BigTV English

Viral News: ఛీ.. బకెట్ నిండ మలం తెచ్చి మెట్రో ప్రయాణికులపై పోసిన యూట్యూబర్!

Viral News: ఛీ.. బకెట్ నిండ మలం తెచ్చి మెట్రో ప్రయాణికులపై పోసిన యూట్యూబర్!

ఈ రోజు సోషల్ మీడియా డే. జనాలు ఈ రోజుల్లో సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోయారు. గంటల తరబడి ఫోన్ లో నుంచి తల తీయడం లేదు. మరికొంత మంది డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో వ్యూస్ కోసం దిగజారిపోతున్నారు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంఫుల్ ఈ ఘటన. ఓ యూట్యూబర్ వ్యూస్ కోసం ఏకంగా బకెట్ నిండా మలం తెచ్చి మెట్రో రైల్లో ప్రయాణీకులపై పోశాడు. రైల్వే ఫిర్యాదుతో సదరు  యూట్యూబర్ ను అరెస్ట్ చేశారు. తాజాగా అతడికి న్యాయస్థానం 15 నెలల జైలు శిక్ష విధించింది. ఈ వీడియోను షూట్ చేసేందుకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులకు కూడా శిక్ష ఖరారు చేసింది.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

బ్రస్సెల్స్‌ లో యానైక్ (YaNike) అనే యూట్యూబర్, యానిక్ డి అనే వ్యక్తి ఓ యూట్యూబ్ వీడియో కోసం ఎవరూ చేయకూడని పని చేశారు. ఆయన చెత్త పనికి ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 చివరిలో ఏదైనా కొత్త వీడియో చేసి వ్యూస్ పెంచుకోవాలనుకున్నాడు. అందులో భాగంగానే ఓ బకెట్ లో మలం తీసుకొచ్చి, మెట్రోలో ప్రయాణికులపై పోశాడు. ఈ వీడియోను ‘సర్‌ ప్రైజ్ డు షెఫ్’ అనే పేరుతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు మండిపడ్డారు.


రైల్వే ఫిర్యాదుతో యానైక్ అరెస్ట్

యానైక్‌ పై బ్రస్సెల్స్ ఇంటర్‌ కమ్యూనల్ ట్రాన్స్‌ పోర్ట్ కంపెనీ (STIB)తో పాటు బాధిత ప్రయాణీకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి యానైన్ ను అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత కఠిన షరతులతో జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలైనా బుద్ది మారలేదు. ఇలాంటి వీడియోలే మళ్లీ చేయడంతో గత ఏడాది ఆగస్టు 27న మళ్లీ అరెస్ట్ అయ్యాయడు. అదే సమయంలో అతడి దగ్గర రెండు టియర్ గ్యాస్ స్ప్రేలు దొరికాడు. బెల్జియంలో టియర్ గ్యాస్ లు ఉండటం చట్టవిరుద్ధం.

Read Also: ఆవు మూత్రంతో తలస్నానం, 50 ఆవులిస్తేనే కన్యాదానం.. అన్వేష్ పాట్లు!

15 నెలలు జైలు శిక్ష విధించిన కోర్టు

యానైక్ పై ఉద్దేశపూర్వక గాయపరచడం, ఆస్తి నష్టం, నిషేధ ఆయుధాలను కలిగి ఉండటంతో పాటు అవమానకరమైన ప్రవర్తన, బహిరంగ ఆస్తులను ధ్వంసం చేయడం లాంటి ఘటనల కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్ 11న బ్రస్సెల్స్ కరెక్షనల్ ట్రైబ్యునల్ యానైక్‌ కు 15 నెలల జైలు శిక్షకు శిక్షించింది. ఈ వీడియోను తీయడంలో సహకరించిన ఇద్దరు వ్యక్తులకు 100 గంటల సమాజ సేవ చేయాలని ఆదేశించింది. నిజానికి యానైక్ కు ప్రాసిక్యూటర్ 42 నెలల జైలు శిక్షను కోరినప్పటికీ, కోర్టు తక్కువ శిక్ష విధించింది. ఈ శిక్షపై అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. వ్యూస్ కోసం పిచ్చి వేశాలు వేసే వారికి ఇదో గుణపాఠం కావాలని అభిప్రాయపడుతున్నారు.

Read Also:  వందే భారత్ రైలుకు తప్పిన భారీ ప్రమాదం.. పశువులను రక్షించబోయి కాపరి మృతి!

Related News

Viral video: ఈ బుడ్డోడు జాతీయ గీతాన్ని ఎంత చక్కగా ఆలపించాడో.. మీరు కూడా చూసేయండి బ్రో, వీడియో మస్త్ వైరల్

Viral Video: బెడ్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎలుగుబంటి.. వెంటనే ఆ మహిళ ఏం చేసిందంటే?

Viral Video: ఫోన్ చూస్తూ డ్రైవింగ్.. రెప్పపాటులో ఘోరం, ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

iPhone Kidney: కిడ్నీ అమ్మేసి మరీ ఐఫోన్ కొన్నాడు.. ఇప్పుడు ఆస్పత్రిలో దయనీయ స్థితిలో..

Viral Video: మీకు మిక్చర్ అంటే బాగా ఇష్టమా? ఆ టేస్ట్‌కు కారణం ఇదే.. తింటే పోవడం పక్కా!

Bengaluru Crime: బెడ్ రూమ్‌లో కెమెరా పెట్టి.. విదేశీయులతో ఆ పని చేయాలంటూ భార్యపై భర్త ఒత్తిడి, చివరికి…

Free Fuel: భలే ఆఫర్.. బికినీలో వస్తే పెట్రోల్ ఉచితం, ఆ తర్వాత జరిగింది తెలిస్తే నవ్వు ఆగదు!

Viral News: చెక్కు మీద ప్రిన్సిపల్ రాసింది చూసి.. అంతా అవాక్కు, వీడి చదువు తగలెయ్య!

Big Stories

×