Viral video: సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రపంచం నలుమూలల ఎక్కడేం జరిగిన ఈజీగా తెలిసిపోతుంది. ముఖ్యంగా కామెడీ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వైరల్ వీడియోలకు మిలియన్ కొద్ది వ్యూస్ వస్తున్నాయి. లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా.. న్యూయార్కులో జరిగిన ఓ పార్కింగ్ వివాదం సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పార్కింగ్ విషయంలో మాటామాట పెరిగి కొట్టుకునే దాక పోయింది. ఓ యువతిపై ఇద్దరు తల్లికూతుళ్లు కలిసి దాడి చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mother with her transformer daughter, and another man viciously attacked a woman over a parking spot in NYC. pic.twitter.com/SxIyb32xEz
— I Meme Therefore I Am 🇺🇸 (@ImMeme0) July 9, 2025
న్యూయార్క్ నగరం దగ్గరలోని రిడ్జ్‌వుడ్, క్వీన్స్‌లో తల్లికూతుళ్లు ఇద్దరు కలిసి 21 ఏళ్ల యువతిపై అటాక్ చేశారు. పార్కింగ్ స్థలం విషయంలో ఈ గొడవ జరిగింది. ఆండ్రియా డుమిత్రు, సబ్రినా స్టార్ మన్ అనే ఇద్దరు తల్లికూతుళ్లు పార్కింగ్ స్థలం కోసం ఉపయోగించిన చెత్త డబ్బాను తొలగించేందుకు ప్రయత్నించిన యువతిపై దాడి చేశారు. వీడియోలో ఈ యువతి పార్కింగ్ స్థలాన్ని క్లియర్ చేయడానికి చెత్త డబ్బాను తొలగిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయంలో కాసేపు ఆ యువతి, తల్లికూతుళ్లు వాదించుకున్నారు. అది కాస్త గొడవకు దారి తీసింది. ఆ తర్వాత యువతిపై తల్లి, కూతురు దాడి చేశారు. ఈ దాడిలో ఒక పురుషుడు, మహిళ కూడా బాధితురాలి జుట్టు పట్టుకుని ఇష్టమొచ్చినట్టు దాడి చేసినట్టు తెలుస్తుంది.
ఆ యువతి సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ ఇద్దరు తల్లికూతుళ్లను అరెస్ట్ చేశారు. వారు.. బాధిత యువతికి క్షమాపణలు చెప్పారు. అయితే.. క్షమాపణలు చెప్పినప్పటికీ నెటిజన్లు తల్లికూతుళ్లు చేసిన పనిని ఖండిస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఈ విధంగా కామెంట్ చేశారు. ‘మీరు క్షమాపణలు చెప్పారు.. కానీ ఒక యువతిపై అలా దాడి చేయడం ఏ మాత్రం సరి కాదని’ చెప్పారు. ‘అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు పిడి గుద్దులు గుద్దడం కరెక్ట్ కాదని.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. క్షమాపణలు చెప్పిన ఇలాంటి వారిని వదిలేయకూడదు.. పోలీస్ అధికారులు వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. మరోసారి ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు’ అని మరి కొంత మంది కామెంట్ చేశారు.
ALSO READ: Viral Video: పడవ మీద ఒళ్లు కదలకుండా డ్యాన్స్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ కుర్రాడెవరో తెలుసా?