E-Paper
Advertisement

అఖిల్ నెక్స్ట్ మూవీస్ లిస్ట్ ఇదేనా? ఒక్కోటి ఒక్కో రేంజ్!

అఖిల్ నెక్స్ట్ మూవీస్ లిస్ట్ ఇదేనా? ఒక్కోటి ఒక్కో రేంజ్!
Advertisement

Akhil Akkineni Next Movies:అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఎదురు చూస్తున్న హిట్ లెనిన్ రూపంలో రావడంతో ఇపుడు కెరీర్ లో మరింత జోరు చూపిస్తున్నట్టే కనిపిస్తున్నాడు.అవును .. అయ్యగారి నెక్స్ట్ లైనప్ లో అన్ని సినిమాలు ఉన్నట్టు వినిపిస్తుంది మరి.

ఇక అక్కినేని ఫ్యాన్స్ కూడా అయ్యగారు నెక్స్ట్ ఎలాంటి సినిమాలు చేయబోతున్నారా అంటూ క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారు కూడా.మరి అకిల్ నెక్స్ట్ లైనప్ లో వినిపిస్తున్న ఆ సినిమాలు ఏమై ఉంటాయో ఒకసారి చూసేద్దాం.

Advertisement

పరశురామ్ పేట దర్శకత్వంలో

ప్రస్తుతం అకిల్ పరశురామ్ పేట దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. గీత గోవిందం, సర్కారు వారి పాట అంటూ సూపర్ హిట్ సినిమాలని ఇచ్చిన పరశురాం చివరగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో పలకరించాడు.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేసిన సంగతి తెల్సిందే.

Advertisement

అయితే ఎలాగైనా సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలంటూ తాజాగా ఒక అఖిల్ కోసం ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ విత్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ స్టోరీని సిద్దం చేశాడని వినిపిస్తుంది.మరి ఈ గాసిప్స్ పై మేకర్స్ ఏమంటారో చూడాలి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో

ఇక ఇది కాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో అఖిల్ ఒక మల్టీస్టారర్ చేయబోతున్నాడని సమాచారం.ఇక ఇప్పటికే చర్చలు జరిగాయని,తెలుస్తుంది.ఇక అనిల్ సినిమాల్లో మల్టీస్టారర్ కామన్ కాబట్టి కాంబో కుదిరే అవకాశమే ఎక్కువ అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇక అఖిల్ లైనప్ లో ఉందని వినిపిస్తున్న మరో సినిమా ధీర. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ ,హోంబలే ఫిలిమ్స్ ,గీతా ఆర్ట్స్ కలిపి సంయుక్తంగా ఈ సినిమా నిర్మించ బోతుందని సమాచారం.అనిల్ కుమార్ అనే దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడని, 100 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ పీరియడ్ విజువల్ వండర్ పార్ట్ 1, పార్ట్ 2గా రాబోతుందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఇందులో మమితా బైజు హీరోగా నటించే అవకాశం ఉందని తెలుస్తుంది .

తొలి సాలిడ్ కమర్షియల్ హిట్

ఇక అఖిల్ విషయానికి వస్తే..హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ ,ఏజెంట్ వంటి ప్లాపు సినిమాల్ని మూట గట్టుకున్న ఈ అయ్యగారికి తొలి సాలిడ్ కమర్షియల్ హిట్ అందించిన సినిమా లెనిన్.ఈ సినిమాకి మురళి కృష్ణ అబ్బూరు దర్శకత్వం వహించగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన సంగతి తెల్సిందే.

ALSO READ:టాక్సిక్ ప్లాప్.. చేతిలో మాత్రం భారీ ప్రాజెక్టులు! యష్ లెక్కేంటో?

అయితే వీటి మధ్య లో చేయాలనుకున్న అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కాంబినేషన్‌లోని మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం హోల్డ్‌లో పడినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న ఈ వార్తల్లో ఏవి నిజమవుతాయో !

Tags

Related News

రామ్‌ను ఢీకొట్టేది జెనీలియా భర్తేనట.. సినిమా లెక్కే మారిపోనుందా?

ఆ తమిళ డైరెక్టర్ తో సినిమా చేయటం డ్రీమ్..నాని కల నెరవేరేనా?

టాక్సిక్ ప్లాప్.. చేతిలో మాత్రం భారీ ప్రాజెక్టులు! యష్ లెక్కేంటో?

ప్యారడైజ్ విషయంలో కీర్తి సురేష్ సీరియస్.. అసలు మ్యాటర్ చెప్పిన నాని!

పిల్లలు పుట్టాక మీ భార్యలను వదిలేస్తారా? మాధవీలత ఘాటు వ్యాఖ్యలు

సంక్రాంతి రేసులోనే ‘కాకా’ మేకర్స్ క్లారిటీ.. ‘విశ్వంభర’ వెనక్కి తగ్గాల్సిందేనా!

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ‘గబ్బర్ సింగ్’ రమేష్.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

Big Stories

Advertisement
×