Arijit Singh : సినిమా అంటే ప్యాషన్ తో ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది దర్శకులు హీరోలుగా మారటం, హీరోలు కూడా డైరెక్టర్లుగా మారడం వంటివి జరుగుతుంటాయి. ఇలా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత అన్ని రంగాలలో పనిచేయాలని ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇన్ని రోజులు తెరవ వెనక ఉంటూ అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలు ఆలపించిన ప్రముఖ సింగర్ అర్జిత్ సింగ్(Arijit Singh) దర్శకుడుగా మారబోతున్నారు. త్వరలోనే ఈయన డెబ్యూ మూవీకి సంబంధించి అధికారక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది.
ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీ బిజీ..
అర్జిత్ సింగ్ సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. భారత దశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన గాయకులుగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో అర్జిత్ సింగ్ ఒకరు. ఇలా సింగర్ గా సక్సెస్ అందుకున్న ఈయన త్వరలోనే ఓ అడ్వెంచర్స్ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అర్జిత్ సింగ్ దర్శకత్వంలో,
మహావీర్ జైన్(Mahaveer Jain) నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. గత కొంతకాలంగా దర్శకత్వం చేయాలనే ఆలోచనలో ఉన్న అర్జిత్ సింగ్ ఇప్పటికే అద్భుతమైన స్క్రిప్ట్ కూడా పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది..
జంగిల్ అడ్వెంచర్
జంగిల్ అడ్వెంచర్(Jungle Adventure) మూవీగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా, నటీనటుల ఎంపిక విషయంలో దర్శక నిర్మాతలు బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాల పట్ల అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచనలో ఉన్న నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలోనే క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం.
అవార్డుల పంట…
అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను వెల్లడించబోతున్నారు. ప్రస్తుతం నిర్మాత మహావీర్ పలు ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. కార్తీక్ ఆర్యన్ తో కలిసి నాగ్‌జిల్లా
అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆర్జిత్ సింగ్ సింగర్ గా ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఆషికి సినిమాలోని “తుమ్ హి హో” అనే పాటకు ఈయన అత్యధికంగా అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ పాటకు 10 నామినేషన్స్ లో నిలిచిన ఆర్జిత సింగ్ ఏకంగా తొమ్మిది పురస్కారాలను అందుకోవడం విశేషం. అలాగే రెండు నేషనల్ అవార్డులు,7 ఫిలింఫేర్ అవార్డులు, గీమా అవార్డులు, ఐఫా అవార్డులు వంటి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇలా సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అర్జిత్ సింగ్ దర్శకుడిగా కూడా సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తూ ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read: Naga Vamshi: తారక్ అన్న జడ్జ్మెంట్ పై నమ్మకం… సాహసం చేసిన నాగ వంశీ!