Star Actress: వెండితెరపై దశాబ్దల కాలం పాటు తన నటనతో ప్రేక్షకులను సందడి చేసిన వారిలో దివంగత నటి సరోజా దేవి ఒకరు. ఇటీవల ఈమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగళూరులోని మల్లేశ్వరంలో తన స్వగృహంలోనే సోమవారం తుది శ్వాస విడిచారు. ఇలా నటి సరోజ దేవి మరణంతో ఆమెకు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినిమా ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన సేవలు చేసిన ఈమె మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఇకపోతే సరోజా దేవికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.
చివరి కోరిక అదే..
సాధారణంగా చాలామంది చనిపోయిన తర్వాత తమ కళ్ళను దానం చేస్తూ ఉంటారు అలాగే సరోజ దేవి కూడా తన కళ్లను దానం చేశారని తెలుస్తోంది. ఆమె గతంలో బెంగళూరులోని నారాయణ నేత్రాలయం సందర్శించినప్పుడు తన మరణం తరువాత కళ్లను దానం చేస్తానని చెప్పినట్లు ఐ బ్యాంకు అధికారి డాక్టర్ రాజ్ కుమార్ తెలిపారు. ఈమె ఐదు సంవత్సరాల క్రితమే నేత్రదానం నమోదు చేసుకున్నట్లు ఈయన వెల్లడించారు. ఇక తాజాగా ఈమె అనారోగ్య సమస్యలతో మరణించిన నేపథ్యంలో తన కోరిక మేరకు కుటుంబ సభ్యులు కళ్లను దానం చేసినట్టు తెలుస్తుంది.
ఇద్దరికీ చూపు ప్రసాదించిన సరోజా దేవి..
సరోజా దేవి కోరిక మేరకు.. ఆమె మరణం తర్వాత నారాయణ నేత్రాలయ సిబ్బంది సరోజ దేవి కార్నియా
తీసి భద్రపరచినట్లు తెలిపారు. త్వరలోనే ఆ కార్నియాను కంటి చూపు లేని వారికి అమర్చిపోతున్నట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు. ఇలా చనిపోయిన తర్వాత కూడా సరోజా దేవి ఇద్దరికీ చూపును ప్రసాదించిందని విషయం తెలిసిన అభిమానులు నెటిజన్లు ఈమె మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా ఎంతో మంచి మనసు ఉంటే తప్ప ఇలాంటి మంచి పనులు చేయరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సరోజ దేవి మరణం పట్ల ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ తమ సంతాపం తెలియజేశారు.
పద్మభూషణ్ అవార్డు గ్రహీత..
మంగళవారం నాడు సరోజ దేవి అంత్యక్రియలు తన స్వగ్రామం దశవార గ్రామంలో, ఒక్కలిగ సామాజిక వర్గ సాంప్రదాయం ప్రకారం పూర్తి అయ్యాయి.ఇక సరోజ దేవి తెలుగు తమిళ కన్నడ భాషలలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.ఇక తెలుగులో సరోజ దేవి సుమారుగా పాతిక సినిమాలలో నటించారు అయితే ఎక్కువగా ఈమె ఎన్టీఆర్ తో కలిసి సినిమాలు చేశారు. ఇలా ఎన్టీఆర్ (NTR) ఏఎన్నార్(ANR) వంటి స్టార్ హీరోలతో ఈమె నటించి సందడి చేశారు. ఇలా అన్ని భాషలలో సినిమాలు చేసిన ఈమె ఇండస్ట్రీకి అందించిన సేవలకు గాను ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. అయితే ఇన్నేళ్ల సినీ కెరియర్ లో ఎక్కడా కూడా సరోజ దేవి వివాదాలలో నిలవలేదని చెప్పాలి.
Also Read: Arjith Singh: దర్శకుడిగా మారిన ప్రముఖ సింగర్ .. డెబ్యూ సినిమాకు ముహూర్తం పిక్స్?