి.
5. మెంతులు:
మెంతులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ , అనాల్జేసిక్ (నొప్పి నివారణ) గుణాలు ఉన్నాయి.
ఉపయోగించే విధానం: ఒక టీస్పూన్ మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం ఈ మెంతి గింజలను నమలండి లేదా నానిన నీటిని తాగండి. మెంతి గింజలను పొడి చేసి, పసుపుతో కలిపి నొప్పి ఉన్న చోట ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు.
Also Read: ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే.. బోలెడు లాభాలు
6.కోల్డ్ కంప్రెస్/హాట్ కంప్రెస్:
నొప్పి, వాపును తగ్గించడానికి ఇది ఒక సాధారణ, సమర్థవంతమైన పద్ధతి.
కోల్డ్ కంప్రెస్: గాయం లేదా తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు.. ఐస్ ప్యాక్‌ను ఒక క్లాత్ లో చుట్టి 15-20 నిమిషాలు నొప్పి ఉన్న చోట అప్లై చేయండి. ఇది వాపును తగ్గిస్తుంది.
హాట్ కంప్రెస్: దీర్ఘకాలిక నొప్పికి లేదా కండరాల బిగుతుకు, వేడి నీటి బ్యాగ్ ఉపయోగించండి. ఇది రక్త ప్రసరణను పెంచి నొప్పిని తగ్గిస్తుంది.
గమనిక:
ఈ సహజ నివారణలు తేలికపాటి మోకాలి నొప్పికి ఉపశమనం కలిగించవచ్చు. అయితే.. నొప్పి తీవ్రంగా ఉంటే.. వాపు తగ్గకపోతే, లేదా రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగించేంత తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం