E-Paper
Advertisement

ఆ సైజులు పెంచుతూ ఫోటోలు మార్ఫింగ్…AI ఫోటోల పై శ్రియ ఫైర్

ఆ సైజులు పెంచుతూ ఫోటోలు మార్ఫింగ్…AI ఫోటోల పై శ్రియ ఫైర్
Advertisement

Shriya Saran : ఇటీవల AI టెక్నాలజీ పెరగడంతో ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎంతోమంది వివిధ రంగాలలో ముందుకు దూసుకు వెళ్తున్నారు. అయితే మరి కొంతమంది ఈ అభివృద్ధి చెందిన టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలా ఏఐ టెక్నాలజీ సెలబ్రిటీల పాలిట శాపంగా మారిందని చెప్పాలి. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు నిజమైన ఫోటో ఏది ఫేక్ ఫోటో ఏది అని చెప్పడం కూడా కష్టతరంగా మారింది. ఇప్పటికే ఈ టెక్నాలజీ ఉపయోగించి ఎంతో మంది సెలబ్రిటీల ఫోటోలను దుర్వినియోగం చేయడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

Ai ఫోటోలపై శ్రేయ ఫైర్..

నటి జాన్వి కపూర్(Janhvi Kapoor) నటించిన చుట్టమల్లె సాంగ్ ఎలాంటి వివాదాలకు కారణమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ వివాదం పట్ల సెలబ్రిటీలందరూ స్పందిస్తూ జాన్వీ కపూర్ కు మద్దతు తెలిపారు. ఇకపోతే తాజాగా సీనియర్ నటి శ్రియ శరన్(Shriya Saran) ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె డీప్ ఫేక్ ఫోటోల గురించి మాట్లాడుతూ గతంలో తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. గతంలో తన ఫోటోల విషయంలో కూడా ఎంతోమంది AI టెక్నాలజీ ఉపయోగించి మార్ఫింగ్ చేశారని తెలిపారు.

నా ఫోటోలు చూసి నేనే షాక్ అవుతున్నా…

Advertisement

కొన్ని సందర్భాలలో తాను సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్న సమయంలో తన ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ ఫోటోలు చూసి ఒక్కసారిగా నేనే షాక్ అవుతుంటానని తెలిపారు. అసలు ఇక్కడ ఉన్నది నేనేనా? అనే సందేహం నాకు కలుగుతుందని శ్రేయ తెలిపారు .మనం వేసుకున్న జాకెట్లను, డ్రెస్సులను పూర్తిగా తీసేసి ఏఐ సహాయంతో అసభ్యకరంగా బాడీ షేప్‌ను మార్చేస్తున్నారు.బూబ్స్ సైజులు పెంచేస్తూ ఫోటోలను మార్ఫింగ్ చేస్తుంటారని ఈమె మండిపడ్డారు. మహిళల పట్ల ఇలాంటి చర్యలు చాలా బాధాకరం అని శ్రేయ తెలిపారు. అభివృద్ధి చెందిన ఈ సాంకేతికతను మంచి పనులు చేయటం కోసం ఉపయోగించడం మానేసి ఇలా దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు.

మహిళ గౌరవాన్ని దెబ్బతీయకూడదు..

ఏఐ అనేది మనుషులకు సహాయం చేయడానికి ఉపయోగపడాలి గానీ, ఒక మహిళ గౌరవాన్ని దెబ్బతీయడానికి కాదంటూ శ్రేయ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ డీప్ ఫేక్ ఫోటోలు వీడియోలు పట్ల ఎంతోమంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి కఠినమైన శిక్ష విధించాలంటూ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే శ్రేయ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల దృశ్యం 3 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు.అజయ్ దేవగన్, టబు, జైదీప్ అహ్లావత్లతో కలిసి శ్రియా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. విడుదలైన కేవలం 11 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 490 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

Advertisement

Also Read: కార్తీకదీపం 2 సీరియల్ లో జోత్స్న మిస్సింగ్… ఎందుకు తప్పుకున్నారో తెలుసా?

Related News

రాజాసాబ్ డిజాస్టర్‌పై తొలిసారి నోరు విప్పిన నిర్మాత.. ఏమన్నాడో తెలుసా?

కార్తికేయ ‘పర్ణశాల’ నుంచి జిమ్ జిమ్ తారా.. పాట అదిరిందిగా!

తెలుగు సినిమాల్లో దుమ్మురేపిన తెలంగాణ జానపద పాటలు ఇవే!

నాకు ఎలాంటి రోగం లేదు..తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దన్న కమెడియన్!

రామాయణ నుండి బిగ్ అప్డేట్.. జటాయువు పాత్రలో స్టార్ సెలబ్రిటీ!

ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకున్న రణబాలి..రన్ టైం ఎంతంటే?

గీతా గోవిందం, రంగస్థలం వదులుకున్న అనుపమ..కారణం?

Big Stories

Advertisement
×