E-Paper
Advertisement

400 మిలియన్ వ్యూస్ టార్గెట్.. శేఖర్ వైరస్ నెక్స్ట్ ఫోక్ సాంగ్స్ ఇవే!

400 మిలియన్ వ్యూస్ టార్గెట్.. శేఖర్ వైరస్ నెక్స్ట్ ఫోక్ సాంగ్స్ ఇవే!
Advertisement

Shekar Virus : శేఖర్ వైరస్ …ప్రస్తుతం ఫోక్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పేరిది. ముఖ్యంగా రాను బొంబాయికి రాను ,బాసింగ బలాలే,మామిడి కోనాల మీద,నా పేరే ఎల్లమ్మ ,దారిపొంటొస్తుండు వంటి సూపర్ డూపర్ హిట్ ఫోక్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ అందించడంతో ఈ పేరు మారుమోగిపోతుంది. తనదైన ఫోక్ సాంగ్స్‌, మాస్ బీట్స్‌, తనదైన డ్యాన్స్‌తో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న పేరు శేఖర్ వైరస్ తాజాగా తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో ఒక్కసారి చూసేద్దాం.

ఇంటి ముందు ఉన్న అమ్మాయినే 

ఈ ఇంటర్వ్యూలో చేతికున్న జాను టాటూ ఎవరిదీ అన్న ప్రశ్నకి సమాధానంగా అది తన వైఫ్ నేమ్ అని, ఇంటి ముందు ఉన్న అమ్మాయినే ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చారు .ఇక ప్రేమ పెళ్లి విషయంలో తమకు పెద్దగా ఇబ్బందులేమీ ఎదురుకాలేదని చెప్పారు. ఒకప్పుడు హోటల్‌లో పనిచేసిన రోజుల్లో కూడా జీవితాన్ని కష్టంగా భావించలేదని, పరిస్థితులు ఎలా ఉన్నా స్వీకరిస్తూ ముందుకు సాగడమే తనకు తెలుసని తెలిపాడు.

డబ్బులు ఉన్నాయని గొప్పలకి పోను 

Advertisement

ఇక తన లైఫ్‌స్టైల్ గురించి మాట్లాడుతూ.. ఇపుడు డబ్బులు ఉన్నాయని గొప్పలకి పోవడం, బాగా డబ్బులు ఖర్చు పెట్టి బట్టలు కొనడం, ఓవర్ గా ఖర్చు పెట్టి మెయింటెనెన్స్ హంగామా చేయడం తనకు అస్సలు ఇష్టం ఉండదని తెలిపారు. ఫ్రెండ్స్‌తో సరదాగా సమయం గడపడం, క్రికెట్ ఆడటం, గేమ్స్ ఆడటమే తనకిష్టమని చెప్పారు. సినిమాల కోసం నెలల తరబడి స్క్రిప్ట్‌లు రాస్తూ ప్రెజర్ తీసుకోవడం కంటే, నచ్చిన పాటలు చేస్తూ స్వేచ్ఛగా ఉండటమే బెటర్ అని భావిస్తానని మనసులోని మాటని బయటపెట్టారు.

మూలాలు మాత్రం జానపదంలో

తనను ఎవరైనా ఫోక్ సాంగ్ అంటే ఏంటని అడిగితే మాటల్లో చెప్పడం కంటే తన పాటతోనే సమాధానమిస్తానని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. పల్లెటూరి సంస్కృతి, యాస, జానపద పదాలపై తనకు చిన్నప్పటి నుంచే పట్టు ఉందన్న శేఖర్, తన పాటల్లో సినిమా స్థాయి క్వాలిటీ ఉన్నా మూలాలు మాత్రం జానపదంలోనే ఉంటాయని చెప్పారు.

Advertisement

ఇక గతంతో పోలిస్తే ప్రస్తుతం ఫైనాన్షియల్‌గా లైఫ్ చాలా బెటర్ అయిందని సంతోషం వ్యక్తం చేశారు. ఐఫోన్, కారు, ఇల్లు, భూమి వంటి ఆస్తులు సంపాదించడమే కాకుండా, తన తల్లిదండ్రులను, భార్యను సొంత కారులో తిప్పే స్థాయికి రావడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.

400 నుంచి 500 మిలియన్ వ్యూస్ టార్గెట్ 

ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు చెప్పారు. మంగ్లీ కోసం చేసిన బోనాల పాట రీసెంట్ గా విడుదలయిందని ,ఇక నాగదుర్గ కోసం మూడు నాలుగు పాటలు, రాము రాథోడ్ కోసం పలు ప్రాజెక్టులు చేస్తున్నట్లు వెల్లడించారు. ‘తెల్ల చీర తెల్ల రైక తెలుగోళ్ళ పిల్లా…అని ఒక లైన్ ఇప్పటికే రీల్స్‌లో వైరల్ అవుతుందని ,ఇక రాము తో ఒక పాట చేయబోతున్నాని రెండు నెలల క్రితం రాసిన ఆ పాటను 400 నుంచి 500 మిలియన్ వ్యూస్ సాధించే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

also read :ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా?

సంతోషంగా ఉండటమే  ఫైనల్ గోల్

ఇక కోట్లు సంపాదించి ఇండస్ట్రీని ఏలడం కంటే, ప్రతిరోజూ నచ్చిన పని చేస్తూ కుటుంబంతో ప్రశాంతంగా, సంతోషంగా ఉండటమే తన ఫైనల్ గోల్ అని శేఖర్ స్పష్టం చేశారు. ఏది ఏమైనా సాధారణ స్థాయి నుంచి ఫోక్ సాంగ్స్ కి స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగిన ఆయన జర్నీ ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Tags

Related News

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Big Stories

Advertisement
×