E-Paper
Advertisement

‘నేనూ ఒకప్పుడు డెలివరీ బాయ్‌గా చేశా’.. వైరల్ వీడియో పై అఖిల్ రాజ్ క్లారిటీ!

‘నేనూ ఒకప్పుడు డెలివరీ బాయ్‌గా చేశా’..  వైరల్ వీడియో పై అఖిల్ రాజ్ క్లారిటీ!
Advertisement

Akhil Raj: ఫుడ్ డెలివరీ బాయ్ పై దాడి చేసిన ఘటనలో అసలు విషయం జరిగింది ఇది అంటూ క్లారిటీ ఇచ్చుకొచ్చాడు రాజు వెడ్స్ రాంబాయ్ ఫేమ్ అఖిల్ రాజ్. సోషల్ మీడియాలో తనపై సర్కులేట్ అవుతున్న రూమర్స్ లో ఎలాంటి వాస్తవం లేదని అసలు తాను ఎవరిపై అటాక్ చేయలేదని స్పష్టం చేసుకొచ్చాడు.‘‘రమేష్ అఖిల్ అనే డెలివరీ బాయ్ మా ఇంటి ఎదురుగా ఉన్న చేలం రెసిడెన్సీ ఫ్లాట్‌ నెం.201లో ఇవ్వాల్సిన పార్సిల్‌ను, మేము నివసిస్తున్న అరుణ రెసిడెన్సీ ఫ్లాట్‌ నెం.201లో ఇచ్చాడు.

అడ్రస్ సరిగ్గా చెక్ చేసు కోవాలి కదా

అయితే అడ్రస్ సరిగ్గా చూసుకోకుండా ఆ పార్సెల్ ఇవ్వడంతో ఇంట్లో వాళ్ళు ఎవరో  అది ఆర్డర్ చేశారని తన తండ్రి తీసుకున్నాడు అని తర్వాత చూస్తే అది తమది కాదని తెలిసిందని చెప్పుకోవచ్చాడు . 20 నిమిషాల తర్వాత వచ్చిన డెలివరీ బాయ్ ఆ పార్సిల్ అడగగానే అడ్రస్ సరిగ్గా చెక్ చేసు కోవాలి కదా  అని అడిగితే తాగి ఉన్న అతను రాష్ గా  సమాధానం చెప్పాడని అఖిల్ రాజ్ ఆరోపించాడు.పార్సిల్‌పై చేలం రెసిడెన్సీ క్లియర్ గా రాసి ఉంది.. ఒక ఆర్డర్‌ డెలివరీ చేసినప్పుడు ఓటీపీ, పేరు, అడ్రెస్, సరిచూసుకోవాల్సిన బాధ్యత డెలివరీ బాయ్‌కి ఉంటుంది. ఆ విషయంలో అతను తప్పు చేశాడు”అని తెలిపాడు .

వార్నింగ్ ఇచ్చాను తప్ప కొట్టలేదు

Advertisement

తెలియక ఓపెన్ చేశాం ఏమీ అనుకోకండి అని తన తల్లి అంటున్నా వినకుండా   ఫ్రీగా వస్తే ఏమైనా తీసుకుంటారా అంటూ ఆ డెలివరీ బాయ్ తన తల్లిని బూతులతో తిట్టాడని హీరో అఖిల్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు తానే కాదు ఏ కొడుకు అయినా తల్లిని తిడితే ఊరుకోడని ఆకోపంలోనే ఆ డెలివరీ బాయ్ కి  వార్నింగ్ ఇచ్చాను తప్ప కొట్టలేదని స్పష్టం తీసుకొచ్చాడు.

ALSO READ:లెనిన్’తో అయ్యగారు ఈసారైనా హిట్ కొడతారా?

Advertisement

పైగా తాను ఒకప్పుడు డెలివరీ బాయ్ గా పని చేసిన వాడినే అని,అలా ఎన్నో కష్టాలు పడి హీరో స్థాయికి వచ్చానని అలాంటిది నేనెందుకు ఒక డెలివరీ బాయ్ ని కొడతానని తెలిపాడు. నువ్వు హీరో కదా చూడు దీన్ని ఎలా వైరల్ చేస్తాను అంటూ ఆ డెలివరీ బాయ్ మొబైల్ తీసి వీడియో రికార్డ్ చేయడం మొదలెట్టడంతో తన తల్లిదండ్రులు భయపడిపోయారని తెలిపారు.

ఎండ్ కార్డ్  పడుతుందో లేక మరింత వైరల్ గా మారుతుందో

ఇక తన తల్లి డెలివరీ బాయ్ పై ఉమ్మేసింది అన్న వార్తల్లో వాస్తవం లేదని ఇంట్లో ఉన్న సి సి ఫుటేజ్ చూస్తే అన్ని తెలుస్తాయని చెప్పాడు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశానని ఒకవేళ పోలీసుల విచారణలో తన సైడ్ ఏమైనా తప్పు ఉందని తెలిపే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని వీడియోలో చెప్పుకొచ్చాడు అఖిల్ రాజ్ చూడాలి మరి ఈ క్లారిటీతో ఇష్యూ కి ఎండ్ కార్డ్  పడుతుందో లేక మరింత వైరల్ గా మారుతుందో!

Related News

అంజలికి పెళ్లి ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్

నాగ్ అశ్విన్‌కు ఆ సినిమా అంటే అంత ఇష్టమా?

ఆ క్షణం ఒంటరిని అనిపించింది..ఎమోషనల్ అయిన తారక్!

అవార్డు వేడుకకు పింక్ చీరలో వచ్చిన నిహారిక.. వెనుక అసలు కథ ఇదే!

అదే నడక.. అదే స్వాగ్.. యమదొంగను గుర్తు చేసిన తారక్!

సినిమా మీద సినిమా.. ఫలితం మాత్రం అదే! కయాదు కష్టాలు కంటిన్యూ

డ్రాగన్ కోసం వెయిటింగ్.. ఎన్టీఆర్ సినిమా పై జక్కన్న కామెంట్స్!

‘ఏష నాగుల కట్ట’ పాటతో ఫేమస్.. జంగి రెడ్డి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×